సాయంత్రం వ్యాయామం చేయడం ఎంత వరకు మంచిది ?

ఏ సమయంలో వ్యాయామం చేయడం వల్ల ఎక్కువ ఫలితాలు పొందవచ్చు ? ఉదయంపూటే వ్యాయామం చేయాలా ? ఉదయం కుదరనప్పుడు సాయంత్రంపూట వ్యాయామం చేయకూడదా ? సాయంత్రం వ్యాయామం చేస్తే ఏమవుతుంది ?

Posted By:
Subscribe to Boldsky

వ్యాయామం, యోగా అంటే.. ఉదయాన్నే చేయాలని చెబుతుంటారు. అసలు ఏ సమయంలో వ్యాయామం చేయడం వల్ల ఎక్కువ ఫలితాలు పొందవచ్చు ? ఉదయంపూటే వ్యాయామం చేయాలా ? ఉదయం కుదరనప్పుడు సాయంత్రంపూట వ్యాయామం చేయకూడదా ? సాయంత్రం వ్యాయామం చేస్తే ఏమవుతుంది ? ఇలాంటి డౌట్స్ మీకూ ఉన్నాయా ?

exercise

వ్యాయామం, యోగా అంటే.. ఉదయం చేయాలనే నిబంధన ఉంది. అయితే.. ఉదయం వీటిని చేస్తే ఎక్కువ ఫలితాలు పొందవచ్చు. కానీ సాయంత్రవేళల్లో కూడా.. వ్యాయామం చేయవచ్చు. కానీ.. ఉదయం చేసినంత ఎఫెక్టివ్ ఫలితాలను సాయంత్రంపూట పొందలేరు. అందుకే.. వ్యాయామం అంటే ఉదయం అని ఫిక్స్ అవుతుంటారు.

ఉదయం నిద్రలేచిన తర్వాత ఇంట్లో పనుల వల్ల తీరిక దొరకకపోతే సాయంత్రం కూడా చేయవచ్చు. ఏమీ లేకపోవడం కన్నా.. ఏదో ఒక సమయంలో శరీరానికి శ్రమ కల్పించడం ఉత్తమం కాబట్టి.. ఏ ఉదయమైనా, సాయంత్రమైనా.. వ్యాయామం చేయవచ్చు.

yoga

అయితే యోగా చేయాలి అనుకుంటే మాత్రం ఉదయమే ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. ఎందుకంటే.. యోగా చేయడానికి ముందు శరీరం అలసిపోకూడదు. అందుకే యోగా చేయాలి అనుకుంటే.. మార్నింగ్ చేయడం ఉత్తమం. లేదా సాయంత్రం కాసేపు రిలాక్స్ అయిన తర్వాత యోగా చేయాలి. అది కూడా వ్యాయామం, యోగా ఏదైనా సరే.. సాయంత్రం 7గంటలలోపు చేయాలి. అప్పుడే.. మెరుగైన ఫలితాలు పొందగలుగుతారు.

breakfast

అలాగే సాయంత్రం యోగా లేదా వ్యాయామం చేయాలి అనుకుంటే.. ఉదయం నుంచి కొన్ని నియమాలు పాటించాలి. బ్రేక్ ఫాస్ట్ లో సలాడ్స్, మధ్యాహ్న భోజనంలో తేలికగా జీర్ణమయ్యే పదార్థాలు ఉండేలా జాగ్రత్త పడాలి. అలాగే నీళ్లు సరిపడా తాగాలి. ఈ నియమాలు పాటిస్తేనే.. సాయంత్రం పూట వ్యాయామానికి కేటాయించాలి.

" కంపేర్ & బై " బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్

English summary

Is It Bad to Work Out in the Evening ?

Is It Bad to Work Out in the Evening ? Is it safe to work out before 7pm. Know details read more.
Please Wait while comments are loading...
Subscribe Newsletter