నీళ్ళలో నానబెట్టిన 3 ఖర్జూరాలను రోజూ తింటే బాడీలో జరిగే అద్భుత మార్పులు

ఎండు ఖర్జూరాల్లో ఐరన్ కంటెంట్ మరియు ఫ్లోరైన్ అత్యధికంగా ఉంటుంది. ఎండు ఖర్జూరాల్లో విటమిన్స్, నిమిరల్స్ ఎక్కువగా ఉన్నాయి. డేట్స్ ను రెగ్యులర్ గా తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. అనేక అనారోగ్య సమస్

Posted By:
Subscribe to Boldsky

ఏ పండయినా పండుగానే బాగుంటుంది. కానీ ఖర్జూరపండు ఎండినా రుచే. నట్‌గా మారిన ఎండు ఖర్జూరంలోని నీళ్లన్నీ ఆవిరైపోవడంతో అది మరింత తియ్యగా ఉంటుంది. మెత్తని పండ్లకోసం అయితే ఇవి రంగు మారి దోరరంగులోకి రాగానే చెట్టు నుంచి తీస్తారు. అదే ఎండు ఖర్జూరాల కోసం అయితే చెట్టునే బాగా ఎండనిచ్చి తెంచుతారు. కోశాక వాటిని కొంతకాలం తేమ వాతావరణంలో ఉంచి కాస్త మెత్తబడేలా చేస్తారు. వేసవిలో ఎండుఖర్జూర నీళ్లు తాగని పసిపిల్లలు అరుదే. స్వీట్లు, పుడ్డింగ్‌లు, కేకులు, డెజర్ట్‌ల తయారీలో ఖర్జూరం ఉండి తీరాల్సిందే.

ఖర్జూరాలు 4 దశల్లో పండుతాయి. అరబిక్‌ భాషలో ఆ దశలకు వేర్వేరు పేర్లు న్నాయి. పండని పళ్లను కిమ్రి అని, పెద్దవిగా పెరిగి కరకరలాడే ఖర్జూరాలను ఖలాల్‌ అని, పక్వానికొచ్చి మెత్తబడినవాటిని రుతాబ్‌ అని, ఎండు ఖర్జూరాలను తరమ్‌ అని పిలుస్తారు. ఈ అరబిక్‌ పేర్లే ప్రపంచవ్యాప్తంగా వాడుకలో ఉన్నాయి. ఖర్జూరం విత్తనానికి 2 వేల ఏళ్ల తర్వాత కూడా మొలకెత్తే సామర్థ్యం ఉంటుంది.

అంతే కాదు ఇటువంటి డేట్స్ లో ఆరోగ్య ప్రయోజనాలు అద్భుతంగా ఉన్నాయి. ఎండు ఖర్జూరాల్లో ఐరన్ కంటెంట్ మరియు ఫ్లోరైన్ అత్యధికంగా ఉంటుంది. ఎండు ఖర్జూరాల్లో విటమిన్స్, నిమిరల్స్ ఎక్కువగా ఉన్నాయి. డేట్స్ ను రెగ్యులర్ గా తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. అనేక అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. ఇవి తినడానికి తియ్యంగా ఉంటాయి. ఎండు ఖర్జూరాలను నేరుగా తినడం కంటే నీటిలో వేసి రాత్రంతా నానబెట్టి ఉదయం పరగడుపు తిని, ఆ నీరు తాగితే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి.

కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది:

ఎండు ఖర్జూరాల్లో కొలెస్ట్రాల్ ఉండదు, చాలా తక్కువ కంటెంట్ ఉంటుంది. . డేట్స్ లో విటమిన్స్, మినిరల్స్ అత్యధికంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేయడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.

ప్రోటీన్స్ అధికంగా ఉన్నాయి:

ఎండు ద్రాక్షలో ప్రోటీన్స్, డైటరీ ఫైబర్, విటమిన్ బి1, బి2 , బి3, బి5 అధికంగా ఉన్నాయి. అలాగే వీటిలో విటమిన్ ఎ1 మరియు సి లు కూడా అధికంగా ఉన్నాయి. వీటి వల్ల శరీరం ఫిట్ గా , మజిల్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి . అందుకు జిమ్ చేసే వారిని కొన్ని రోజుల పాటు రెగ్యులర్ గా ప్రోటీన్స్ అధికంగా ఉన్న ఖర్జూరాలను తినమని సలహాలిస్తుంటారు.

