For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టూత్ పేస్ట్ ల కంటే కొబ్బరినూనె మంచిదని తేల్చిన స్టడీస్ !!

By Swathi
|

మీ టూత్ పేస్ట్ ఉప్పు ఉందా ? టూత్ పేస్ట్ లో లెమన్ ఉందా ? టూత్ పేస్ట్ చార్కోల్ ఉందా ? అంటూ రకరకాల యాడ్స్ తో ఊదరగొట్టే టూత్ పేస్ట్ లకు విసిగిపోయారా ? సెన్సిటివ్ టూత్ పేస్ట్ లు వాడినా.. ఫలితం లేక డెంటల్ కేర్ గాడీ తప్పుతోందా ? నిజమే రకరకాల బ్రాండ్స్, ఫ్లేవర్స్ తో వచ్చిన టూత్ పేస్ట్ ల కంటే.. సింపుల్ గా కొబ్బరినూనె ఉపయోగించడం చాలా సేఫ్ అండ్ హెల్తీ అంటున్నారు నిపుణులు.

కొబ్బరినూనె పంటి ఆరోగ్యానికి చాలా మంచిదని అధ్యయనాలు నిరూపించాయి. మార్కెట్ లో దొరికే రకరకాల టూత్ పేస్ట్ లు ట్రై చేయడం కంటే.. కొబ్బరినూనె వాడటం అన్ని రకాల మంచిదని ఈ స్టడీస్ సూచిస్తున్నాయి. మరి టూత్ పేస్ట్ కంటే కొబ్బరినూనె బెటర్ అనడానికి కారణాలేంటో చూద్దాం..

కొబ్బరినూనె పేస్ట్ కి కావాల్సిన పదార్థాలు

కొబ్బరినూనె పేస్ట్ కి కావాల్సిన పదార్థాలు

అరకప్పు కొబ్బరినూనె, 3 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా, 15 నుంచి 30 చుక్కల పెప్పరమింట్ ఆయిల్.

తయారు చేసే విధానం

తయారు చేసే విధానం

అన్నింటినీ ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి. పేస్ట్ లా తయారు అయ్యేంతవరకు బాగా మిక్స్ చేసి.. ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ని రెగ్యులర్ గా వాడితే మంచి ఫలితం ఉంటుంది.

చిగుళ్ల ఆరోగ్యానికి

చిగుళ్ల ఆరోగ్యానికి

కొబ్బరినూనె చిగుళ్ల నుంచి రక్తస్రావం, వాపుని నివారిస్తుంది. అలాగే చెడు బ్యాక్టీరియాను నాశనం చేసి.. చిగుళ్లలో పుండ్లు రాకుండా నివారిస్తుంది.

మసాజ్

మసాజ్

టూత్ పేస్ట్ ని ఉపయోగిస్తున్నా.. కొంచెం కొబ్బరినూనెతో.. పళ్లపై కాస్త మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

నాలుక

నాలుక

నాలుకను కొబ్బరినూనెతో శుభ్రం చేసుకోవడం వల్ల నోట్లో ఉండే ఫంగల్ ని బయటకు పంపుతుంది. దంతక్షయాన్ని నివారిస్తుంది.

స్టడీస్

స్టడీస్

టూత్ పేస్ట్ లో కొబ్బరినూనె చేర్చడం వల్ల.. బ్యాక్టీరియా, పంటి ఆరోగ్యంపై ప్రభావంచూపే ఇతర హానికర క్రిములను నాశనం చేస్తుందని ఐరిష్ సైటింటిస్ట్ లు నిరూపించారు.

English summary

Is Coconut Oil Better Than Toothpaste?: Coconut Oil Is Better Than Toothpaste According To Study

Is Coconut Oil Better Than Toothpaste?: Coconut Oil Is Better Than Toothpaste According To Study. Coconut oil is excellent for your gums and brushing teeth with coconut oil regularly can eliminate bleeding and sore gums.
Story first published:Saturday, April 30, 2016, 15:57 [IST]
Desktop Bottom Promotion