ఇమ్యునిటి పెంచి, ఇన్ఫెక్షన్ ని అడ్డుకునే పవర్ ఫుల్ ఫుడ్స్..!

మీరు తరచుగా అనారోగ్యానికి గురవుతున్నారా ? దగ్గు, జలుబు ఏమాత్రం తగ్గడం లేదు. కంటిన్యూగా.. తుమ్ములతో ఇబ్బందిపడుతున్నారా ? ఇవన్నీ మీ ఇమ్యునిటీ సిస్టమ్ బలహీనంగా ఉందని సంకేతం. కాబట్టి వెంటనే అలర్ట్ అవ్వాలి

Posted By:
Subscribe to Boldsky

మీరు తరచుగా అనారోగ్యానికి గురవుతున్నారా ? దగ్గు, జలుబు ఏమాత్రం తగ్గడం లేదు. కంటిన్యూగా.. తుమ్ములతో ఇబ్బందిపడుతున్నారా ? ఇవన్నీ మీ ఇమ్యునిటీ సిస్టమ్ బలహీనంగా ఉందని సంకేతం. కాబట్టి వెంటనే అలర్ట్ అవ్వాలి.

immunity foods

ఇమ్యునిటీ లెవెల్ పెరగడానికి ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. ఈ న్యాచురల్ ఫుడ్స్.. మీ ఇమ్యునిటి పెంచడానికి సహాయపడతాయి. వైరస్, బ్యాక్టీరియాతో.. ఇమ్యునిటీ సిస్టమ్ పోరాడుతుంది. అలాగే హానికారక క్రిములు, ఇన్ఫెక్షన్స్ కి వ్యతిరేకంగా పోరాడతాయి.

మీ వ్యాధినిరోధక శక్తి పడిపోయింది అంటే.. అనేక వ్యాధులు, సాధారణంగా జలుబు, దగ్గు ఎక్కువగా ఇబ్బందిపెడతాయి. సరైన డైట్ ఫాలో అవడం వల్ల శరీర వ్యాధినిరోధక శక్తి పెరగడానికి సహాయపడుతుంది, అనేక వ్యాధులతో పోరాడుతుంది.

డైట్ మాత్రమే కాకుండా.. ఒత్తిడి కూడా తగ్గించుకోవడం చాలా అవసరం. అప్పుడే.. వ్యాధినిరోధక శక్తి.. సజావుగా ఉంటుంది. మరి శరీర ఇమ్యునిటీని పెంచే కొన్ని ఆహారాల లిస్ట్ ఇక్కడ ఉంది. వీటిని డైట్ లో చేర్చుకుంటే.. కొన్ని ఇన్ఫెక్షన్స్ కి దూరంగా ఉండవచ్చు.

వెల్లుల్లి

వెల్లుల్లి యాంటీ బయోటిక్ లా పనిచేస్తుంది. ఇది ఇమ్యునిటిని మెరుగుపరిచి.. దగ్గు, జలుబుతో పోరాడుతుంది. దీన్ని డైలీ ఫుడ్ లో వెల్లుల్లి చేర్చుకోవడం లేదా ప్రతి రోజూ 2 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి.

సిట్రస్ ఫ్రూట్స్

ఆరంజ్, నిమ్మ, గ్రేప్ ఫ్రూట్స్ వంటి వాటిల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. ఇవి ఇమ్యునిటినీ మెరుగుపరుస్తుంది. దీనివల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్ నైనా అరికట్టవచ్చు.

పసుపు

పసుపులో ఉండే కర్క్యునిమ్ ఉంటుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది న్యాచురల్ గా ఇమ్యునిటిని మెరుగుపరుస్తుంది. కూరల్లో లేదా అరటీస్పూన్ పసుపుని ఒక గ్లాసు వేడిపాలలో కలపుకుని బాగా కలిపి రాత్రి పడుకునే ముందు తాగితే.. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.

నట్స్

కొద్దిగా హెల్తీ ఫ్యాట్ ని డైట్ లో చేర్చుకుంటే.. ఇమ్యునిటి లెవెల్ కంట్రోల్ లో ఉండి.. ఎలాంటి ఇన్ఫెక్షన్ అయినా.. దరిచేరకుండా ఉంటుంది. హెల్తీ ఫ్యాట్ ఉండే ఆహారాలు, డ్రైఫ్రూట్స్ తీసుకుంటే.. ఇమ్యునిటీ లెవెల్ పెరుగుతుంది.

పెరుగు

పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. అలాగే ఇమ్యునిటీ లెవెల్ పెరగడానికి సహాయపడుతుంది. ప్రతిరోజూ ఒక కప్పు పెరుగు తీసుకోవడం వల్ల ఇమ్యునిటీ పెరుగుతుంది.

గ్రీన్ టీ

గ్రీన్ టీలో ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి ఇమ్యునిటీని మెరుగుపరిచి.. అనారోగ్యం పాలవకుండా ఇన్ఫెక్షన్స్ రాకుండా చేస్తాయి. రోజుకి రెండుసార్లు గ్రీన్ టీ తాగాలి.

తేనె

తేనెలో యాంటీ బ్యాక్టిరియల్, యాంటీ మైక్రోబైల్ గుణాలుంటాయి. ఒక టీస్పూన్ తేనె తీసుకోవడం వల్ల ఇమ్యునిటీ లెవెల్ పెరుగుతుంది.

గ్రీన్ వెజిటబుల్స్

పాలకూర, బ్రొకోలిని ప్రతిరోజూ డైట్ లో చేర్చుకోవడం వల్ల.. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో ఐరన్, విటమిన్స్, మినరల్స్, ఇతర పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల ఇమ్యునిటి లెవెల్ పెరుగుతుంది.

" కంపేర్ & బై " బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్

English summary

Eat These To Build Your Immunity Level & Prevent Infections

Eat These To Build Your Immunity Level & Prevent Infections. When the immunity level is low, people tend to contract infections very easily. There are a few foods which can help to build your immunity.
Please Wait while comments are loading...
Subscribe Newsletter