అలర్ట్: మీ ఊపిరితిత్తులు బలహీనంగా మారుతున్నాయని తెలిపే సంకేతాలు..!

సాధారణంగా.. కొన్ని లక్షణాలు కనిపిస్తే.. వాటిని చిన్న సమస్యగా భావిస్తాం. కానీ.. వాటి వల్ల.. సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవచ్చు. లంగ్ క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధి లక్షణాలు కూడా అయి ఉండవచ్చు.

Posted By:
Subscribe to Boldsky

ఇతర అవయవాల్లాగే.. ఊపిరితిత్తులు హెల్తీగా ఉండటం చాలా అవసరం. ఊపిరితిత్తులు రక్త కణాలను ఆక్సిజన్ అందించి.. శ్వాస సజావుగా అందేలా సహాయపడతాయి. కాబట్టి.. ఊపిరితిత్తులు హెల్తీగా ఉంటేనే.. మనం హెల్తీగా ఉంటాం.

lungs

కాబట్టి ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలి. అయితే మన లంగ్స్ హెల్తీగా ఉన్నాయా ? లేదా ? అనేది మనకెలా తెలుస్తుంది. ఇవాళ్ల ఊపిరితిత్తులు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు, సంకేతాలు కనిపిస్తాయో ఇప్పుడు చూద్దాం..

సాధారణంగా.. కొన్ని లక్షణాలు కనిపిస్తే.. వాటిని చిన్న సమస్యగా భావిస్తాం. కానీ.. వాటి వల్ల.. సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవచ్చు. లంగ్ క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధి లక్షణాలు కూడా అయి ఉండవచ్చు.

లంగ్స్ బలహీనంగా మారడానికి స్మోకింగ్, శ్వాస సంబంధిత సమస్యలైన ఆస్తమా, ఇతర వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా.. ప్రధాన కారణాలు. ఏ లక్షణాలనైనా సరైన సమయంలో.. గుర్తించడం, అవసరమైన మందులు తీసుకోవడం చాలా ముఖ్యం. మరి ఊపిరితిత్తులు బలహీనంగా మారాయని తెలిపే సంకేతాలు, లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం..

అలసట

చాలా తరచుగా అలసిపోవడం, రోజూ చేసే పనినే చేయడానికి ఇబ్బందిపడుతున్నారంటే.. మీ ఊపిరితిత్తులు బలహీనంగా మారుతున్నాయనడానికి ప్రధాన సంకేతం.

శ్వాస అందకపోవడం

కొన్ని మెట్లు ఎక్కగానే.. ఊపిరి ఆడకుండా.. చాలా కష్టంగా ఫీలవుతున్నారంటే.. ఊపిరితిత్తులపై దుష్ర్పభావం పడుతోందని, అవి బలహీనంగా మారుతున్నాయని సంకేతం.

శ్వాసలో సమస్య

ఊపిరితిత్తులు బలహీనంగా మారినప్పుడు.. గాలి అందించే శ్వాస నాళాలు.. సరిగా పనిచేయలేవు. దీనివల్ల ప్రతిసారి, తరచుగా గుర్రు గుర్రుమని శబ్ధం వస్తూ ఉంటుంది.

వెయిట్ లాస్

ఏ కారణం లేకుండా మీరు బరువు తగ్గుతున్నారంటే.. వెంటనే డాక్టర్ ని సంప్రదించి..చెక్ చేయించుకోవాలి. ఇవి లంగ్ డిసీజ్ ని సూచించే లక్షణం అయి ఉండవచ్చు.

ఎక్కువ మస్కస్

సాధారణంగా కంటే.. ఎక్కువ మస్కస్ ఉత్పత్తి అవుతోంది అంటే.. మీ ఊపిరితిత్తులు బలహీనంగా మారుతున్నయని సంకేతం కావచ్చు. ఒకసారి డాక్టర్ ని సంప్రదించడం మంచిది.

చెస్ట్ పెయిన్

చెస్ట్ పెయిన్ తో పాటు, దగ్గు ఉంది అంటే.. ఊపిరితిత్తుల పనితీరు సాధారణంగా లేదని.. సజావుగా సాగడం లేదని సూచిస్తుంది. కాబట్టి.. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి.

నిర్విరామంగా దగ్గు

చాలా రోజులు దగ్గు తగ్గడం లేదు అంటే.. లంగ్స్ లో ఏదో సమస్య ఉందనే సంకేతం కావచ్చు. కాబట్టి.. కంటిన్యూగా దగ్గు వస్తోంది అంటే.. డాక్టర్ ని సంప్రదించి చెక్ చేయించుకోవడం మంచిది.

కఫంతో పాటు బ్లడ్

కఫంలో బ్లడ్ చూస్తే.. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకండి. ఇది.. ఊపిరితిత్తులు డ్యామేజ్ అయ్యాయి, బలహీనంగా మారాయి అనడానికి ప్రధాన సంకేతం. కాబట్టి.. వెంటనే డాక్టర్ ని సంప్రదించి.. చెక్ చేయించుకుంటే.. మంచిది.

" కంపేర్ & బై " బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్

English summary

Beware! These Are The Signs Which Show That Your Lungs Are Getting Weak

Beware! These Are The Signs Which Show That Your Lungs Are Getting Weak. This article explains the signs and symptoms of weak lungs.
Please Wait while comments are loading...
Subscribe Newsletter