For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సమ్మర్ లో బాడీ హీట్ తగ్గించే ఎఫెక్టివ్ హోం రెమిడీస్

By Swathi
|

35 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. ఈ టెంపరేచర్ లో ఉండటం అంటే మామూలు విషయం కాదు. ఎంత ఖర్చు పెట్టి ఏసీలు, ఫ్రిడ్జ్ లు, కూలర్స్ కొనుక్కున్నా.. తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తాయి కానీ.. శరీరంలో టెంపరేచర్ ని మాత్రం తగ్గించలేవు. ఎన్ని నీళ్లు తాగినా, ఎన్ని ఫ్రూట్స్ తీసుకున్నా.. ఆవిరైపోతుంటాయి. అలాంటి పరిస్థితులు ఎదుర్కుంటున్నవాళ్లు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ.. ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలి.

సన్ స్ట్రోక్ ( వడదెబ్బ ) గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన లక్షణాలు, జాగ్రత్తలు సన్ స్ట్రోక్ ( వడదెబ్బ ) గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన లక్షణాలు, జాగ్రత్తలు

సాధారణంగా మన శరీరంలో టెంపరేచర్ 36 నుంచి 37 డిగ్రీల సెల్సియస్ మధ్యలో ఉండాలి. అంటే 97 నుంచి 99 ఫారన్ హీట్ అనమాట. కానీ కొన్ని సందర్భాల్లో వేడి, వాతావరణంలో మార్పులు, సూర్యకిరణాలు, బిగుతైన దుస్తుల కారణంగా.. శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. చెమట ద్వారా కూడా శరీరం కూల్ అవలేని పరిస్థితి ఉంటుంది.

సమ్మర్లో సన్ రాషెస్, స్వెట్ పింపుల్స్ నివారించే నేచురల్ రెమెడీస్ సమ్మర్లో సన్ రాషెస్, స్వెట్ పింపుల్స్ నివారించే నేచురల్ రెమెడీస్

ప్రస్తుతం ఉన్న ఎండల కారణంగా.. బాడీ హీట్ సమస్య ప్రతి ఒక్కరినీ వేధిస్తుంటుంది. అందుకే ఎక్కువ నీళ్లు తాగమని చాలామంది సలహా ఇస్తుంటారు. అయితే.. కొన్ని సందర్భాల్లో బాడీ హీట్ మరీ ఎక్కువైతే.. వడదెబ్బకు దారితీస్తుంది. ఇది కాస్త రిస్క్ తో కూడినది. కాబట్టి.. బాడీ హీట్ తగ్గించుకోవడానికి కొన్ని సింపుల్ హోం రెమిడీస్ ఉన్నాయి. అవి ఫాలో అవడం మంచిది.

కొబ్బరినీళ్లు

కొబ్బరినీళ్లు

బాడీ హీట్ తగ్గించుకోవడానికి కొబ్బరినీళ్లు సూపర్ సొల్యూషన్. తక్కువ క్యాలరీలు, కొలెస్ట్రాల్ లేని కొబ్బరినీళ్లు తాగడం వల్ల శరీరంలో హీట్ తగ్గించుకోవచ్చు. రోజూ కొబ్బరినీళ్లు తాగడం వల్ల బాడీ హీట్ తగ్గుతుంది. ఒకవేళ మీరు ఈ సమస్యతో ఎక్కువగా బాధపడుతుంటే.. రోజుక 3 నుంచి 4 కొబ్బరిబోండం నీళ్లు తాగాలి.

లెమన్ వాటర్

లెమన్ వాటర్

నిమ్మకాయల్లో విటమిన్ సి ఉండటం వల్ల ఇది బాడీ టెంపరేచర్ ని తక్షణమే తగ్గిస్తుంది. కాబట్టి.. ఒక నిమ్మకాయ రసం, నీళ్లు, 1 నుంచి రెండు టీస్పూన్ల తేనె, చిటికెడు ఉప్పు తీసుకుని అన్ని మిక్స్ చేసుకోవాలి. ఈ నీటిని రోజుకి 3 నుంచి నాలుగుసార్లు తాగితే బాడీ హీట్ తగ్గుతుంది.

పుచ్చకాయ

పుచ్చకాయ

బాడీ హీట్ తగ్గించడంలో వాటర్ బేస్ట్ ఫ్రూట్స్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. అలాగే ఇవి టేస్టీగా కూడా ఉంటాయి. కాబట్టి.. సమ్మర్ లో ఎంత వీలైతే.. అంత వాటర్ మిలాన్ తీసుకోండి. ఈ పుచ్చకాయను ఫ్రిడ్జ్ లో పెట్టి తీసుకోవడం వల్ల బాడీ హీట్ తగ్గించవచ్చు.

కుకుంబర్ జ్యూస్

కుకుంబర్ జ్యూస్

దోసకాయ కూడా వాటర్ బేస్ట్ ఫ్రూట్ కిందకు వస్తుంది. ఇది కూడా శరీరంలో హీట్ ని తగ్గిస్తుంది. కాబట్టి దోసకాయకి తొక్క తీసి ముక్కలుగా కట్ చేసి.. జ్యూస్ తయారు చేసుకోవాలి. ఇందులో కొంచెం నిమ్మరసం కలిపి తీసుకుంటే.. బాడీ హీట్ తగ్గిపోతుంది. లేదా దోసకాయ ముక్కలు తీసుకున్నా సరిపోతుంది.

ముల్లంగి

ముల్లంగి

బాడీ హీట్ తగ్గించడంలో ముల్లంగి సహాయపడుతుందని చాలామందికి తెలియదు. ముల్లంగిలో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సలాడ్స్ రూపంలో తీసుకోవచ్చు. లేదా పుదీనా, నిమ్మరసం, ఉప్పు కలిపి జ్యూస్ చేసుకుని తీసుకున్నా బాడీ హీట్ తగ్గుతుంది.

పుదీన

పుదీన

ఘాటైన సువాసన రుచి కలిగిన పుదీనలో తాజా ఫీలింగ్ ఇచ్చే గుణాలున్నాయి. కాబట్టి.. కొన్ని పుదీన ఆకులు, 2 కప్పుల నీళ్లు, ఐస్ క్యూబ్స్, 1 టీస్పూన్ నిమ్మరసం, 2 టీస్పూన్ల తేనె తీసుకోవాలి. ముందుగా నీళ్లు మరిగించి.. అందులో పుదినా ఆకులు కలపాలి. 4 నిమిషాలు మళ్లీ మరిగించాలి. ఇప్పుడు చల్లారిన తర్వాత ఐస్ క్యూబ్స్ వేసి.. ఫ్రిడ్జ్ లో పెట్టాలి. తర్వాత నిమ్మరసం, తేనె కలిపి.. రోజుకి 3 సార్లు తాగితే బాడీ టెంపరేచర్ తగ్గుతుంది.

దానిమ్మ జ్యూస్

దానిమ్మ జ్యూస్

బాడీ హీట్ తగ్గించడంలో దానిమ్మ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి, పొటాషియం, యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలుంటాయి. కాబట్టి ఈ దానిమ్మ జ్యూస్ ని రోజూ తాగడం వల్ల బాడీ హీట్ తగ్గించుకోవచ్చు.

చెరకు రసం

చెరకు రసం

చెరకు రసంలో.. గ్లూకోజ్, ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఇవి శరీరంలో వేడి వల్ల వచ్చే అలసటను తగ్గిస్తాయి. కాబట్టి.. రోజుకి 1 నుంచి 2 గ్లాసుల చెరకు రసం తాగితే.. మంచి ఫలితం ఉంటుంది.

మజ్జిగ

మజ్జిగ

మజ్జిగ ( బట్టర్ మిల్క్ ) చాలా హెల్తీ డ్రింక్. సమ్మర్ లో రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ తో పాటు.. మజ్జిగ తాగడం వల్ల శరీరంలో హీట్ తగ్గించవచ్చు. అలాగే ఒకవేళ మీరు బాడీ హీట్ తో బాధపడుతుంటే.. రోజుకి 2 నుంచి 3 సార్లు మజ్జిగ తాగడం మంచిది.

అరటిపండు

అరటిపండు

రోజూ ఉదయాన్నే 2 అరటిపండ్లు తినడం వల్ల శరీరంలో హీట్ తగ్గించవచ్చు. ఇందులో గ్లూకోజ్, ఫ్రక్టోజ్, ఫైబర్ ఉంటుంది. ఇది ఎనర్జీతో పాటు.. రోజంతా ఉత్సాహంగా ఉండటానికి సహాయపడుతుంది. అలాగే.. శరీరంలో వేడిని తగ్గిస్తుంది.

English summary

Simple Tips to Reduce Body Heat/ temparature

Simple Tips to Reduce Body Heat/ temparature. If you do not take proper measures to bring down your body heat, it may lead to heat stroke which is quite risky. Here are some home remedies to reduce body heat so that you may not have to suffer from heat stroke.
Desktop Bottom Promotion