చిట్టి ఆవాల్లో దాగున్న అద్భుతమైన ప్రయోజనాలు..!!

ప్రజాదరణ మరియు సులభంగా అందుబాటులో ఉండే ఆవాలు మంచి రుచిని కలిగి ఉంటాయి. ఆవాల్లో ఒమెగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు, ఐరన్, మాంగనీసు, క్యాల్షియం అధికంగా లభిస్తాయి. ఇవి జీర్ణాశయానికి ఎంతో మేలు చేస్తాయి. క్యాల్షియం

Posted By:
Subscribe to Boldsky

ఆవాలు అనేవి వంటగదిలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయి. ఆవాల సాస్ ని వంటలలో రుచి కోసం వాడతారు. హిప్పోక్రేట్ నాటి కాలంలో ఆవాలును వైద్య అనువర్తనాలుగా ఉపయోగించేవారు. ఆవ గింజలు (Mustard seeds) ఆవ మొక్కల నుండి లభించే చిన్న గుండ్రని విత్తనాలు. ఇది సాధారణంగా 1 or 2 మి.మీ. పరిమాణంలో ఉంటాయి. ఇవి పసుపు పచ్చని తెలుపు నుండి నలుపు మధ్య రంగులలో ఉంటాయి. ఇది మూడు రకాల మొక్కలనుండి లభిస్తాయి: తెలుపు, గోధుమ మరియు నలుపు రంగులలో అందుబాటులో ఉండే ఆవాలును ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఉపయోగిస్తున్నారు. గ్రీకులు, రోమన్లు, ఆసియన్లు మరియు ఆఫ్రికన్ల ఆవాల యొక్క రుచిని అన్వేషించి వారి వంటకాల్లో వాటిని చేర్చారు. ఆవాలును మొదట కొన్ని వేల సంవత్సరాల క్రితం వాడారని సంస్కృత స్క్రిప్ట్స్ లో కనపడుతుంది. అయితే, మనం ఇప్పటి రోజుల్లో ఆవాల యొక్క ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

ప్రజాదరణ మరియు సులభంగా అందుబాటులో ఉండే ఆవాలు మంచి రుచిని కలిగి ఉంటాయి. ఆవాల్లో ఒమెగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు, ఐరన్, మాంగనీసు, క్యాల్షియం అధికంగా లభిస్తాయి. ఇవి జీర్ణాశయానికి ఎంతో మేలు చేస్తాయి. క్యాల్షియం ఎముకలకు, దంతాలకు బలాన్నిస్తాయి. ఆవాల్లోని మెగ్నీషియం శరీరంలో తయారయ్యే క్యాన్సర్ కారకాలను గుర్తించి నాశనం చేస్తుంది.

ఆవాలను చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి. కారణం వీటిలోని ఘాటైన ద్రవ్యాలు పైత్యాన్ని పెంచుతాయి. కడుపు మంట, చర్మ సమస్యలు ఉన్నవారు పోపులకే పరిమితమైతే మంచిది. * మరీ అధికంగా తీసుకొంటే పైత్యం చేసి శరీర వేడిని పెంచుతాయి. దురదలు మంటలు పెరుగుతాయి, కొన్నిసార్లు కడుపులో రక్తం విరుగుతుంది. ముఖ్యంగా ఎండాకాలం, వేడి శరీరం కలవారు మితంగా తీసుకుంటే మంచిది.
అంతేకాక ఆవాలు మనకు మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇప్పుడు ఆవాలు యొక్క ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం..

క్యాన్సర్ నివారిణి

ఆవాల్లో ఉన్న గ్లూకోసినొలేట్స్ మరియు మైక్రోసినల్స్ మరియు ఫైటో కెమికల్స్ క్యాన్సర్ లెస్ ను స్టాప్ చేయడం లేదా నివారించడం జరుగుతుంది. ఆవాలులో ఉండే గ్లూకో సినోలాట మరియు మైరోసినేజ్, ఫైటోకెమికల్స్ వంటి పదార్ధాలు క్యాన్సర్ కణాల వృద్ధిని నిరోధించడంలో సహాయపడతాయి. ఇది ఖచ్చితంగా ఆవాలు యొక్క ప్రధాన ప్రయోజనలలో ఒకటిగా చెప్పవచ్చు.

