ఎనర్జిటిక్ గా, హెల్తీగా ఉండటానికి సహాయపడే పవర్ ఫుల్ ఫుడ్స్..!

ఆరోగ్యకరమైన ఆహారం మిమ్మల్ని అలసటకి దూరంగా ఉంచడమే కాకుండా అనారోగ్యాలతో పోరాడటానికి కావాల్సిన రోగనిరోధక శక్తిని కూడా మీ శరీరంలో పెంపొదిస్తుంది. ఇక అలసటని దూరం చేసే ఆ ఆరు సూపర్ ఫుడ్స్ ఏమిటో చూద్దామా.

Subscribe to Boldsky

మనందరికీ ఎప్పుడో ఒకప్పుడు శారీరిక లేదా మానసిక అలసట వల్ల బడలిక అనిపిస్తుంది. అలసటని దూరం చేసే ఆరు సూపర్ ఫుడ్స్ ఉన్నాయి. మనకున్న బిజీ లైఫ్ స్టైల్ వల్ల అలసట అనే మాట తరచుగా వింటుంటాము. మానసికంగా లేదా శారీరకంగా అలసిపోవడం వల్ల మనం శక్తిహీనులమైపోతాం. నిద్ర రావడం లేదా మగతగా ఉండటం అనిపిస్తే అది అలసటకి సంకేతం.

మన జీవన శైలి మన అలసటకి ప్రధాన కారణం కెఫీన్ లేదా ఆల్కాహాల్ అతిగా సేవించడం. అనారోగ్యకారక ఆహారాన్ని తీసుకోవడం తదితర కారణాల వల్ల నిద్రకి ఆటంకం ఏర్పడి అలసట వస్తుంది. అలసటని దూరం చేసుకోవడానికి అనేక మార్గాలున్నాయి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని డైలీ డైట్ లో భాగం చేసుకోవడం ద్వారా అలసటని సమర్ధవంతంగా ఎదుర్కోవచ్చు. 

ఆరోగ్యకరమైన ఆహారం మీ శరీరానికి కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్స్, మినరల్స్, విటమిన్స్, ఆరోగ్యకరమైన కొవ్వుని అందిస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారం మిమ్మల్ని అలసటకి దూరంగా ఉంచడమే కాకుండా అనారోగ్యాలతో పోరాడటానికి కావాల్సిన రోగనిరోధక శక్తిని కూడా మీ శరీరంలో పెంపొదిస్తుంది. ఇక అలసటని దూరం చేసే ఆ ఆరు సూపర్ ఫుడ్స్ ఏమిటో చూద్దామా.

1.పెరుగు:

పెరుగులో ఉన్న కార్బో హైడ్రేట్స్,ప్రొటీన్లు అలసటని దూరం చేస్తాయి. మన శరీరం ఇతర ఘన పదార్ధాల కంటే పెరుగుని త్వరగా గ్రహించి తక్షణ శక్తినిస్తుంది. పెరుగులో ఉన్న ప్రో బయోటిక్స్ మన జీర్ణ వ్యవస్థకి కూడా చాలా మంచిది. రోజులో ఎప్పుడైనా సరే ఒకకప్పు పెరుగు తీసుకోండి.

2.అరటిపళ్లు:

అలసటని పోగొట్టడానికి అధ్భుతమైనది అరటి పండు. అరటి పండ్లలో ఉన్న పొటాషియం శరీరంలోని చక్కెరని శక్తిగా మారుస్తాయి. విటమిన్ బీ,సీ,పీచు పదార్ధాలు, కార్బోహైడ్రేట్లు, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు అలసటని, డీ హైడ్రేషన్ని(శరీరంలో ద్రవ పదార్ధాల అసమతుల్యం) దూరం చేస్తాయి.

3.ఓట్స్:

ఓట్స్‌లో ఉన్న కార్బో హైడ్రేట్స్ శరీరానికి, మెదడుకి కావాల్సిన శక్తినిస్తాయి.అందువల్లే ఉదయం అల్పాహారంగా తీసుకోవడానికి ఇది అధ్భుతమైన ఆహారం. ఓట్స్‌లో ఉన్న ప్రోటీన్లు,మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు మన శక్తిని పెంచుతాయి. దీనిలో ఉన్న పీచు జీర్ణక్రియలకి బాగా ఉపయోగపడుతుంది.

4.బీన్స్:

అలసటని పోగొట్టడంలో బీన్స్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. క్లిష్టమైన కార్బోహైడ్రేట్లు, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఇనుము వంటి ఖనిజాలున్న బీన్స్ మన శరీరానికి కావాల్సిన శక్తినిచ్చి అలసటని దూరం చేస్తాయి. బీన్స్‌ని ఉడికించి సలాడ్స్‌లో చేర్చి లేదా కూరల్లో చేర్చి లంచ్, డిన్నర్లలో తీసుకోవచ్చు.

5.గుమ్మడి గింజలు:

ప్రొటీన్, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లం మరియూ అనేక రకాల విటమిన్లు, ఫాస్ఫరస్,రాగి,ఇనుము తఫ్దితర ఖనిజాలున్న ఈ గింజలు అలసటని పోగొట్టడానికి మంచి ఆయుధం. గుమ్మడి గింజల్లో ఉన్న ట్రైప్టోఫాన్ అనే అమైనో ఆమ్లము మానసిక అలసటని కూడా పోగొడతాయి. దీనివల్ల మనసు ప్రశాంతత పొంది మంచి నిద్ర పడుతుంది. గుమ్మడి గింజలని వేయించి తీసుకోవచ్చు లేదా వాటిని వంటలలో చేర్చి కూడా తీసుకోవచ్చు.

6.గ్రీన్ టీ:

బాగా అలసిపోయిన రోజు ఒక కప్పు గ్రీన్ టీ తాగి చూడండి.. దానిలో ఉన్నా పాలీఫెనోల్స్ అలసటని తగ్గించి మీ శక్తిని ఇనుమడింపచేస్తాయి.గ్రీన్ టీ మీ జీవక్రియలని మెరుగుపరిచి ఆరోగ్యాన్ని కూడా చేకూరుస్తుంది. ఒక కప్పు గ్రీన్ టీ్‌లో చెంచాడు తేనే కలిపి కూడా తీసుకోవచ్చు.

" కంపేర్ & బై " బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్

English summary

Do You Feel Fatigued Too Often? Have These 6 Superfoods To Stay Energetic & Healthy

Do You Feel Fatigued Too Often? Have These 6 Superfoods To Stay Energetic & Healthy. Here are 6 superfoods to fight fatigue, have a look:
Story first published: Wednesday, November 23, 2016, 11:05 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter