For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెల్తీగా ఉండటానికి రాత్రిపూట ఖచ్చితంగా తినాల్సినవి..!

డిన్నర్ రోజులో చివరి భోజనం. డిన్నర్ తర్వాత నిద్రపోతాం. కాబట్టి.. ఇది చాలా లైట్ గా ఉండాలి.. అలాగే హెల్తీ ఫుడ్ అయి ఉండాలి. అలాగే.. ఆహారం ఆరోగ్యకరమైనదై ఉండటమే కాకుండా.. సరైన సమయంలో తీసుకోవడం అవసరం.

By Swathi
|

రోజులో మొదటి ఆహారమైన బ్రేక్ ఫాస్ట్ హెల్తీ అయి ఉండాలని ప్రతిఒక్కరూ.. సూచిస్తారు. ఇది రోజంతా ఎనర్జిటిక్ గా ఉండటానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది. అలాగే.. రాత్రి తినే ఆహారం విషయంలో కూడా చాలా కేర్ ఫుల్ గా ఉండడం అవసరం.

foods to eat at night

డిన్నర్ రోజులో చివరి భోజనం. డిన్నర్ తర్వాత నిద్రపోతాం. కాబట్టి.. ఇది చాలా లైట్ గా ఉండాలి.. అలాగే హెల్తీ ఫుడ్ అయి ఉండాలి. అలాగే.. ఆహారం ఆరోగ్యకరమైనదై ఉండటమే కాకుండా.. సరైన సమయంలో తీసుకోవడం కూడా చాలా ముఖ్యం.

చాలామందికి బెల్లీ ఫ్యాట్ రావడం చూస్తేనే ఉంటాం. దీనికి ప్రధాన కారణం.. రాత్రిపూట తీసుకునే ఆహారమే. రాత్రిళ్లు తీసుకునే ఆహారం అదనపు బరువు పెరగడానికి కారణమవుతుంది. ఫాస్ట్ ఫుడ్స్, ఫ్రోజెన్, ఆయిలీ ఫుడ్స్, నాన్ వెజ్ వంటివి రాత్రిపూట తీసుకునేవాళ్లలో.. ఫ్యాట్ ఎక్కువగా పొట్ట చుట్టూ పెరుగుతుంది. అలాగే ఇలాంటి ఫ్యాట్ తొలగించడం కూడా.. చాలా కష్టంగా మారుతుంది.

రాత్రి భోజనం చేసిన తర్వాత.. ఫిజికల్ యాక్టివిటీ తగ్గుతుంది. కాబట్టి.. ఇలాంటి ఆహారాలు.. జీర్ణక్రియకు సమస్య తీసుకొచ్చి, ఒబేసిటీ, అధిక బరువు సమస్యలకు కారణమవుతుంది. కాబట్టి.. హెల్తీగా ఉండాలంటే.. రాత్రిపూట తేలికగా డైజెస్ట్ అయ్యే ఆహారాలు తీసుకోవాలి. మరి అలాంటి ఫుడ్స్ ఏంటో చూద్దాం..

మజ్జిగ

మజ్జిగ

పెరుగుకి బదులు.. రాత్రిపూట మజ్జిగ తీసుకోవడం మంచిది. ఇది పొట్టను చల్లగా ఉంచడమే కాకుండా.. జీర్ణక్రియ సజావుగా సాగడానికి సహాయపడుతుంది.

ఆకుకూరలు

ఆకుకూరలు

ఆకుకూరల్లో ముఖ్యమైన పోషకాలు, ఫైబర్ ఉంటాయి. వీటిని రాత్రిపూట తినడం వల్ల హెల్తీగా ఉంటారు. ఇవి జీర్ణక్రియ మెరుగుపడటానికి సహాయపడతాయి.

చపాతీలు

చపాతీలు

అన్నంలో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కాబట్టి.. రాత్రిపూట రైస్ తీసుకోకపోవడం మంచిది. అన్నంకి బదులు.. చపాతీలు తీసుకుంటే.. చాలా త్వరగా, తేలికగా జీర్ణమవుతాయి.

అల్లం

అల్లం

అల్లం జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఒక చిన్న ముక్క అల్లంను రాత్రిపూట తీసుకోవడం వల్ల.. ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది.

పప్పు

పప్పు

ప్రొటీన్స్ పుష్కలంగా ఉండే పప్పును రాత్రిపూట ఆహారంలో చేర్చుకోవడం వల్ల.. మీరు హెల్తీగా ఉండవచ్చు. ఇది కాసేపు పొట్ట నిండుగా ఉన్న ఫీలింగ్ కలిగించి.. ఇతర ఆహారాలు తీసుకోకుండా అడ్డుకుంటుంది.

పాలు

పాలు

రాత్రిపూట భోజనంలో తక్కువ ఫ్యాట్ ఉండే పాలను చేర్చుకోవడం హెల్తీ హ్యాబిట్. ఇందులో ప్రొటీన్ పొందవచ్చు. అలాగే హెల్తీగా ఉండటానికి అవసరమయ్యే మంచి ఫ్యాట్స్ పొందవచ్చు.

తేనె

తేనె

రాత్రిపూట డిన్నర్ లో చేర్చుకునే హెల్తీ ఫుడ్స్ లో.. తేనె ఒకటి. పంచదారకు బదులుగా తేనె ఉపయోగించడం చాలా మంచిది. ఇది.. శరీర మెటబాలిజం సక్రమంగా జరగడానికి సహాయపడుతుంది.

English summary

Foods You Should Eat At Night To Stay Healthy

Foods You Should Eat At Night To Stay Healthy. Having healthy and at the same time light food during the night is extremely important.
Story first published: Tuesday, October 18, 2016, 16:24 [IST]
Desktop Bottom Promotion