For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్లూ వ్యాక్సిన్ వల్ల టైప్ 2 డయాబిస్ పేంషట్స్ లో పక్షవాతం రాదు: స్టడీ రివీల్స్

By Super Admin
|

టైప్-2 డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఫ్లూ వ్యాక్సీన్ తీసుకుంటే స్ట్రోక్ మరియూ హార్ట్ ఫెయిల్యూర్ల వల్ల హాస్పిటల్లో చేరడాన్ని అరికట్టవచ్చని ఇటీవల ఒక అధ్యయనంలో నిరూపించబడింది.

ఈ వ్యాక్సీన్ తీసుకున్న వారిలో ఫ్లూ వల్ల సంభవించే మరణాల రేటు తీసుకోని వారిలో కంటే 24 శాతం తక్కువగా కూడా ఉందని కూడా ఈ అధ్యనంలో తేలింది.

ఇంపీరియల్ కాలేజీ లండన్ కి చెందిన రచయిత ఎజ్టర్ వామోస్ ఎమంటారంటే, "టైప్-2 డయాబెటీస్ ఉన్నవారిలోనే ఫ్లూ మరణాలు ఎక్కువగా సంభవిస్తాయి.

Flu vaccine

ఈ వ్యాక్సీన్ టైప్-2 డయాబెటీస్ ఉన్న వారికి బాగా ఉపయోగరకంగా ఉంటుంది. దీనివల్ల ఫ్లూ సీజన్లో ఫ్లూ వల్ల మరణాల శాతాన్ని తగ్గించడమే కాకుండా స్ట్రోక్ లాంటివి రాకుండా కూడా కాపాడుతుంది.

టైప్-2 డయాబెటీస్ ఉన్న రోగులలో రక్తం లో చక్కెర శాతం అదుపులో ఉండదు.అందువల్ల వారు హృదయ సంబంధిత రోగాలయిన స్ట్రోక్ లాంటి వ్యాధుల బారిన పడే ఆస్కారం ఉంది.రక్తంలో చక్కెర శాతం పెరగడం వల్ల రక్త నాళాలు దెబ్బతిని స్ట్రోక్ వస్తుంది.

హృదయ సంబంధిత వ్యాధులున్నవారిలో ఫ్లూ వల్ల స్ట్రోక్ వచ్చే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది.

బ్రిటీష్ దేశానికి చెందిన 124,503 మంది టైప్-2 డయాబెటీస్ ఉన్న పెద్దవారిని ఈ అధ్యయనం కోసం 2003-2010 మధ్యలో పరిశీలించారు.వీరిలో 65 శాతం మందికి ఫ్లూ వ్యాక్సీన్ ఇచ్చారు.వ్యాక్సీన్ తీసుకున్న వారికంటే తీసుకోని వారే 30 శాతం అధికంగా స్ట్రోక్ తదితర హృద్రోగాలతో హాస్పిటల్లో చేరాల్సొచ్చింది.తీసుకున్న వారిలో హార్ట్ ఫెయిల్యూర్ 22 శాతం, నిమోనియా మరియూ ఇన్‌ఫ్లుయెంజా వల్ల హాస్పిటల్లో చేరేవారి శాతం 15 శాతం వ్యాక్సీన్ తీసుకోని వారికంటే తక్కువగా ఉందిట.

ఇంకా వ్యాక్సీన్ తీసుకున్న వారిలో మరణాల శాతం తీసుకోని వారి కంటే 24 శాతం తక్కువగా ఉంది.ఈ అధ్యయన ఫలితాలని కెనడియన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్లో (సీ.ఎం.ఏ.జే)లో ప్రచురించారు.

English summary

Flu Vaccine May Cut Heart Failure Risk In Diabetes Patients: Finds Research

Flu vaccine may reduce the likelihood of being hospitalised with stroke and heart failure in people with type 2 diabetes, a new research has found.
Story first published: Tuesday, August 23, 2016, 18:26 [IST]
Desktop Bottom Promotion