ఆస్తమా నివారిస్తుంది:

ఊపిరితిత్తులు: రకరకాల కారణాలవల్ల ఊపిరితిత్తుల్లో అవలంబక కఫం అనేది పేరుకుపోతుంటుంది. ఇలాంటి కఫాన్ని ఆవాలు కరిగించి వెలుపలకు వచ్చేలా చేస్తాయి. కఫం, వాతం కారణంగా వచ్చే జలుబు, ఉబ్బసం, బ్రాంకైటిస్, నిమోనియాల్లో ఆవాలు బాగా పనిచేస్తాయి.ఆవాలు కూడా ఆస్తమా రోగులకు చాలా ప్రయోజనకరమని చెప్పవచ్చు. అవాలులో ఉండే రాగి, మెగ్నీషియం, ఇనుము మరియు సెలీనియం వంటి ఖనిజాలు ఆస్తమా దాడుల నివారణకు బాధ్యతను తీసుకుంటాయి.

బ్లడ ప్రెజర్ తగ్గిస్తుంది:

ఆవాలులో రాగి, ఇనుము, మెగ్నీషియం మరియు సెలీనియం వంటి పోషకాలు ఉండటం వలన రక్తపోటు మరియు మెనోపాజ్ ఉపశమన చికిత్సలో సహాయపడతాయి.

మైగ్రేన్ తలనొప్పి తగ్గిస్తుంది:

ఆవాల్లో ఉండే మెగ్నీషియం, తలన్నొ , మైగ్రేన్ తలనొప్పిన తగ్గించడం గ్రేట్ గా సహాయపడుతుంది.

కీళ్లు:

చల్లదనం వల్ల కీళ్లు బిగదీసుకుపోయి నొప్పిని కలిగిస్తున్నప్పుడు ఆవాలు మహత్తరంగా పని చేస్తాయి. ఇవి ఆమాన్ని కలిగించడమే కాకుండా అపక్రమంగా మారిన వాతాన్ని క్రమపద్ధతిలోకి తెస్తాయి. నొప్పిని, వాపుని నిరోధిస్తాయి. కఫ తత్వం కలిగిన వారు మసాజ్ కోసం ఆవాల నుంచి తీసిన తైలాన్ని వాడుకోవచ్చు.

జుట్టు పెరుగుదలకు :

ఆవాల నుంచి తీసిన నూనెలో విటమిన్ ఎ పుష్కలంగా లభిస్తుంది. జుట్ట బాగా పెరగానికి ఇది దోహదం చేస్తుంది. అంతేకాదు చుండ్రు నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.

యాంటీఏజింగ్ :

ఆవాల్లో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. కెరోటిన్స్, లూటిన్ , విటమిన్ ఎ, సి, కెలు అధికంగా ఉండటం వల్ల యాంటీ ఏజింగ్ గా పనిచేస్తుంది.

కోశ సమస్యలను నివారిస్తుంది:

శ్వాస సాధారణంగా ఆవాలు శ్వాసక్రియ రద్దీ సమస్యల ఉపశమనానికి సహాయపడుతుంది. ముక్కుదిబ్బడ నుండి ఉపశమనం కలిగిస్తుంది.. ఇది ముక్కులో ప్యాసేజ్ ను క్లియర్ చేసి, అసౌకర్యాన్ని తొలగిస్తుంది. జలుబు, దగ్గును నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

వ్యాధినిరోధకతను పెంచుతుంది:

ఆవాలులో ఉండే కొన్ని పోషకాలు వ్యాధులు రాకుండా నిరోదిస్తాయి. బ్రాస్సికా కుటుంబానికి చెందిన ఆవాలులోని అన్ని బాగాలు ప్రాథమిక నిర్మాణంగా ఉంటాయి.

