అలర్ట్ : నిద్రలేమి వల్ల కలిగే సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ ..!

Subscribe to Boldsky

నేడు నిద్రలేమితో బాధపడేవారు నిజానికి లక్షలమంది ఉన్నారు, నిద్రలేమి వంటి నిద్ర రుగ్మత జీవన ప్రమాణాలను నాశనం చేస్తుంది. మీకు కొన్ని రోజులు నిద్ర లేకపోతే ఏమి జరుగుతుంది?

మీరు అలసిపోయినట్లుగా అయి, కోపంతో, రోజంతా నిరుత్సాహంగా ఉంటారు, రాత్రిపూట నిద్ర బాగా పట్టాలని ఆశిస్తూ ఎన్నో రాత్రులు గడుపుతారు.

Less Sleep

చాలామంది నిద్రమాత్రలు వాడడం ప్రారంభిస్తారు. కొంతమంది ఆ మాత్రల మీద ఆధారపడిపోతారు, ఆ మందుల వల్ల ప్రతికూల ప్రభావాలు కలిగినపుడు, మరికొందరు నిద్ర సంబంధిత సమస్యలతో బాధపడుతుంటారు.

అయితే, కొన్ని రోజులు నిద్ర లేకపోతే ఏమి జరుగుతుంది? నిద్రలేమి వల్ల ప్రమాదాలు జరుగుతాయి. ప్రజలు సరిగా నిద్రపోకపోతే ఇళ్ళలో లేదా పనిచేసే ప్రదేశాలలో గాయపడిన సంఘటనలు అనేకం ఉన్నట్టుగా పరిశోధనలు నిరూపించాయి.

Less Sleep

నిద్రలేమి వల్ల ఆలోచనా శక్తి తగ్గిపోతుంది. అది మీ ఆలోచనలపై, సమస్యను పరిష్కరించుకునే శక్తిపై, అప్రమత్తత, చురుకుదనం సామర్ధ్యాలపై ప్రభావం చూపిస్తుంది. మీరు తగినంత నిద్ర పోకపోతే, మీ జ్ఞాపకశక్తిని కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. విషయాలను గుర్తు చేసుకోవడం చాలా కష్టమౌతుంది.

Less Sleep

నిద్రలేమి వల్ల అధిక రక్తపోటు, మధుమేహం, గుండె సమస్యలు, గుండె నొప్పి, స్ట్రోక్ వంటి ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. నిద్రలేమి ఫలితంగా గుండేనొప్పి సమస్యతో చాలామంది చనిపోతారు.

నిద్రలేమితో బాధపడేవారు ఎక్కువగా ఆందోళన, వ్యాకులత బారిన పడతారని పరిశోధనలు నిరూపించాయి.

Less Sleep

రోజుకు కనీసం ఏడు గంటలైనా నిద్రపోని వారు త్వరగా వ్రుద్దులవుతారు. వారు బోదకాళ్ళు, నల్ల చారలు, గీతలు, ముడతల బారిన పడతారు.

Less Sleep

కొన్ని రోజులుగా మీకు నిద్ర లేకపోతే, బరువు పెరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. నిద్రలేమి ఆకలిని, అరుగుదలను పెంచుతుంది. తగినంత నిద్రపోని వారు అవసరమైన దానికంటే ఎక్కువగా తింటారు. ఈ విధానంలో, వారు బరువు పెరుగుతారు.

అందువల్ల, మీరు నిద్రలేమితో బాధపడుతుంటే, మీకుమీరే తక్షణ చికిత్స చేసుకోండి, పైన చెప్పిన ఆరోగ్య సమస్యల బారిన పడి బాధపడకండి.

" కంపేర్ & బై " బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్

English summary

Health Issues That Occur Due To Very Less Sleep

Today there are actually millions of people who are coping with sleeplessness, and coping with a sleep disorder like sleeplessness can ruin your standard of living. What happens when you do not sleep for days?
Please Wait while comments are loading...
Subscribe Newsletter