నిద్రలేవగానే కంపల్సరీ ఒక గ్లాసు నీళ్లు ఎందుకు తాగాలి ?

ఉదయాన్నే ఒక గ్లాసు నీళ్లు తాగడమే కాకుండా.. రోజుకి 8 గ్లాసుల నీళ్లు తాగాలి. మరి.. ఉదయం నిద్రలేచీ లేవగానే ఒక గ్లాసు నీళ్లు తాగడం వల్ల ఎలాంటి ఫలితాలు పొందుతారో చూడండి..

Posted By:
Subscribe to Boldsky

ఎక్కువ నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిది. కానీ.. ఎక్కువ నీళ్లు తాగడం అనేది చాలామందికి చాలా కష్టమైన పని. అలాగే పేరెంట్స్, పెద్దవాళ్లు.. ఎక్కువ నీళ్లు తాగడం వల్ల హెల్తీగా ఉంటారని సూచిస్తూ ఉంటారు.

నీళ్లు తాగడం వల్ల కలిగే ఫలితాలను పూర్తీగా పొందాలంటే.. దానికి ఒక సమయం ఉంటుంది. నీళ్లను కొన్ని సమయాల్లో తీసుకోవడం వల్ల ఎక్కువ ఫలితాలు పొందవచ్చు. అలాంటివాటిలో నిద్రలేచిన కొన్ని నిమిషాల్లోనే ఒక గ్లాసు నీళ్లు తాగడం కూడా. ఈ అలవాటు ఒక వ్యక్తి ఆరోగ్యానికి చాలా ఎఫెక్టివ్ ఫలితాన్నిస్తుంది.

water

కొంతమంది ఈ టిప్ ఫాలో అవుతారు. కానీ కొంతమంది మానేస్తూ ఉంటారు. టైం లేక లేదా మరచిపోవడం లేదా బద్ధకం వల్ల ఇలా ఉదయాన్నే ఒక గ్లాసు నీళ్లు తాగరు. కానీ నీళ్లు నేచర్ ప్రసాదించిన అద్భుత ఔషధం. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా.. అద్భుత ఫలితాలను అందిస్తుంది.

ఉదయాన్నే ఒక గ్లాసు నీళ్లు తాగడమే కాకుండా.. రోజుకి 8 గ్లాసుల నీళ్లు తాగాలి. మరి.. ఉదయం నిద్రలేచీ లేవగానే ఒక గ్లాసు నీళ్లు తాగడం వల్ల ఎలాంటి ఫలితాలు పొందుతారో చూడండి..

రీహైడ్రేట్

ఎక్కువ గంటలు నిద్రపోవడం వల్ల మన శరీరం డీహైడ్రేట్ అవుతుంది. కాబట్టి.. మనం నిద్రలేవగానే.. ఒక గ్లాసు నీటిని తాగితే.. శరీరం రీహైడ్రేట్ అవుతుంది. ఎనర్జీని, రిఫ్రెష్ మెంట్ ని పొందిన ఫీలింగ్ కలుగుతుంది.

టాక్సిన్స్

నిద్రపోయేటప్పుడు శరీరం రిపేర్ అవుతుంది, ఉదయం నిద్రలేవగానే టాక్సిన్స్ ని బయటకు పంపడం అవసరం. కాబట్టి ఉదయం నిద్రలేచిన కొన్ని నిమిషాల్లోనే ఒక గ్లాసు నీళ్లు తాగితే.. శరీరంలోని మలినాలన్నీ బయటకువెళ్లిపోయి.. హెల్తీగా ఉంటారు.

కాన్ట్సిపేషన్

కాన్ట్సిపేషన్ కి ప్రధాన కారణం డీహైడ్రేషన్. కాబట్టి.. ఉదయం నిద్రలేవగానే ఒక గ్లాసు నీళ్లు తాగడం వల్ల.. కాన్ట్సిపేషన్ ను నివారించి.. బోవెల్ మూమెంట్ ని మెరుగుపరుస్తుంది.

మెటబాలిజం

నిద్రలేచిన వెంటనే ఒక గ్లాసు నీళ్లు తాగడం వల్ల మెటబాలిజం మెరుగుపడుతుంది. అలాగే రోజంతటికీ కావాల్సిన ఎనర్జీ అందుతుంది.

బరువు తగ్గడానికి

ఉదయం నిద్రలేవగానే నీళ్లు తాగడం వల్ల.. అదనపు బరువు తగ్గించుకోవచ్చని అనేక అధ్యయనాలు నిరూపిస్తున్నాయి.

జీర్ణక్రియ

శరీరంలో సరైన మోతాదులో నీళ్లు లేకపోతే.. జీర్ణక్రియ సమస్యలు వస్తాయి. ఉదయాన్నే ఒక గ్లాసు నీళ్లు తాగడం వల్ల.. జీర్ణక్రియ సజావుగా సాగుతుంది.

హార్ట్ బర్న్

నిద్రలేవగానే ఒక గ్లాసు నీళ్లు తాగడం వల్ల పొట్టలో యాసిడ్ లెవెల్స్ ని తగ్గించి.. హార్ట్ బర్న్ వంటి సంకేతాలను అరికడుతుంది.

మెదడు చురుగ్గా పనిచేయడానికి

శరీరం ఎప్పుడైతే డీహైడ్రేట్ అవుతుందో.. మెదడు పనితీరుకి ఆటంకం ఏర్పడుతుంది. నిద్రలేవగానే ఒక గ్లాసు నీళ్లు తాగడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది.

" కంపేర్ & బై " బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్

English summary

Reasons You Need To Drink A Glass Of Water Within Minutes Of Waking Up!

Reasons You Need To Drink A Glass Of Water Within Minutes Of Waking Up! There are several benefits of drinking water. Drinking water within minutes of waking up is very helpful to keep one healthy.
Please Wait while comments are loading...
Subscribe Newsletter