ఆర్థ్రైటిస్ :

రుమటాయిడ్ ఆర్థరైటిస్ తో బాధ పడుతున్నవారికి ఆవాలు మంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. అవాలులో ఉండే సెలీనియం మరియు మెగ్నీషియం కంటెంట్ ఈ సమస్య నుండి ఉపశమనం కలిగించటానికి సహాయపడతాయి.

ఫైబర్ అధికంగా ఉంటుంది-మలబద్దకం నివారిస్తుంది:

ఆవాలులో ఉండే పైబర్ ఆహార జీర్ణ క్రియను మెరుగుపరచటానికి సహాయపడుతుంది. అందువలన శరీరం యొక్క మొత్తం జీవక్రియ అభివృద్ధి మరియు ప్రేగు కదలికలు మెరుగ్గా ఉంటాయి. ఆవాలలో మ్యూసిలేజ్ అనే ఒక చిక్కటి పదార్థం ఉంటుంది. ఇది మలబద్దకాన్ని నివారిస్తుంది, కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది, జీర్ణక్రియను పెంపొందిస్తుంది. నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. రోజుకు ఒక టీ స్పూన్ ఆవపిండిని తీసుకోవడం ద్వారా మలబద్దకానికి దూరంగా ఉండొచ్చు.

ఇన్ఫెక్షన్స్ కు వ్యతిరేకంగా పోరాడుతుంది:చర్మ సమస్యలను నివారిస్తుంది :

ఆవాల్లో ఉండే సల్ఫర్ కంటెంట్ శరీరంలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ న్యూట్రలైజ్ చేస్తుంది.వీటిలో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాల వల్ల ఇది చర్మం మీద ఏర్పడే ఈ రకమైన ఇన్‌ఫెక్షన్లకు మంచి మందు. మొటిమలు తగ్గించడానికి కొబ్బరి నూనెలో ఆవాలు వేయించి చల్లారిన తర్వాత ఆ నూనె వడగట్టి రాత్రి నిద్ర పోవడానికి ముందు ఈ నూనెను నీటితో కలిపి ముఖానికి పట్టించి ఉదయాన్నే కడిగేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

ఫీవర్ తగ్గిస్తుంది:

ఆవాల్లో ఎక్కుకగా చెమటలు పట్టడానికి సహాయపడుతుంది. దాంతో ఫీవర్ త్వరగా తగ్గుతుంది.

కండరాల నొప్పి తగ్గిస్తుంది:

కండరాలు స్టిప్ గా ఉన్నట్లైతే, ఇది మజిల్ పెయిన్ తగ్గిస్తుంది. గోరువెచ్చని నీటిలో వేసి తాగడం వల్ల ఖచ్చితంగా రిలీఫ్ దొరుకుతుంది.

హార్ట్ బర్న్ నివారిస్తుంది:

ఎల్లో మస్టర్డ్ సీడ్స్ లో హార్ట్ బర్న్ నివారించే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఆవాలు ఎలా ఉపయోగించాలి:
ఆవాలు రెగ్యులర్ వంటల్లో, పోపుల్లో ఉపయోగించడం వల్ల మంచి వాసన, టేస్ట్ ఉంటుంది
ఆవాలు సలాడ్స్ లో జోడించి తీసుకోవచ్చు.
ఆవాలు పికెల్స్, చట్నీస్ లో జోడించి తీసుకోవచ్చు.

 

 

" కంపేర్ & బై " బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్

English summary

Do You Know The Benefits Of Mustard Seeds For Our Health? Here Are 15 Of Them!

Mustard seeds are one of the most helpful natural ingredients that man uses on a daily basis. They are not only useful in cooking, but also are useful for medicinal applications since time immemorial.
Please Wait while comments are loading...
Subscribe Newsletter