For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డైజెస్టివ్ ప్రాబ్లెమ్స్ ను నివారించే గ్రేట్ హెర్బల్ రెమెడీస్ ...!

జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలను ఇంట్లోనే చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. అందుకు అనేక రెడీస్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. జీర్ణ సమస్యలను నివారించే ఎఫెక్టివ్ రెమెడీస్ గురించి తెలుసుకుందాం....

|

శరీరంలో డైజెస్టివ్ సిస్టమ్ అత్యంత ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. డైజెస్టివ్ సిస్టమ్ లేకుండా మన శరీరం ఉండదు. అటువంటి జీర్ణవ్యవస్థకు ఏదైనా సమస్య వస్తే ఏంటి పరిస్థితి ? జీర్ణవ్యవస్థకు ఏదైనా సమస్య వస్తే, ఇంటర్నల్ గా మరియు ఎక్స్ టర్నల్ గా అసౌకర్యంగా ఉంటుంది.

జీర్ణవ్యవస్థ క్రమంగా పనిచేస్తుంటే మనం తిన్న ఆహారాలను ఎప్పటికప్పడు జీర్ణింప చేసే వాటి ద్వారా న్యూట్రీషియన్స్ ను మన శరీరంలోని కణాలకు చేర్చుతుంది. అలాగే జీర్ణమవ్వగా మిగిలిన వ్యర్థాలను మలమూత్రాల రూపంలో బయటకు నెట్టేస్తుంది.

Herbal Remedies To Treat Digestive Problems

జీర్ణ సమస్యల్లో అజీర్థి, కడుపుబ్బరం, ఆపానవాయువు, హార్ట్ బర్న్, డయోరియా, మలబద్దకం, ఆసిడ్ రిఫ్లెక్షన్, పెప్టిక్ అల్సర్, ల్యాక్టోజ్ ఇంటాలరెన్స్, ఇన్ఫ్లమేటరీ,బౌల్ డిసీజ్ మరియు ఇర్రిటేబుల్ బౌల్ సిండ్రోమ్ వంటివన్నీ జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు.

ఇటువంటి జీర్ణ సమస్యలు ఒక్కోక్కో వ్యక్తిలో ఒక్కో విధంగా ఉంటాయి. అందరిలో ఒకే విధంగా ఉండవు. అయితే పోషకాహర లోపం, సరైన శుభ్రత పాటించకపోవడం, వ్యాయామలేమి, స్మోకింగ్, ఆల్కహాల్, నిద్రలేమి, పోషకాల లోపం వంటివి కామన్ గా లక్షణాలు. జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలను ఇంట్లోనే చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. అందుకు అనేక రెడీస్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. జీర్ణ సమస్యలను నివారించే ఎఫెక్టివ్ రెమెడీస్ గురించి తెలుసుకుందాం....

అల్లం:

అల్లం:

జీర్ణ సమస్యలను నివారించడంలో అల్లం గ్రేట్ గా సహాయపడుతుంది. కాబట్టి, దీన్ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం చాలా అవసరం. అల్లం రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ చురుకుగా పనిచేయడానికి అవసరమయ్య జీర్ణ రసాలను, ఎంజైమ్స్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇంకా వికారంం, వాంతులు, అజీర్థి, కడుపుబ్బరాన్ని తగ్గిస్తుంది.

ప్రొబయోటిక్స్ :

ప్రొబయోటిక్స్ :

పెరుగు , యోగర్ట్ వంటి ప్రొబయోటిక్ ఫుడ్స్ జీర్ణవ్యవస్థను కూల్ గా మార్చుతుంది. దాంతో జీర్ణవ్యవస్థ హెల్తీగా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ప్రొబయోటిక్ ఫుడ్స్ లో ఉండే హెల్తీ బ్యాక్టీరియా కడుపుబ్బరం, డయోరియా, ఆపానవాయువు వంటి జీర్ణ సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

 పుదీనా:

పుదీనా:

పెప్పర్ జీర్ణశక్తిని పెంచుతుంది. పుదీనాలో జీర్ణశక్తిని పెంచే కార్మినేటివ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉండటం వల్ల గ్యాస్, కడుపుబ్బరం, వికారం, వాంతుల నుండి ఉపవమనం కలిగిస్తుంది.

 ఫెన్నల్ సీడ్స్ :

ఫెన్నల్ సీడ్స్ :

సోంపు కూడా జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. వీటిని హార్ట్ బర్న్, అజీర్తి, స్టొమక్ యాసిడ్స్ నివారించడంలో గొప్పగా సహాయపడుతుంది. కడుపుబ్బరం, ఇన్ డైజెషన్ బౌల్ సిండ్రోమ్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

వెనిగర్:

వెనిగర్:

జీర్ణ సమస్యలను నివారించే మరో ఎఫెక్టివ్ హోం రెమెడీ వెనిగర్. వెనిగర్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే జీర్ణవ్యవస్థ చురుకుగా ఉంటుంది. అజీర్థి, ఆపానవాయువు, కడుపుబ్బరం, స్టొమక్ బ్లోటింగ్, కడుపు నొప్పి, హార్ట్ బర్న్ వంటి సమస్యలను నివారిస్తుంది.

అలోవెర:

అలోవెర:

కలబందలో ఉండే లాక్సేటివ్ గుణాలు జీర్ణవ్యవస్థ చురుకుగా పనిచేసేందుకు సహాయపడుతుంది. కలబందలో ఉండే గుణాలు అనేక పొట్ట సమస్యలతో పాటు, స్టొమక్ అల్సర్ ను కూడా నివారిస్తుంది.

ఇంగువ:

ఇంగువ:

జీర్ణ శక్తిని పెంచడంలో ఇంగువ గ్రేట్ కిచెన్ రెమెడీ. ఇందులో యాంటీఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్స్, యాంటీ ఫ్లూటలెంట్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఆపానవాయువును నివారించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. స్టొమక్ అప్ సెట్ ను తగ్గిస్తుంది. ఫుడ్ పాయిజిన్ నివారిస్తుంది.

English summary

Herbal Remedies To Treat Digestive Problems

Digestive system has an important role to play in the body, without which our body cannot function properly. Any problem that is associated with the digestive system causes a lot of discomfort to us both internally as well as externally.
Desktop Bottom Promotion