For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బోన్ మేకర్స్ అండ్ బోన్ బ్రేకర్స్...

By Super
|

మనం పుట్టినప్పుడు మన శరీరంలో 300 ఎముకలుంటాయి, అయితే పెరిగే కొద్ది, కొన్ని ఎముకలు మెత్తబడి, కండరాల్లో కలిసిపోవడం, లేదా పెరుగుతూ (వయస్సు పెరిగేకొద్ది) ఇతర బోన్స్ తో జాయింట్గా పెరగడం వల్ల చివరకు మన శరీరంలో 206 కు చేరుతుంది! మన శరీరంలోని ఎముకలు ఎర్రరక్త కణాలను తో నిర్మితమై ఉంటుంది . మన శరీరంలో ఉండే ఎముకలో అంతర్గత అవయవాలకు రక్షణగా ఉంటుంది . ఎముకలు అంతర్గత అవయవాలు డ్యామేజ్ కాకుండా కాపాడుతాయి. కాబట్టి, అలాంటి బోన్స్ స్ట్రాంగ్ గా మరియు హెల్తీగా ఉండాలి.

వయస్సు పెరిగే కొద్ది మన శరీరంలోని ఎముకలు వీక్ గా మారుతాయి మరియు ఆస్ట్రోఫీ తిష్ట వేస్తుంది . దాంతో ఎముకలు పెలుసుగా మారడం , లేదా అరిగపోవడం వల్ల ఓస్టిరయోఫోసిస్ సమస్యకు దారితీస్తుంది. కాబట్టి, మన శరీరంలోని ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవల్సిన బాధ్యత మనదే . మన శరీరంలోని ఎముకలకు సరైన పోషకాలను అందివ్వడం ద్వారా శరీరంలో జీవక్రియలు క్రమంగా పనిచేస్తాయి .

మన శరీరంలోని ఎముకల ఆరోగ్యానికి క్యాల్షియం మరియు విటమిన్ డి ముఖ్యమైన బిల్డర్స్ వంటివి. పెద్దవారిలో క్యాల్షియం 1000 నుండి 1,200 మిల్లీగ్రాములు అవసరమవుతాయి. ఎముకలను బ్రేక్ కాకుండా బోన్ మేకర్స్ గా నిలిపే కొన్ని హెల్తీ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం...

పాలు:

పాలు:

ముఖ్యంగా ఆర్గానిక్ ఆవు పాలు, మరియు ఇతర డైరీ ప్రొడక్ట్స్ టోఫు, పనీర్, చీజ్, మరియు పెరుగు వంటి ఆహారాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

బీన్స్ :

బీన్స్ :

బీన్స్ లో కిడ్నీ బీన్స్, వైట్ బీన్స్ మరియు బ్లాక్ బీన్స్ వంటి వాటిలో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది.

ఇతర ప్రొడక్ట్స్:

ఇతర ప్రొడక్ట్స్:

సోయా ప్రొడక్ట్స్ , నువ్వులు.

నట్స్

నట్స్

అత్యంత ముఖ్యమైనవి. ముఖ్యంగా 20 బాదంలలో 75మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది.

రాగి లేదా ఫింగర్ మిల్లెట్స్:

రాగి లేదా ఫింగర్ మిల్లెట్స్:

100గ్రాముల రాగి లేదా ఫింగర్ మిల్లెట్స్ లో 344మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది.వీటిని రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాలి.

ఫ్రూట్స్ :

ఫ్రూట్స్ :

ఫ్రూట్స్ లో డేట్స్, సీతాఫలం, అరటి, జామ వంటి వాటిలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. డ్రై నట్స్ లో ఫిగ్ మీ బెస్ట్ ఫ్రెడ్, ఇంకా ఫ్రెష్ గా ఉండే ఫిగ్ లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. 5 ఫ్రెష్ఫిగ్ లో దాదాపు 90మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది.

ఆకు కూరలు:

ఆకు కూరలు:

రెగ్యులర్ డైట్ లో ఆకుకూరలను తీసుకోవడం వల్ల క్యాల్షియం పుష్కలంగా అందుతుంది . అంతే కాదు వీటి ద్వారా విటమిన్ కె మరియు పొటాషియం పుష్కలంగా అందుతాయి,.

డార్క్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్

డార్క్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్

లో పాలకూర, చైనీస్ క్యాబేజ్ టర్నిప్ వంటి వాటిలో క్యాల్షియం అధికంగా ఉంటుంది.

సాల్మన్:

సాల్మన్:

సాల్మన్ , తున , చాలా వరకూ చేపల్లో కూడా క్యాల్షియం అధికంగా ఉంటుంది. కాబట్టి, మీరు సీఫుడ్ లవర్ అయితే, సాల్మన్ ను తప్పనిసరిగా రెగ్యులర్ గా తినాలి.

సిట్రస్ ఫ్రూట్స్:

సిట్రస్ ఫ్రూట్స్:

ఆరెంజ్, గ్రేఫ్ ఫ్రూట్ మరియు ఇతర సిట్రస్ ఫ్రూట్ ను రెగ్యులర్ గా తినాలి. ఇవి అద్భుతమైన రుచిని అందివ్వడం మాత్రమే కాదు, ఎములకను బలోపేతం చేస్తాయి .

ప్రతి రోజూ వ్యాయామం చేయడం :

ప్రతి రోజూ వ్యాయామం చేయడం :

వాకింగ్, డ్యాన్సింగ్ వంటి వి చేయడం వల్ల ఎముకలు బలపడతాయి.

కార్బోనేటెడ్ డ్రింక్స్:

కార్బోనేటెడ్ డ్రింక్స్:

క్యాల్షియం లోపానికి గురిచేసే కొన్ని ఆహారాలను తెలుసుకుని ఉండటం మంచిది. ముఖ్యంగా వీటిలో క్యాన్డ్ సూప్స్, ప్రొసెస్డ్ మీట్, ఆల్కహాలు, షుగర్స్, కార్బోనేటెడ్ డ్రింక్స్, టుబాకో, సాల్ట్ మరియు కెఫిన్ వంటివి ఎముకలను పాడు చేస్తాయి . కాబట్టి వీటి వాడకాన్ని సాధ్యమైనంత వరకూ తగ్గించాలి.

క్యాల్షియం సప్లిమెంట్:

క్యాల్షియం సప్లిమెంట్:

క్యాల్షియం సప్లిమెంట్ తీసుకోదల్చిన వారు, ఎక్కువ రోజులు తీసుకోకుండా జాగ్రత్త పడాలి. లేదంటే ఇది ఐరన్ ను గ్రహిస్తుంది.

20-30ఏళ్ళలో మన శరీరంలోని ఎముకలు స్ట్రాంగ్ గా ఉంటాయి .

20-30ఏళ్ళలో మన శరీరంలోని ఎముకలు స్ట్రాంగ్ గా ఉంటాయి .

తర్వాత ఎముకలు బలహీనంగా మారుతాయి . ఎముకల్లో సాంద్రత తగ్గుతుంది , దాంతో ఎముకలకు సంబంధించిన ఓస్టిరియోఫోసిస్ , బోన్ ఫ్రాక్చర్స్ వంటి సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది . రెగ్యులర్ డైట్ లో క్యాల్షియం జోడించడం వల్ల , బోన్ సమస్యలు లేకుండా కాపాడుకోవచ్చు.

English summary

Bone Makers And Breakers....

We have 300 bones when we are born but as we grow, some bones fuse and we are left with 206 bones! Bones make red blood cells which help carry proteins and oxygen to tissues, and white blood cells which help fight infection.
Desktop Bottom Promotion