For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దంతాల మీద నల్లమచ్చలకు కారణాలు? నివారించే హోం రెమెడీస్..!

By Super Admin
|

అందమైన ముఖంలో నల్ల మచ్చ ఎలా ఇబ్బంది కలిగిస్తుందో, మీ నవ్వులో అందమైన పలు వరుస మీద బ్లాక్ స్పాట్స్ ఉంటే అంతే ఇబ్బంది కలుగుతుంది? తెల్లగా ఉన్న దంతాల మీద నల్లగా మచ్చ ఉండటం గమనిస్తుంటారు, కానీ వాటిని ఎలా తొలగించుకోవాలి అని మాత్రం తెలియదు? దంతాల మీద బ్లాక్ స్పాట్స్ ఎందుకు వస్తాయి. వాటిని తొలగించుకోవడానికి ఏం చేయాలో తెలుసుకుందాం.

దంతాల మీద ఏ ప్రదేశంలో అయినా బ్లాక్ స్పాట్స్ రావచ్చు. దంతాల లోపల లేదా పైన కూడా ఏర్పడవచ్చు . ఇవి దంతాల మీద ఎనామిల్ కారణంగా ఏర్పడుతాయి. ఇలాంటి నల్ల మచ్చలు, మరకలు, లేదా బ్లాక్ స్పాట్స్ సరైన పరిశుభ్రతను పాటించకపోవడం లేదా కొన్ని అలవాట్లు వల్ల అని తెలుస్తుంది. ఈ మరకలు లేదా మచ్చలు ఎక్కువకాకముందే కొన్ని హోం రెమెడీస్ ను ఉపయోగించి తొలగించుకోవచ్చు . ఈ హోం రెమెడీస్ ను ట్రై చేయడానికి ముందు , ఈ బ్లాక్ స్పాట్స్ కు కారణాలను కనుక్కోవాలి. దంతాల మీద బ్లాక్ స్పాట్స్ కు కారణం తెలిస్తే, చికిత్స చేసుకోవడం సులభమవుతుంది.

కారణాలు: షుగర్ ఫుడ్స్ (స్వీట్స్ )ఎక్కువగా తినడం. కార్బోనేటెడ్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం, ఇలాంటి ఆహారాలు తీసుకొన్నప్పుడు, నోట్లో కార్నర్స్ లో బ్యాక్టీరియా చేరుతుంది. షుగర్ ఫుడ్స్ ను తినడం కోసం దంతాల యొక్క ఎనామిల్ ను కూడా ఫీడింగ్ గా తీసుకోవడం వల్ల నల్ల మచ్చలు ఏర్పడుతాయి. కాబట్టి, అవసరమైతే షుగర్ ఫుడ్స్, కార్బోనేటెడ్ డ్రింక్స్ కు దూరంగా ఉండటం మంచిది . లేదా స్వీట్స్ తిన్న ప్రతి సారి నీళ్ళతో నోరు శుభ్రం చేసుకోవడం మంచిది.

1. స్మోకింగ్:

1. స్మోకింగ్:

స్మోకింగ్ కూడా దంతాలు రంగు మారడానికి కారణమవుతాయి . స్మోకింగ్ అలవాటు ఉన్న వారు, దంతాలను బ్రౌన్ లేదా బ్లాక్ కలర్ లోకి మార్చుతాయి. కాబట్టి, ఈ అలవాటును మానుకోవడం మంచిది. లేదా ఈ క్రింది సూచించిన హోం రెమెడీస్ ను ఫాలో అవ్వాలి.

2. ఎక్కువ కాఫీ లేదా టీలు తాగడం :

2. ఎక్కువ కాఫీ లేదా టీలు తాగడం :

ఎక్కువగా కాఫీలు, టీలు తాగడం వల్ల దంతాల మీద మరకలు ఏర్పడుతాయి. ఈ బెవరేజస్ లోని కెఫిన్ దంతాలను బ్రౌన్ లేదా బ్లాక్ కలర్ లోకి మార్చుతుంది .

