For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలర్ట్: మీ ఆరోగ్యానికి హాని చేసే డేంజరస్ ఫుడ్ కాంబినేషన్స్..!!

By Swathi
|

కొన్ని ఆహారాలను టేస్టీగా మార్చుకోవడం కోసం, ఆహారానికి కొత్త ఫ్లేవర్ కోసం.. రకరకాల కాంబినేషన్స్ తీసుకుంటూ ఉంటాం. అవి ఎంతవరకు ఆరోగ్యకరం, ఎంతవరకు మంచిది అని తెలుసుకోకుండానే.. కొన్ని ఫుడ్ కాంబినేషన్స్ ఫాలో అవుతూ ఉంటాం. కానీ ??

కానీ కొన్ని రెగ్యులర్ గా మనం మిక్స్ చేసి తీసుకునే ఆహారాలు చాలా డేంజర్ అని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. మన నాలుకకు మంచి రుచిని ఇచ్చినప్పటికీ.. వాటిని ఎట్టిపరిస్థితుల్లో మిక్స్ చేయకూడదు అంటున్నారు నిపుణులు. నిమ్మ నుంచి ఆల్కహాల్ వరకు.. రకరకాల కాంబినేషన్స్ ఆరోగ్యానికి తీవ్రహాని కలిగిస్తాయట.

ఎట్టిపరిస్థితుల్లో మిక్స్ చేయకూడని ఫుడ్ కాంబినేషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.. అలాగే వాటిని మిక్స్ చేయడం వల్ల ఎలాంటి హాని కలుగుతుందో తెలుసుకుందాం..

పాలు, నిమ్మ

పాలు, నిమ్మ

పాలు, నిమ్మరసంను ఎట్టిపరిస్థితుల్లో మిక్స్ చేయకండి. ఈ రెండింటి కాంబినేషన్ పొట్టలోకి వెళ్లిందంటే. .పొట్టలో యాసిడ్ ఏర్పడి అది.. టాక్సిక్ మారుతుంది. దీనివల్ల.. ఎసిడిటీ, హార్ట్ బర్న్ సమస్యలు వస్తాయి.

నిమ్మ, దగ్గు మందు

నిమ్మ, దగ్గు మందు

నిమ్మరసంను, దగ్గు మందును కలపడం వల్ల నిమ్మ ఎంజైమ్స్ ని బ్లాక్ చేస్తుంది. దీనివల్ల తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.

పుదీనా, కూల్ డ్రింక్స్

పుదీనా, కూల్ డ్రింక్స్

పుదీనా, ఏవైనా కూల్ డ్రింక్స్ లో మిక్స్ చేసి తీసుకోవడం వల్ల.. అది సెనైడ్ గా మారుతుంది. ఇది.. విషపూరితమైనది. దీనివల్ల ప్రాణాలకే ప్రమాదం.

పాలఉత్పత్తులు, యాంటీ బయోటిక్స్

పాలఉత్పత్తులు, యాంటీ బయోటిక్స్

క్యాల్షియం, ఐరన్ ఉంటే.. పాలను, యాంటీ బయోటిక్స్ తో మిక్స్ చేయడం వల్ల.. అవి ఇన్ఫెక్షన్లతో పోరాడలేవు. దీనివల్ల.. సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.

మాంసం, మనోవ్యాకులత పోగొట్టే మందులు

మాంసం, మనోవ్యాకులత పోగొట్టే మందులు

మాంసం, మనోవ్యాకులత పోగొట్టే మందులను ఎట్టిపరిస్థితుల్లో మిక్స్ చేయకూడదు. ఇవి.. బ్లడ్ ప్రెజర్ ని సడెన్ గా పెంచుతాయి.

యాపిల్ జ్యూస్, అలర్జీ డ్రగ్స్

యాపిల్ జ్యూస్, అలర్జీ డ్రగ్స్

కొన్ని రకాల అలర్జీ మందులను యాపిల్ జ్యూస్ తో కలిపి తీసుకోకూడదు. ఇలా తీసుకోవడం వల్ల అలర్జీలు మరింత తీవ్రమై.. అనేక అనారోగ్య సమస్యలకు కారణమవుతాయి.

