ఎగ్స్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అపోహలు, వాస్తవాలు

ఎగ్స్ తినాలని ఇష్టడితే.. బరువు పెరుగుతారని భయపడాల్సిన అవసరం లేదు. అలాగే గుడ్డులోని పచ్చసొన తింటే.. ఫ్యాట్ పేరుకుంటుందన్న ఆందోళన కూడా అవసరం లేదు. ఎగ్స్ తినకుండా అడ్డుకుంటున్న.. అపోహలకు స్వస్థి.

Posted By:
Subscribe to Boldsky

ఎగ్స్ తినడం అనేది.. చాలా అయోమయంగా మారింది. రోజులు గడిచే కొద్దీ ఎగ్స్ పై అపోహలు పెరిగిపోతున్నాయి. ఎగ్స్ తినడం వల్ల బరువు పెరుగుతారని కొంతమంది చెబుతుండటం వల్ల.. వీటిని తినాలా ? తినకూడదా ? అన్న సందేహం ప్రతి ఒక్కరిలో పెరిగిపోయింది.

facts about eggs

అలాగే ఎగ్స్ తినాలని ఇష్టడితే.. బరువు పెరుగుతారని భయపడాల్సిన అవసరం లేదు. అలాగే గుడ్డులోని పచ్చసొన తింటే.. ఫ్యాట్ పేరుకుంటుందన్న ఆందోళన కూడా అవసరం లేదు. ఎగ్స్ తినకుండా అడ్డుకుంటున్న.. అపోహలకు ఇప్పుడే స్వస్థి పలకండి.

మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన కోడిగుడ్లపై ఉన్న అపోహలు, వాస్తవాలేంటో చూద్దాం..

అపోహ

ఎగ్స్ తినడం వల్ల బరువు పెరుగుతారు. ఇందులో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బరువు పెరుగుతారని అపోహ ఉంది.

ఫ్యాక్ట్

ఎగ్స్ లో ఫ్యాట్స్, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఇవి మెటబాలిజంను మెరుగుపరిచి.. చాలాసేపటి వరకు పొట్టనిండిన ఫీలింగ్ కలిగిస్తాయి. దీనివల్ల బరువు తగ్గడానికి సహాయపడతాయి.

అపోహ

ఎగ్స్ శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ని పెంచుతాయని చాలామంది భావిస్తారు. కానీ ఇది వాస్తవం కాదు.

ఫ్యాక్ట్

ఎగ్స్ లో శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. హైకొలెస్ట్రాల్ ఉండదు. కాబట్టి.. ఎగ్స్ బ్లడ్ లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ని పెంచుతాయి.

అపోహ

గుడ్డులోని పచ్చసొనలో కావాల్సినంత ప్రొటీన్ ఉంటుంది.

ఫ్యాక్ట్

గుడ్డులోని తెల్లసొనలో.. పచ్చసొనలో కంటే రెండు రెట్లు ఎక్కువగా ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి.. ఎగ్ మొత్తాన్ని తెల్లసొన, పచ్చసొనను తింటే.. సరైన ఫలితాలు పొందగలుగుతారు.

అపోహ

ఎగ్స్ ని ఫ్రిడ్జ్ లో పెట్టాలా పెట్టకూడదా అనేది మరో అయోమయానికి గురిచేసే సందేహం. చాలామంది ఎగ్స్ ని కంపల్సరీ ఫ్రిడ్జ్ లోనే పెట్టాలని భావిస్తారు.

ఫ్యాక్ట్

ఎగ్స్ ని ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం లేదు. కప్ బోర్డ్స్ లో కూడా ఎగ్స్ ని స్టోర్ చేయవచ్చు. రూం టెంపరేచర్ లో పెట్టుకుని తర్వాత వండుకోవచ్చు.

అపోహ

వైట్ ఎగ్స్ కంటే.. బ్రౌన్ ఎగ్స్ ఆరోగ్యకరమైనవి.

ఫ్యాక్ట్

వైట్ ఎగ్స్, బ్రౌన్ ఎగ్స్ టేస్ట్ లో ఎలాంటి తేడా ఉండదు. అలాగే పోషకాలు కూడా రెండింటిలోనూ ఒకే విధంగా ఉంటాయి.

అపోహ

ఉడికించిన కోడిగుడ్డులో మాత్రమే ఎక్కువ పోషకాలు ఉంటాయి. కాబట్టి ఉడికించిన గుడ్డునే తీసుకోవాలి.

ఫ్యాక్ట్

కోడిగుడ్డుని ఎలా తీసుకున్నా పోషకాలు పొందవచ్చు. ఉడికించినా, ఆమ్లెట్ రూపంలో, ఫ్రై ఎలా తీసుకున్నా అందులోని ప్రొటీన్స్ పొందవచ్చు.

" కంపేర్ & బై " బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్

English summary

Must known Myths and Facts about Eggs

Must know Myths and Facts about Eggs. Biggest myths everyone made us believe about the protein rich food and how they have been a lie- always.
Story first published: Wednesday, November 9, 2016, 10:14 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter