క్రాకర్స్ వల్ల కాలిన గాయాల నుంచి ఉపశమనం కలిగించే ఎఫెక్టివ్ రెమిడీస్

Posted By:
Subscribe to Boldsky

కలర్ ఫుల్ అండ్ జాయ్ ఫుల్ ఫెస్టివల్ దీపావళి వచ్చేసింది. ఇల్లంతా.. రంగురంగుల పూలు.. ఇంటి చుట్టూ దీపాల కాంతులు.. చిన్నారుల కేరింతలు.. టపాకాయల సవ్వడులతో.. దీపావళి పండగ జోరు హోరెత్తిస్తోంది. అయితే ఎంత ఫన్నీగా ఉంటుందో అంతే ప్రమాదంతో కూడినది కూడా. ఎందుకంటే.. క్రాకర్స్ కి ఫేమస్ కాబట్టి. అవి పేల్చేటప్పుడు ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా.. తీవ్రంగా ఇబ్బందిపడాల్సి వస్తుంది. చాలా ఫన్నీగా, ఎంజాయ్ మెంట్ తో కూడిన పండుగే అయినా.. కాస్త జాగ్రత్తగా ఉంటడం మంచిది.

అందరికీ ఇష్టమైన దీపావళి హిందువులకు ప్రత్యేకమైనది. కానీ ఎలాంటి హాని జరగకుండా.. చిన్న చిన్న టిప్స్ ఫాలో అవడం అందరికీ మంచిది. ముఖ్యంగా చిన్న పిల్లల విషయంలో చాలా అలర్ట్ గా ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఎంత జాగ్రత్తగా ఉన్నా.. చిన్న చిన్న గాయాలు అవుతూ ఉంటాయి. కాలిన గాయాలు చాలా బాధపెడతాయి. అలాంటి సందర్భంలో ప్రథమ చికిత్సపై కాస్త అవగాహన ఉండాలి. ఇంట్లో ఉండే వస్తువులతోనే ఉపశమనం కలిగించే చిట్కాలు తెలుసుకోవడం మంచిది.

క్రాకర్స్ పేల్చేటప్పుడు ఎక్కువగా గాయపడినప్పటికి ముందుగా ఇంట్లో కాస్త రిలీఫ్ కలిగేలా జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి ప్రథమ చికిత్సలో భాగంలో దీపావళి రోజు ఇంట్లో ఫాలో అవ్వాల్సిన ఈజీ టిప్స్ ఏంటో తెలుసుకోండి.

వెంటనే నీళ్లతో క్లీన్ చేయడం

క్రాకర్స్ కాల్చేటప్పుడు చేతులు లేదా ఏ ప్రాంతంలో కాలినా.. వెంటనే నీటిని అప్లై చేయాలి. దీనివల్ల గాయపడిన ప్రాంతంలో టెంపరేచర్ తగ్గించవచ్చు.. కాలిన గాయం నుంచి కాస్త ఉపశమనం పొందవచ్చు. దీనివల్ల నొప్పి, బొబ్బలు తగ్గుతాయి. క్రాకర్స్ కాల్చేటప్పుడు కాలిన వెంటనే చేయాల్సిన మొదటి చికిత్స ఇది. సో మరిచిపోకండి.

పసుపు

కాలిన గాయాలకు పసుపు అమేజింగ్ గా పనిచేస్తుంది. పసుపును పేస్ట్ గా తయారు చేసి.. కాలిన ప్రాంతంలో రాయాలి. శరీర ఉష్ణోగ్రతను తగ్గించి.. వెంటనే ఉపశమనం కలిగిస్తుంది. ఇది యాంటీ సెప్టిక్ గా పనిచేస్తుంది. కాబట్టి ఎలాంటి చిన్న గాయం తగిలినా.. వెంటనే పసుపు ఉపయోగించడం మానకండి.

తేనె

దీపావళి సమయంలో ఇంట్లో తేనె ఉండేలా జాగ్రత్త పడండి. ఎందుకంటే.. కాలిన గాయాలు మాన్పడానికి ఇది మంచి మెడిసిన్. కాలిన గాయాలను తగ్గించడమే కాదు.. ఇన్ఫెక్షన్ లు రాకుండా చేస్తుంది తేనె. గాయాలపై తేనెను రుద్దకుండా.. ఊరికే అప్లై చేయాలి. దీనివల్ల సత్వర ఉపశమనం ఉంటుంది.

వెనిగర్

దీపావళి సమయంలో కాలిన గాయాలకు వెనిగర్ చక్కటి పరిష్కారం. అయితే డైరెక్ట్ గా అప్లై చేయకుండా.. వెనిగర్ లో క్లాత్ ముంచి.. కాలిన ప్రాంతంలో వెనిగర్ లో ముంచిన క్లాత్ ను అద్దితే సరిపోతుంది.

టూత్ పేస్ట్

కాలిన గాయాలకు టూత్ పేస్ట్ గానీ, ఫౌంటేన్ పెన్ ఇంకు కానీ రాయడం వల్ల మంచి ఉపశమనం ఉంటుంది. కాలిన ప్రాంతంలో చల్లగా అనిపించడమే కాదు.. బొబ్బలు కూడా పెరగకుండా పనిచేస్తుంది.

యాంటీ సెప్టిక్ లోషన్స్

దీపావళి వచ్చేసింది కాబట్టి ఇంట్లో యాంటీ సెప్టిక్ లోషన్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. లేకపోతే వెంటనే తీసుకురావడం మంచిది. ఏమాత్రం చేతులు కాలినా.. వెంటనే ఈ లోషన్ అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ ప్రథమ చికిత్స చిట్కాలన్నీ మైండ్ లో పెట్టుకోండి. జాగ్రత్తగా దీపావళి సెలబ్రేట్ చేసుకోవడం మంచిది.

అలోవెరా

కాలిన గాయాల నుంచి ఉపశమనం కలిగించడానికి మంచి హెర్చల్ రెమెడీ అలోవెరా. తీవ్రంగా కాలిన గాయాలను కూడా వెంటనే మాన్పించే పవర్ దీనికుంది. అలోవెరా లోపల ఉండే గుజ్జుని తీసి గాయంపై రాయాలి. ఇది బొబ్బలు పెద్దగా రాకుండా కాపాడుతుంది.

" కంపేర్ & బై " బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్

English summary

Home Remedies for burns caused by crackers on Diwali

Home Remedies for burns caused by crackers on Diwali. Diwali, the festival of lights, is an amazingly interesting festival. Hindus wait for this festival as it brings them the rare chance to decorate their homes and light crackers and sparklers at night.
Please Wait while comments are loading...
Subscribe Newsletter