For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వెల్లుల్లి మిల్క్ లో దాగున్న అద్భుత ఔషధ గుణాలు..!

ఎలాంటి చిన్న ఇన్ఫెక్షన్ ఉన్నా.. వెల్లుల్లి తీసుకుంటే ఇట్టే తగ్గిపోతుంది. అయితే వెల్లుల్లిని పాలలో కలిపి తీసుకోవచ్చు. ఇలా తాగడం కాస్త కష్టంగానే ఉన్నప్పటికీ ఇందులోని ఔషధ గుణాలు మాత్రం అద్భుతమైనవి.

By Swathi
|

వెల్లుల్లి తినడానికి కొంతమంది అసహ్యించుకుంటారు. కొంతమంది ఇందులోని ఆరోగ్య ప్రయోజనాల వల్ల ఇబ్బందిగా, ఇష్టం లేకపోయినా ఏదో ఒక రూపంలో తీసుకుంటారు. అయితే వెల్లుల్లి మిల్క్ అనేది కాస్త కొత్తగా ఉన్నప్పటికీ ఇందులోని అమేజింగ్ బెన్ఫిట్స్ మాత్రం ఎవరూ ఊహించలేనివి.

వెల్లుల్లిలోని అద్భుత ప్రయోజనాలను శరీరానికి అందించడం కోసం వెల్లుల్లిని ఇండియన్స్ వంటకాల్లో ఎక్కువగా వాడతారు. వెల్లుల్లి.. ఘాటు తగలనిదే.. చట్నీ కూడా పసందుగా ఉండదు. ఎలాంటి వంటకానికైనా.. వెల్లుల్లి రుచి తప్పనిసరిగా జోడించడం.. మన ఇండియన్స్ కి బాగా అలవాటు. కూర, చారు, సాంబార్ ఎందులో అయినా.. వెల్లుల్లి వాడతారు.

వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉండటం వల్ల.. ప్రతి ఒక్కరూ.. వెల్లుల్లిని ప్రతి రోజూ తీసుకోవాలని నిపుణులు సూచిస్తూ ఉంటారు. ఎలాంటి చిన్న ఇన్ఫెక్షన్ ఉన్నా.. వెల్లుల్లి తీసుకుంటే ఇట్టే తగ్గిపోతుంది. అయితే వెల్లుల్లిని పాలలో కలిపి తీసుకోవచ్చు. ఇలా తాగడం కాస్త కష్టంగానే ఉన్నప్పటికీ ఇందులోని ఔషధ గుణాలు మాత్రం అద్భుతమైనవి.

థెరపిటిక్ గుణాలు

థెరపిటిక్ గుణాలు

వెల్లుల్లిలో థెరపిటిక్ గుణాలు పుష్కలంగా ఉంటాయని.. అనేక మంది హెల్త్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు.

ఆస్తమా

ఆస్తమా

ఆస్తమాతో బాధపడేవాళ్లు ప్రతిరోజూ ఎక్కువ వెల్లుల్లి తీసుకోవాలి. ఫ్యూమోనియాతో బాధపడేవాళ్లు ఒక గ్లాసు గార్లిక్ మిల్క్ ని రోజుకి మూడు సార్లు తీసుకుంటే..ఆ లక్షణాల నుంచి వెంటనే బయటపడవచ్చు.

గుండెకు

గుండెకు

బ్లడ్ లో కొలెస్ట్రాల్ పేరుకున్నప్పుడు గుండె సంబంధిత వ్యాధులకు కారణమవుతుంది. ఇది ఆర్థరైటిస్ కి రక్తప్రసరణ జరకకుండా అడ్డుకుంటుంది.

సర్క్యులేటరీ సిస్టమ్

సర్క్యులేటరీ సిస్టమ్

సర్క్యులేటరీ సిస్టమ్ లో సమస్య వస్తే.. శరీరం మొత్తానికి సమస్య వస్తుంది. అలాంటప్పుడు వెల్లుల్లి మిల్క్ తీసుకుంటే.. ఇది చాలా ఎఫెక్టివ్ గా ఈ సమస్యను నివారిస్తుంది.

కామెర్లు

కామెర్లు

కాలేయంలో టాక్సిన్స్ పేరుకుంటే.. కాలేయంపై ఒత్తిడి పెరుగుతుంది. ఇలాంటప్పుడు వెల్లుల్లి చాలా ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది. కాలేయాన్ని క్లెన్స్ చేసి టాక్సిన్స్ ని తొలగిస్తుంది. అలాగే కామెర్లను కూడా నయం చేస్తుంది.

కీళ్ల నొప్పులు

కీళ్ల నొప్పులు

కీళ్లలో వాపు వల్ల ఆర్థరైటిస్ సమస్య వస్తుంది. కాబట్టి వెల్లుల్లి మిల్క్ తీసుకుంటే.. ఈ సమస్య నుంచి త్వరగా బయటపడవచ్చు. వెల్లుల్లి మిల్క్ త్వరగా సమస్య నుంచి బయటపడటానికి సహాయపడుతుంది.

నిద్రలేమి

నిద్రలేమి

చాలామందిని ఇబ్బందిపెట్టే సమస్య నిద్రలేమి. ఈ సమస్యతో బాధపడేవాళ్లలు.. రాత్రి పడుకోవడానికి ముందు వెల్లుల్లి మిల్క్ ఒక గ్లాసు తీసుకుంటే..హాయిగా నిద్రపోవచ్చు.

దగ్గు

దగ్గు

వెల్లుల్లి మిల్క్ లోకి కొద్దిగా పసుపు కలుపుకుని తీసుకోవడం వల్ల.. దగ్గు, చెస్ట్ లో సమస్య నుంచి తేలికగా బయటపడవచ్చు.

పొట్ట సమస్యలు

పొట్ట సమస్యలు

జీర్ణ సమస్యలు, బ్లోటింగ్ వంటి రకరకాల సమస్యలను వెల్లుల్లి మిల్క్ ఎఫెక్టివ్ గా నివారిస్తుంది. అలాగే ఇమ్యునిటీని మెరుగుపరుస్తుంది.

ఇంపోటెన్స్

ఇంపోటెన్స్

మగవాళ్లలో ఇబ్బందిపెట్టే సెక్స్ సమస్యలను వెల్లుల్లి మిల్క్ చాలా వేగంగా నివారిస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ ని మెరుగుపరిచి.. ఈ సమస్యలను వేగంగా నివారిస్తుంది.

English summary

Healing Powers Of Garlic Milk

Healing Powers Of Garlic Milk. You might hate to eat garlic. And when it is mixed in milk, you might hate to drink milk too. But what if we say that it has medicinal benefits? Read on to know...
Story first published:Monday, December 5, 2016, 9:59 [IST]
Desktop Bottom Promotion