ఆల్కహాల్, ఎసిటామినోఫెన్

ఆల్కహాల్, ఎసిటామినోఫెన్

ఈ రెండింటినీ తీసుకోవాలంటే.. ఒకటి తీసుకున్న తర్వాత ఖచ్చితంగా 6 గంటల గ్యాప్ ఇవ్వాలి. అంతకు ముందే తీసుకుంటే.. సైడ్ ఎఫెక్ట్స్ ఎదురవుతాయి.

ఆల్కహాల్, యాంటీ బయోటిక్స్

ఆల్కహాల్, యాంటీ బయోటిక్స్

యాంటీ బయోటిక్స్ లో ఉండే సైడ్ ఎఫెక్ట్స్ లివర్, కిడ్నీలపై దుష్ర్పభావం చూపుతాయి. దీనివల్ల.. వికారం, అలసట, వాంతుల సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి.. యాంటీ బయోటిక్స్ తీసుకున్న వెంటనే.. ఆల్కహాల్ ఎట్టిపరిస్థితుల్లో తీసుకోకూడదు.

పాలు, ఫ్రూట్స్

పాలు, ఫ్రూట్స్

పండ్లు తేలికగా జీర్ణమవుతాయి. కానీ పాలు అంత ఈజీగా జీర్ణం కాలేవు. కాబట్టి ఈ రెండింటినీ కలపడం వల్ల ఎసిడిటీ సమస్య వస్తుంది. కాబట్టి ఈ రెండింటినీ ఎప్పుడూ మిక్స్ చేసి తీసుకోకండి.

చేపలు, పాలు

చేపలు, పాలు

పాలను ఎలాంటి నాన్ వెజ్ ఐటమ్ తోనూ మిక్స్ చేసి తీసుకోకూడదు. చేపలు, మాంసం, చికెన్ వంటివి పాలతో కలపితే హానికరం. ఫిష్, మాంసం హీటింగ్ ఫుడ్స్ అయితే.. డైరీ ప్రొడక్ట్స్ కూలింగ్ ఫుడ్స్. ఈ రెండింటి కాంబినేషన్ లో ఫుడ్ తీసుకుంటే.. టాక్సిన్స్ బయటకు వెళ్లకుండా.. పేరుకుపోతాయి.

తేనె

తేనె

తేనెలో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కాబట్టి దాన్ని డైరెక్ట్ గా తీసుకోవచ్చు. కానీ వేడి చేసి తీసుకుంటే.. అది విషపూరితంగా మారుతుంది. కాబట్టి ఎప్పుడూ పచ్చి తేనెనే తీసుకోండి.

తేనె, నెయ్యి

తేనె, నెయ్యి

తేనె శరీరాన్ని వెచ్చగా మార్చితే.. నెయ్యి చల్లబరుస్తుంది. కాబట్టి ఈ రెంటింటి కాంబినేషన్ హెల్తీ కాదు.

లైట్ ఫుడ్, హెవీ ఫుడ్

లైట్ ఫుడ్, హెవీ ఫుడ్

లైట్ ఫుడ్ ని, హెవీ ఫుడ్ తో కలపడాన్ని మంచి ఐడియాగా భావిస్తాం. ఇది చాలామంది పాలో అయ్యే అలవాటు. కానీ.. ఇలా కలిపి తినడం వల్ల ఖచ్చితంగా జీర్ణక్రియ సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి.. ఫుడ్ కాంబినేషన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

పాలు, ఉప్పు

పాలు, ఉప్పు

సాల్ట్ యాస్ట్రిజెంట్ గుణాలు కలిగి ఉంటుంది. పాలలో న్యూట్రీషనల్ గుణాలుంటాయి. ఈ రెండింటినీ మిక్స్ చేసి ఎట్టిపరిస్థితుల్లో తీసుకోకూడదు.

డైరీ ప్రొడక్స్, ముల్లంగి

డైరీ ప్రొడక్స్, ముల్లంగి

డైరీ ప్రొడక్ట్స్ శరీరంలోపల కూల్ చేస్తే.. ముల్లంగి హీట్ పెంచుతుంది. కాబట్టి.. ఈ రెండింటినీ కాంబినేషన్ గా తీసుకోవడం హెల్తీ కాదు. జీర్ణసమస్యలు వస్తాయి.

English summary

Most Dangerous Food Combinations That Can Wreck Your Health!

Most Dangerous Food Combinations That Can Wreck Your Health! These are the most dangerous food combinations that we should avoid under ANY circumstances to 'live' a little bit longer!
Story first published:Wednesday, September 28, 2016, 12:07 [IST]
Desktop Bottom Promotion