విటమిన్ అధికం:

ఎండు ఖర్జూరాలల్లో విటమిన్ బి1, బి2, బి3 మరియు బి5లున్నాయి. అదే విధంగా విటమిన్ ఎ1 మరియు సిలు కూడా ఎక్కువగా ఉన్నాయి. రోజూ నానబెట్టిని డేట్స్ ను ఒకటి రెండు తినడం వల్ల ఇన్ స్టాంట్ ఎనర్జీ వస్తుంది. విటమిన్ సప్లిమెంట్ తీసుకునే అవకాశం ఉండదు. గ్లోకోజ్, ఫ్రక్టోజ్ వంటి నేచురల్ షుగర్స్ ఉండటం వల్ల ఇవి ఎనర్జీ లెవల్స్ ను మార్చుతుంది. త్వరగా మార్పు వస్తుంది. అందుకే ఆకలిగా ఉన్నప్పుడు, లేదా నీరసంగా ఉన్న ఒక్క ఎండు ఖర్జూరం తింటే చాలు మంచి ఇన్ స్టాంట్ ఎనర్జీ పొందుతారు .

బోన్ హెల్త్ మెరుగుపడుతుంది:

డేట్స్ లో సెలీనియం, మెగ్నీషియం, కాపర్, మరియు మెగ్నీషియంలు అధికంగా ఉన్నాయి. ఇవన్నీ బోన్స్ హెల్తీగా ఉండటానికి , ఓస్టిరియో ఫోసిస్ కండీషన్ ను నివారించడానికి ఇవి గ్రేట్ గా సహాయపడుతాయి.

నాడీవ్యవస్థను బలోపేతం చేస్తుంది:

డేట్స్ లో పొటాషియం, కొద్దిగా సోడియం వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇది నాడీవ్యవస్థను క్రమబద్దం చేస్తుంది. ఇందులో ఉండే పొటాషియం కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది. స్ట్రోక్ రిస్క్ ను తగ్గిస్తుంది.

ఐరన్ అధికం:

దంతాలను ఆరోగ్యంగా ఉంచే ఫోరిన్ మాత్రమే కాకుండా, ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది.. ఐరన్ లోపంతో బాధపడే వారికి ఇవి హైలీ రెకమెండ్ చేశారు . బ్లడ్ ఫ్యూరిఫై చేయడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

జీర్ణ శక్తిని పెంచుతుంది:

నీటిలో నానబెట్టిన ఎండు ఖర్జూరాలను తినడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ హెల్తీగా ఉంటుంది. మలబద్దక సమస్య ఉన్నవారికి ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:

డేట్స్ లో ఉండే విటమిన్ సి, డిలు స్కిన్ ఎలాసిటిని పెంచుతాయి. దాంతో చర్మం స్మూత్ గా మారుతుంది. చర్మ సమస్యలను నివారిస్తుంది. వీటిని రెగ్యులర్ గా తినడం వల్ల దీర్ఘకాలంలో ఇవి చర్మఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. డేట్స్ లో యాంటీఏజింగ్ బెనిఫిట్స్ అధికంగా ఉన్నాయి. అలాగే మెలనిన్ ను శరీరంలో చేరకుండా నివారిస్తుంది.

హ్యాంగోవర్ సమస్యను తగ్గిస్తుంది:

చాలా మందికి ఈ విషయం తెలిసుండకపోవచ్చు. హ్యాంగోవర్ చిక్కులను నివారించడంలో ఇది గ్రేట్ గా సహాయపడుతుంది. వీటిని రాత్రుల్లో నీళ్ళలో నానబెట్టి తినడం వల్ల మరిన్ని గొప్ప ప్రయోజనాలున్నాయి.

బరువు పెరగడానికి సహాయపడుతుంది:

డ్రై డేట్స్ లో ఉండే షుగర్స్, ప్రోటీన్స్, మరియు ఇతర విటమిన్స్ బరువు పెరగడానికి సహాయపడుతుంది. బరువు పెరగాలనుకునే వారికి ఇది హెల్తీ ఫుడ్. అయితే కీరదోసకాయతో కలిపి తీసుకుంటే, బరువు కంట్రోల్లో ఉంటుంది.

" కంపేర్ & బై " బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్

English summary

Eat 3 Dates Daily and These 5 Things will Happen to Your Body!

From the time it was discovered, which was thousands of years ago, dates were known to have healing powers. And while science has proved that for sure, we love to eat them mostly because of how delicious these dark fruits are. According to history, date palm is known to have come from what is now Iraq, however Egyptians were known to have made wine with dates a lot earlier as well.
Please Wait while comments are loading...
Subscribe Newsletter