For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బి అలర్ట్ : ఖచ్చితంగా తినకూడని 10 బ్యాడ్ ఫుడ్స్ ..!!

|

కారు నడవడానికి పెట్రోల్ ఎంత అవసరమో, మన శరీరంలో అవయవాలు పనిచేయడానికి ఫుడ్ అంత అవసరం. అయితే అందుకు ఎంపిక చేసుకునే ఆహారాల పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అనారోగ్యకరమైన ఆహారాలను ఖచ్చితంగా తినకుండా నివారించడం ఆరోగ్యానికి మంచిది.

ఆహారం తీసుకొనే విషయంలో ప్రతి ఒక్కరూ శ్రద్ద తీసుకోవాలి. ప్రస్తుత రోజుల్లో బిజీ షెడ్యుల్ తో ప్రీప్యాకేజ్డ్(ముందుగా ప్యాక్ చేసిన) మరియు ప్రాసెస్ చేసిన ఆహారాల మీద ఎక్కువగా ఆధారపడుతున్నారు. కానీ, ప్రస్తుతానికి ఈ ఆహారాలకు సాటిస్ఫై అయినా... ప్రొసెస్ చేసిన ఫ్యాట్ ఫుడ్స్, సోడా, బర్గర్, డీఫ్ ఫ్రైడ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతాయి. కాబట్టి, మీరు తీసుకునే ప్రతి ఆహారం గురించి పూర్తిగా తెలుసుకోవాలి. వాటిని తినడం వల్ల ఆరోగ్యానికి కలిగే లాభాలు, నష్టాలను ఖచ్చితంగా తెలుసుకోవాలి.

ఇటువంటి ఫుడ్స్ ను రెగ్యులర్ గా తినడం వల్ల న్యూట్రీషియన్ విలువలు ఎంత వరకు శరీరానికి అందుతున్నాయో తెలుసుకోవాలి. ముఖ్యంగా ఇటువంటి ప్రీప్యాకేజ్డ్ మరియు ప్రాసెస్డ్ ఫుడ్స్ కు దూరంగా ఉండటం మంచిది. భౌతికంగా మీ శరీర ఆరోగ్యం మెరుగుపరుచుకోవడానికి, ఆర్థికంగా మనీ సేవ్ చేయడానికి ఇది ఒక మంచి సమయం.

ఈ క్రింది లిస్ట్ లో చేర్చిన కొన్ని ఆహారాలు ఆరోగ్యానికి అంత మంచివి కాబట్టి వీటిని రెగ్యులర్ డైట్ నుండి తప్పనిసరిగా నివారించాలి...

మైక్రోవోవెన్ పాప్ కార్న్స్:

మైక్రోవోవెన్ పాప్ కార్న్స్:

మైక్రోవోవెన్ లో పాప్ కార్న్ తయారు చేస్తున్నప్పుడు చిటపట శబ్దాలు చూడటానికి అందంగా ఉంటుంది.కానీ మైక్రోవోవెన్ సైడ్ లో అక్కడక్కడ పడిపోతాయి. ఇవి మిక్కిలి జన్యుపరమైనవి. ప్రొసెస్డ్ సాల్ట్ మరియు వివిధ రకాల ఫ్లేవర్స్ తో నింపిన ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. మైక్రోవోవెన్ పాప్ కార్న్ లో అధిక సోడియం మరియు డీఅసిటైల్ ఉండి ఆరోగ్యానికి హాని తలపెడుతాయి.

ప్రొసెస్డ్ మీట్:

ప్రొసెస్డ్ మీట్:

ఘనీభవించిన బర్గెర్ పట్టీస్ లేదా మీట్ బాల్స్ మీ కిచెన్ వర్క్ ను తగ్గించవచ్చు. కానీ అవి మీ శరీరంలో మరికొంత అదనపు క్యాలరీలు, ఫ్యాట్ ను పెంచవచ్చు. వీటిని తయారు చేసే వారు ఫ్రోజెన్ మీల్స్ ను హైడ్రోజెనేటెడ్ ఆయిల్స్, ప్రిజర్వేటివ్స్ మరియు ఇతర ఆర్టిఫిషియల్ పదార్థాలతో తయారు చేస్తారు. కాబట్టి తాజా మాంసాహారానికి ఎక్కువ ప్రాధన్యత ఎందుకు ఇవ్వకూడదు. తాజా మాంసాహారాన్ని తీసుకొని రిఫ్రిజరేటర్ లో నిల్వ చేసుకోవచ్చు.

డీప్ ఫ్రైడ్ ఫుడ్స్:

డీప్ ఫ్రైడ్ ఫుడ్స్:

డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ఆరోగ్యానికి హానికరం. హైటెంపరేచరల్ లో తయారుచేసిన వీటిలో అక్రిలిమైడ్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది హార్ట్ డిసీజ్, కొలెస్ట్రాల్, ఓబేసిటి, క్యాన్సర్ రిస్క్ ను పెంచుతుంది .

