For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉదయం పరకడుపున కాఫీ తాగితే కలిగే.. సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్..!!

కాఫీలో శరీరానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి. కానీ ఖాళీ కడుపుతో.. కాఫీ తాగడం వల్ల.. చాలా భయంకరమైన.. అనారోగ్య సమస్యలు వస్తాయి. ఉదయాన్నే పరకడుపున కాఫీ తాగితే.. హైడ్రోక్లోరిక్ యాసిడ్ పెరుగుతుంది.

By Swathi
|

కప్పు కాఫీతో రోజుని ప్రారంభించడానికి మనందరం చాలా ఇష్టపడతాం. వర్కింగ్ డే అయినా, వీకెండ్ అయినా.. మంచి రిలాక్సేషన్ ఇస్తుందని మనందరం భావిస్తాం. చాలామందికి ఉదయాన్నే కాఫీ తాగడం ఒక అలవాటుగా, భాగంగా మారిపోయి ఉంటుంది.

coffee on empty stomach

కాఫీలో శరీరానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి. కానీ ఖాళీ కడుపుతో.. కాఫీ తాగడం వల్ల.. చాలా భయంకరమైన.. అనారోగ్య సమస్యలు వస్తాయి. ఉదయాన్నే పరకడుపున కాఫీ తాగితే.. హైడ్రోక్లోరిక్ యాసిడ్ పెరుగుతుంది. దీనివల్ల.. గ్యాస్ట్రిక్ సమస్య వస్తుంది.

coffee on empty stomach

ఈ యాసిడ్ ఎక్కువ మొత్తంలో ఉంటే.. ప్రొటీన్స్ జీర్ణం అవడానికి కూడా కష్టంగా మారుతుంది. దీనివల్ల బ్లోటింగ్, ఇన్ల్ఫమేషన్, ఇరిటేషన్ అలాగే.. కోలన్ క్యాన్సర్ కి కూడా కారణమవుతుంది. కాబట్టి.. ఉదయాన్నే కాఫీ తాగే అలవాటు ఉన్నా.. దాన్ని మానేయడం మంచిది.

ఉదయాన్నే పరకడుపున కాఫీ తాగితే.. కార్టిసాల్ లెవెల్స్ పెరుగుతాయి. ఇవి హార్మోన్స్ ని కంట్రోల్ చేస్తాయి. దీనివల్ల నిద్రకు ఆటంకం ఏర్పడుతుంది. అలాగే ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల చాలా నెగటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి.

coffee on empty stomach

కాబట్టి.. ఇకపై ఉదయాన్నే కాఫీ తాగడానికి ముందు ఒకటి రెండు సార్లు ఆలోచించడం మంచిది. ఒక గ్లాసు పాలు లేదా బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత కాఫీ తాగండి. ఇలా చేయడం వల్ల.. మీరు రోజుని ఎనర్జీతో మొదలుపెట్టవచ్చు.

English summary

Do You Drink Coffee in the Morning on an Empty Stomach?

Do You Drink Coffee in the Morning on an Empty Stomach?
Story first published: Friday, October 21, 2016, 17:27 [IST]
Desktop Bottom Promotion