గుండెజబ్బుల నివారణకు పవర్ ఫుల్ ఫుడ్స్ !

ఆధునిక జీవనశైలితో ఇటీవల డయాబెటిస్ ఉండటం, హైబీపీతో బాధపడటం ఎక్కువ. ఇవి వచ్చేయంటే గుండెజబ్బు ఖాయంగా ఉన్నట్లుగా భావించి, డాక్టర్లు ముందునుంచే నివారణ చర్యలు చేపడుతుంటారు. ఆహారంతో వీటిని నివారించడమూ తేలికే

Posted By:
Subscribe to Boldsky

ఆధునిక జీవనశైలితో ఇటీవల డయాబెటిస్ ఉండటం, హైబీపీతో బాధపడటం ఎక్కువ. ఇవి వచ్చేయంటే గుండెజబ్బు ఖాయంగా ఉన్నట్లుగా భావించి, డాక్టర్లు ముందునుంచే నివారణ చర్యలు చేపడుతుంటారు. ఆహారంతో వీటిని నివారించడమూ తేలికే.

డయాబెటిస్ ఉన్న వాళ్లూ, హైబీపీ ఉన్నవాళ్లు తమ ఆహారంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే గుండెజబ్బులను నివారించవచ్చు. అలాగని కేవలం వాళ్లు మాత్రమే కాదు... ఆరోగ్యవంతులూ వీటిని పాటిస్తే గుండెజబ్బులను చాలా వరకు దూరంగా ఉంచుకోవచ్చు.

కార్బొహైడ్రేట్స్

మీరు తీసుకునే ఆహారంలో పీచు, కార్బొహైడ్రేట్స్ వంటి పదార్థాలు ఎక్కువగా లభ్యమయ్యేలా చూసుకోండి. ఇందుకోసం జొన్న, మొక్కజొన్న, గోధుమ, దంపుడుబియ్యం, మొలకెత్తిన గింజలు, పళ్లూ, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. కొవ్వు పదార్థాలైన నెయ్యి, వెన్న, జున్ను, మీగడ వంటి పదార్థాలను బాగా తగ్గించాలి.

లో-ఫ్యాట్ పాల ఉత్పాదనలు

తక్కువగా కొవ్వులు ఉండే లో-ఫ్యాట్ పాల ఉత్పాదనలు వాడాలి.

స్కిన్‌లెస్ చికెన్‌ను

మాంసాహారం తీసుకునేవారు స్కిన్‌లెస్ చికెన్‌ను తినాలి. వాటిని ఆరోగ్యకరంగా వండాలి. అంటే వేపుళ్లు వంటివి కాకుండా ఉడికించినవి అన్నమాట.

సాల్మన్, హెర్రింగ్

ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ ఉండే సాల్మన్, హెర్రింగ్ వంటి చేపలను వారంలో కనీసం రెండు సార్లు తినాలి.

నట్స్‌లో

తాము ఇప్పటికే ఎక్కువ బరువు ఉన్నామని కొందరు నట్స్ తీసుకోరు. అయితే చాలా అధ్యయనాల ప్రకారం నట్స్‌లో పీచుపదార్థాలు, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు ఎక్కువ. పైగా అవి చెడు కొలెస్ట్రాల్‌ను నివారిస్తాయి కూడా. అందుకే పరిమితంగానైనా తీసుకోవాలి.

అవిశెలను (ఫ్లాక్స్ సీడ్స్‌ను)

అవిశెలను (ఫ్లాక్స్ సీడ్స్‌ను) ఆహారంలో తప్పక తీసుకోవాలి.

తృణధాన్యాలు

హైపర్‌టెన్షన్ ఉన్నవాళ్లకు పళ్లు, కూరగాయులు, ఆకుకూరలు పుష్కలంగా ఇవ్వాలి. వాటిలో పొటాషియుమ్ పాళ్లు ఎక్కువ కాబట్టి ఆ ఆహారం తీసుకోవడం ప్రధానం. తాజాపళ్లు, పొట్టు ఉన్న తృణధాన్యాలు ఆహారంలో ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.

క్యాల్షియుం

అలాగే వాళ్లకు క్యాల్షియుం కూడా అవసరం. ఇందుకోసం వాళ్లు కొవ్వు పాళ్లు (వెన్నపాళ్లు) తక్కువగా ఉన్న పాలూ, పాల ఉత్పాదనలు తీసుకోవాల్సి ఉంటుంది.

ఉప్పు (సోడియుం) పాళ్లను గణనీయంగా తగ్గించాలి.

ఉప్పు (సోడియుం) పాళ్లను గణనీయంగా తగ్గించాలి. ఉప్పుతో పాటు సోడియుం పాళ్లు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలైన నిల్వ ఆహారం (ప్రిజర్వ్‌డ్ ఫుడ్స్), బేకరీ ఐటమ్స్, పచ్చళ్లు, అప్పడాలు (పాపడ్), క్యాన్డ్ ఫుడ్స్ పూర్తిగా తగ్గించాలి.

వ్యాయామం:

చురుగ్గా ఉండటానికీ, షుగర్‌ను అదుపులో ఉంచుకోడానికీ ఎక్సర్‌సైజ్ బాగా దోహదపడుతుంది. కాబట్టి క్రమం తప్పకుండా వ్యాయామం అవసరం.
అయితే ఇవన్నీ సాధారణ నియమాలు మాత్రమే. ఒక్కొక్కరికీ తమ వ్యక్తిగతమైన అంశాలకు తగినట్లుగా వ్యక్తిగతమైన డైట్ ప్లాన్... అంటే డీటెయిల్డ్ న్యూట్రిషనల్ ప్లాన్ అవసరం. ఒకరు ఎంత బరువున్నారు, వారి దైనందిన యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి. వాళ్లలో ప్రస్తుత బ్లడ్ సుగర్ లెవెల్స్ ఏమిటి, చక్కెరను కంట్రోల్ చేయడానికి వారు వాడుతున్న మందులు ఏమిటి... అనేక రకరకాల అంశాల ఆధారంగా ఎవరికైనా చక్కటి డీటెయిల్డ్ న్యూట్రిషన్ ప్లాన్ తయారు చేయాల్సి ఉంటుంది.

" కంపేర్ & బై " బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్

English summary

Eat These Foods to Prevent Heart Disease

Heart is one of the most vital body organs that always keeps you on the go. The main function of the heart is to pump blood throughout your body, which will thereby help all your organs to receive oxygen and other nutrients.
Please Wait while comments are loading...
Subscribe Newsletter