కెచప్:

కెచప్:

మీకు ఇష్టమైన ఫ్రెంచ్ ఫ్రైస్ కెచప్ లో డిప్ చేసి టేస్టీగా తింటూ ఎంజాయ్ చేయొచ్చు, అయితే దీన్ని తినడం వల్ల హెల్త్ రిస్క్ ఎక్కువగా ఉన్నాయి. కెచప్ లో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ మరియు ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది టేస్టీగా ఉంటుంది. అదే సమయంలో బాడీలో క్యాలరీలు, కొలెస్ట్రాల్, మరియు ఫ్యాట్స్ , ఓబేసిటి, హార్ట్ డిసీజ్, హైబ్లడ్ ప్రెజర్ రిస్క్ ను పెంచుతుంది.

సోయా సాస్:

సోయా సాస్:

సోయా పాలు లేదా సోయా ఉత్పత్తులను నాన్ ఆర్గానిక్ పదార్థాలని చాలా మందికి తెలియవు. మరియు వీటిని జన్యుపరంగా మార్పు చేసినవి అనికూడా తెలియదు. ఇంకా సోయా ఉత్పత్తులకు అలవాటు పడ్డవారు కెమికల్స్ తో ప్రొసెస్ చేయబడని టాక్సిక్ వీటిని హెక్సేన్ అనే రసాయనం ఉపయోగించి ప్రొసెస్ చేయబడ్డాయని తెలియదు. వీటి వల్ల పునరుత్పత్తి సమస్యలు మరియు పుట్టుకలతో లోపాలు దారితీస్తుంది. మీరు ఆరోగ్యకరమైన డైరీ ప్రొడక్ట్స్ ను కానీ పాల ఎంపిక కోసం చూస్తున్నట్లైతే ఇంట్లో బాగా కాచి వెన్నతీసిన పాలు ఉత్తమం.

ఎనర్జీ డ్రింక్స్:

ఎనర్జీ డ్రింక్స్:

ఎనర్జీ డ్రింక్స్ లో ఎక్కువగా కెఫిన్ మిక్స్ చేసి ఉంటుంది. మరియు మీ శరీరానికి హాని తలపెట్టే షుగర్ స్థాయిలను ఎక్కువ చేస్తుంది. కాబట్టి ఉదయం మీరు ఒక కప్పు కాఫీ తాజాగా ఇంట్లో తయారు చేసుకొనే వాటిని తాగడం మంచిది. ఇది షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది. అదేవిధంగా చెక్కర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది.

బర్గర్స్:

బర్గర్స్:

అన్ హెల్తీ ఫుడ్స్ లో బర్గర్ ఒకటి. వీటిలో కొలెస్ట్రాల్, ఫ్యాట్స్ ఎక్కువ. ఇవి బరువు పెరగడానికి కారణమవుతాయి. మరియు బ్లడ్ ప్రెజర్ ను పెంచుతుంది.

ప్యాక్డ్ ఫ్రూట్ జ్యూస్:

ప్యాక్డ్ ఫ్రూట్ జ్యూస్:

టెట్రా ప్యాక్ లో పళ్ళ రసాలు అధనపు రుచికికోసం అధిక షుగర్ మరియు ప్రిజర్వేటివ్స్ అధనంగా కలపబడుతుంది. ఇటువంటి ప్రిజర్వేటివ్ లేస్డ్ జ్యూస్ తాగడం కంటే, తాజా పండ్లతో తాయరు చేసి జ్యూసులకు అధిక ప్రధాన్యం ఇవ్వడం మంచిది. అందువల్ల మీరు మీ శరీరానికి కావల్సిన ఫైబర్ ను పొందగలుగుతారు.

మల్టీ గ్రెయిన్ బ్రెడ్:

మల్టీ గ్రెయిన్ బ్రెడ్:

మల్టీ గ్రెయిన్ (వివిధ రకాల ధాన్యాలతో)తయారు చేసి పిండి మార్కెట్లో రకరకాల ప్యాక్ లలో అందుబాటులో ఉన్నాయి. సంపూర్ణ ఆరోగ్యానికి గోధుమ జాబితాలో మొదటిది మరియు ప్రధాన అంశంగా ప్యాకెట్ మీద ప్రింట్ చేసి పదార్థాలను లిస్ట్ ను చదవాలి. లేకపోతే, సాధారణ గోధుమ పిండికి ఏవో కొన్ని సాధరాణ పిండిని మిక్స్ చేసినవి తెచ్చుకొన్నకా ప్రయోజనం ఉండదు. కాబట్టి ఇటువంటి మల్టీ గ్రెయిన్ ఆహారాలను మార్కెట్లో కొని తెచ్చుకోవడం కంటే ఇంట్లో స్వంతంగా తయారు చేసుకోవడం సులభం మరియు చాలా తక్కువ ఖర్చుకూడా. దాంతో మీరు నాణ్యమైన పదార్థాలను తీసుకొగలుగుతున్నారన్న హామీ మీకు ఉంటుంది.

English summary

Beware! Never Eat These 10 Foods Again

As petrol is essential to run a car, similarly food is also equally important for the proper functioning of the human body. But choosing the correct food is again very important. One should never eat foods that are unhealthy.
Story first published: Friday, August 26, 2016, 18:03 [IST]
Desktop Bottom Promotion