For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అరటిపండు ఉడికించిన నీళ్లు తాగితే.. ?? షాకింగ్ బెన్ఫిట్స్..!

అరటిపండు టీ.. ఇది వినడానికి కొత్తగా ఉంది కదూ. కానీ.. ఇది చాలా హెల్తీగా, టేస్టీగా ఉంటుంది. అలాగే.. మీరు హాయిగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.

By Swathi
|

మనలో చాలామందికి నిద్రలేని రాత్రిళ్లు ఎన్నో ఉంటాయి. ఎంతో కష్టపడి ప్రయత్నిస్తే గానీ.. కొన్ని గంటలైనా నిద్రపట్టదు. ఇలా నిద్రపట్టడం లేదని.. చాలా ఇబ్బందిపడుతున్నారా ? అలా కునుకు పట్టిందో లేదో అప్పుడే.. సూర్యుడు తలుపుతట్టేశాడని బాధపడుతున్నారా ? అయితే.. ఈ సమస్యకు అమేజింగ్ సొల్యూషన్ దొరికింది.

banana water

నిద్రలో సమస్యలు రావడాన్ని ఇస్నోమియా అంటారు. పెయిన్ కిల్లర్స్, హార్ట్, బ్లడ్ ప్రెజర్ మందులు కూడా.. నిద్రరాకపోవడానికి కారణమవుతాయి. కాబట్టి నిద్రపట్టడానికి న్యాచురల్ హోం రెమెడీస్ ఫాలో అయితే.. కాస్త మెరుగైన ఫలితాలు పొందవచ్చు.

అరటిపండు టీ
అరటిపండు టీ.. ఇది వినడానికి కొత్తగా ఉంది కదూ. కానీ.. ఇది చాలా హెల్తీగా, టేస్టీగా ఉంటుంది. అలాగే.. మీరు హాయిగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. అరటిపండు తొక్కలో పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. ఇవి నిద్రలో అసౌకర్యాలను తొలగిస్తాయి. ఈ టీ తయారు చేయడానికి 10 నిమిషాల కంటే.. తక్కువ సమయం పడుతుంది. కాబట్టి.. ప్రతిరోజూ నిద్రకు ముందు దీన్ని తాగి చూడండి.

banana tea

కావాల్సిన పదార్థాలు
ఒక అరటిపండు
1 కప్పు నీళ్లు
కావాలంటే చిన్న దాల్చిన చెక్క

తయారుచేసే విధానం
అరటిపండు రెండు చివర్లు కట్ చేసుకోవాలి. తొక్కతో పాటే మరుగుతున్న నీటిలో వేయాలి. 10 నిమిషాలు ఉడికించిన తర్వాత.. ఒక గ్లాసులోకి వడకట్టుకోవాలి. ఒకవేళ ఫ్లేవర్ కావాలి అనుకుంటే.. కొద్దిగా దాల్చిన చెక్క పొడిని టీపై చల్లుకోవాలి. దీన్ని రాత్రి నిద్రపోవడానికి గంట ముందు తాగాలి.

better sleep

ఒకవేళ అరటిపండు వేస్ట్ అవుతుందని భావిస్తే.. ఉడికించిన తర్వాత.. దాల్చిన చెక్క పొడి చల్లుకుని.. మొత్తం అరటిపండుతోపాటు, నీటిని కూడా తీసుకోండి. వెచ్చగా ఉన్నప్పుడే తీసుకుంటే.. మెరుగైన ఫలితాలు పొందవచ్చు. ఇది తాగిన గంట తర్వాత హాయిగా, హ్యాపీగా నిద్రపోతారు. ఒక్కసారి ప్రయత్నించి చూడండి..

English summary

Drink Boil Bananas Liquid before bed see what happen

Drink Boil Bananas Liquid before bed see what happen. This tea takes less than 10 minutes to prepare and can be enjoyed every night before bed.
Story first published: Thursday, October 20, 2016, 17:07 [IST]
Desktop Bottom Promotion