3 టుబాకో :

3 టుబాకో :

టుబాకో నమలడం వల్ల కూడా దంతాల మీద నల్లని మచ్చలు ఏర్పడుతాయి . ఇది దంతాలకు మాత్రమే హాని కలిగించడం కాదు, మొత్తం ఆరోగ్యానికి హానికరం.

4. దంతాలు సరిగా తోమకపోవడం లేదా బ్రష్ చేయకపోవడం :

4. దంతాలు సరిగా తోమకపోవడం లేదా బ్రష్ చేయకపోవడం :

దంతాల పట్ల సరైన జాగ్రత్తలు, పరిశుభ్రత పాటించకపోవడం వల్ల , దంతాల్లో తిన్న ఆహార స్పటికలు అలాగే ఇరుక్కుపోవడం వల్ల దంతాల మీద మరకలు, మచ్చలు ఏర్పడుతాయి.

5. బ్రష్ చేయాలి:

5. బ్రష్ చేయాలి:

రోజుకు రెండు సార్లు బ్రష్ చేయాలి. ఏదైనా తిన్నప్పుడు లేదా తాగినప్పుడు ప్రతి సారి నోరు పుక్కలించి కడగాలి.

6. దంతాల మద్య ఇరుక్కును ఆహారాలను తొలగించాలి.

6. దంతాల మద్య ఇరుక్కును ఆహారాలను తొలగించాలి.

దంతాల సందులో ఆహారం ఇరుక్కోవడం వల్ల అక్కడ బ్యాక్టీరియా ఏర్పడుతుంది.

7. పచ్చి కూరలు తినడం:

7. పచ్చి కూరలు తినడం:

సెలరీ, ఆపిల్, జామ వంటి ఫైబర్ ఫుడ్స్ తినడం వల్ల దంతాలు శుభ్రపడటంతో పాటు, బ్రీత్ ఫ్రెష్ గా మారుతుంది.

8 .కెఫినేటెడ్ డ్రింక్స్ తాగడానికి స్ట్రా ఉపయోగించండి:

8 .కెఫినేటెడ్ డ్రింక్స్ తాగడానికి స్ట్రా ఉపయోగించండి:

కేఫినేటెడ్ డ్రింక్స్ తాగడానికి స్ట్రా ఉపయోగించాలి.

9. బేకింగ్ సోడ:

9. బేకింగ్ సోడ:

బ్రెష్ చేసేప్పుడు పేస్ట్ మీద కొద్దిగా బేకింగ్ సోడా చిలకరించి బ్రెష్ చేయడం వల్ల బ్లాక్ స్పాట్స్ తొలగిపోతాయి.

10. ఆరెంజ్ పీల్స్:

10. ఆరెంజ్ పీల్స్:

ఆరెంజ్ తొక్కతో దంతాల మీద రబ్ చేయడం వల్ల బ్లాక్ స్పాట్స్, మెండి మరకలు తొలగిపోతాయి, బేకింగ్ సోడా, వాటర్ మిక్స్ చేసి ఈ పేస్ట్ ను నేరుగా దంతాల మీద రబ్ చేసి , బ్రష్ చేసి నీళ్ళతో పుక్కలిస్తే మంచి ఫలితం ఉంటుంది.

11. ఉప్పు:

11. ఉప్పు:

ఉప్పు కూడా దంతాలను శుభ్రం చేస్తుంది. చిటికెడు ఉప్పు పేస్ట్ లో మిక్స్ చేసి బ్రష్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

English summary

Black Spots on the Teeth: Causes and Home Remedies

Black spots can occur anywhere on your teeth – be it on the front or at the back. They are caused by the erosion of the enamel on the teeth. The staining or black spots reflect poorly on one’s dental hygiene and general habits. If the staining is not very severe, then there are home remedies that can help you get rid of the black spots. Before trying the home remedies, it is essential to find out what is causing the black spots. This will help you address the problem accordingly.
Story first published: Friday, August 26, 2016, 18:06 [IST]
Desktop Bottom Promotion