For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లూజ్ మోష‌న్స్ నివారించే ఎఫెక్టివ్ హోం రెమిడీస్

By Swathi
|

లూజ్ మోష‌న్ డ‌యేరియా వ‌ల్ల వ‌స్తాయి. నీళ్ల మోష‌న్స్ చాలా ట్ర‌బుల్ క్రియేట్ చేశారు. త‌ర‌చుగా.. మోష‌న్స్ రావ‌డం వ‌ల్ల‌.. చాలా అల‌స‌ట‌యిపోతారు. ఈ స‌మ‌స్య వ‌చ్చిన‌ప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. కోల‌న్ ద్వారా పొట్ట‌లోని ఆహారం చాలా వేగంగా పాస్ అవుతుంది.

కొన్నిసార్లు పొట్ట‌నొప్పి, బ్లోటింగ్, నొప్పి, జ్వ‌రం, అల‌స‌ట వంటి స‌మ‌స్య‌లు కూడా ఎదుర‌వుతాయి. ప్ర‌తిసారీ బాత్ రూమ్ కి వెళ్ల‌డం వల్ల‌.. బ‌ర్నింగ్ సెన్సేష‌న్, ఇరిటేష‌న్ వ‌స్తాయి. కొన్ని సార్లు ఇన్ఫెక్ష‌న్స్ కూడా ఎదుర‌వుతాయి. ప్యారాసైట్స్, కొన్ని ర‌కాల ఆహారాలు, బ్యాక్టీరియా, వైర‌స్ కూడా లూజ్ మోష‌న్ కి కార‌ణ‌మ‌వుతాయి.

ఒక‌వేళ మూడు రోజుల‌కంటే ఎక్కువ రోజులు మోష‌న్స్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతుంటే.. డాక్ట‌ర్ ని సంప్ర‌దించాలి. మోష‌న్స్ స‌మ‌స్య మొద‌లైన వెంట‌నే.. కొన్ని ఎఫెక్టివ్ రెమిడీస్ ఫాలో అయితే.. కాస్త రిలీఫ్ పొంద‌వ‌చ్చు..

ప‌సుపు

ప‌సుపు

ప‌సుపులో యాంటీ బ్యాక్టీరియా గుణాలు ఉంటాయి. ఇది బ్యాక్టీరియాను నివారిస్తుంది. కాబ‌ట్టి మోష‌న్స్ తో బాధ‌ప‌డేట‌ప్పుడు ప‌సుపు నీటిని రోజుకి రెండుసార్లు తాగాలి. ఒక క‌ప్పు నీటిలో అర స్పూన్ ప‌సుపు క‌లిపి.. ఆ నీటిని తాగితే మంచి ఫ‌లితం ఉంటుంది.

అల్లం

అల్లం

అల్లంలో కూడా మెడిసిన‌ల్ గుణాలుంటాయి. ఇది డైజెస్టివ్ సిస్ట‌మ్ కి ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తుంది. నీటిలో అల్లంను ఉడికించి.. ఆ నీటిని తాగితే.. మోష‌న్స్ నుంచి రిలీఫ్ క‌లుగుతుంది.

అర‌టిపండు

అర‌టిపండు

అర‌టిపండులో పెక్టిన్, ఫైబ‌ర్ తో పాటు పొటాషియం ఉంటుంది. లూజ్ మోష‌న్స్ తో బాధ‌ప‌డేట‌ప్పుడు రోజుకి మూడు అర‌టిపండ్లు తింటే ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది.

యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్

యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్

యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ లో యాంటిబ‌యోటిక్ ఉంటుంది. ఇది హానికార‌క బ్యాక్టీరియాను బ‌య‌ట‌కు పంపుతుంది. ఒక స్పూన్ యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ ని ఒక క‌ప్పు గోరు వెచ్చ‌ని నీటిలో క‌లిపి, కొన్ని చుక్క‌ల తేనె క‌ల‌పాలి. ఈ నీటిని రోజుకి రెండుసార్లు తాగాలి.

పెరుగు

పెరుగు

పెరుగు హెల్తీ బ్యాక్టీరియాని శ‌రీరానికి అందించ‌డానికి స‌హాయ‌ప‌డుతుంది. కాబ‌ట్టి లూజ్ మోష‌న్స్ తో బాధ‌ప‌డేట‌ప్పుడు.. రోజుకి రెండుసార్లు పెరుగు తినాలి.

దానిమ్మ‌

దానిమ్మ‌

దానిమ్మ‌లో ఫంగ‌ల్, యాంటీ బ్యాక్టీరియ‌ల్ గుణాలు ఉంటాయి. అలాగే అనేక హెల్త్ బెన్ఫిట్స్ దాగున్నాయి. చెడు బ్యాక్టీరియాను బ‌య‌ట‌కు పంపించ‌డంలో దానిమ్మ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కాబ‌ట్టి లూజ్ మోష‌న్స్ తో బాధ‌ప‌డేట‌ప్పుడు ఒక గ్లాసు దానిమ్మ జ్యూస్ తాగ‌డం వ‌ల్ల ఎఫెక్టివ్ ఫ‌లితాలు పొంద‌వ‌చ్చు.

చెక్క‌

చెక్క‌

దాల్చిన చెక్క ను నీటిలో ఉడికించి.. రోజుకి రెండుసార్లు తాగ‌డం వ‌ల్ల అద్భుత‌మైన ఫ‌లితాలు పొంద‌వ‌చ్చు. అందులోకి చిన్న అల్లం కూడా క‌లిపి తీసుకుంటే మ‌రింత ఫ‌లితం పొంద‌వ‌చ్చు.

English summary

How To Treat Loose Motions

How To Treat Loose Motions. Loose motions occur due to diarrhea. Watery stools could cause trouble mainly because you won't feel relieved after passing the stool.
Story first published:Wednesday, June 29, 2016, 15:17 [IST]
Desktop Bottom Promotion