బ్రేక్ ఫాస్ట్ ని నిర్లక్ష్యం చేస్తే.. మీ గుండె రిస్క్ లో పడ్డట్టే..!

బ్రేక్ ఫాస్ట్ తీసుకునే వాళ్లతో పోల్చితే.. బ్రేక్ ఫాస్ట్ మానేసే వాళ్లకు హార్ట్ ఎటాక్ రావడానికి ఎక్కువ అవకాశాలున్నాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి హెల్తీ బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం వల్ల హార్ట్ ఎటా

Posted By:
Subscribe to Boldsky

చాలా కాలంగా వింటూనే ఉన్నాం..రోజులో బ్రేక్ ఫాస్ట్ చాలా ముఖ్యమైనదని. ప్రతి ఒక్కరూ తప్పకుండా అల్పాహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తూ ఉన్నారు. కానీ ఎంత మంది ఈ నియమాన్ని పాటిస్తున్నారు ? చాలా మంది ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారు. సన్నగా అవడానికి బ్రేక్ ఫాస్ట్ మానేయడానికే చాలా మంది ఆసక్తి చూపుతున్నారు.

Skipping breakfast may increase heart disease risk

కానీ అలా బ్రేక్ ఫాస్ట్ మానేయడం అస్సలు మంచిది కాదని అధ్యయనాలు చెబుతున్నాయి. రాత్రి భోజనం తర్వాత శరీరానికి దాదాపు 12 గంటల తర్వాత అల్పాహారం ద్వారా ఆహారం అందిస్తాం. కాబట్టి ఇది కంపల్సరీ తీసుకోవాలి. అయితే చాలా మంది ఫిట్ నెస్ మాయలో పడి అల్పాహారం నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇలా టిఫిన్ తినడం మానేయడం వల్ల చాలా అనర్థాలు జరుగుతాయి. అనేక హెల్త్ ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా గుండె పోటు వచ్చే అవకాశం ఉందని స్టడీస్ హెచ్చరిస్తున్నాయి.
Skipping breakfast may increase heart disease risk

బ్రేక్ ఫాస్ట్ తీసుకునే వాళ్లతో పోల్చితే.. బ్రేక్ ఫాస్ట్ మానేసే వాళ్లకు హార్ట్ ఎటాక్ రావడానికి ఎక్కువ అవకాశాలున్నాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి హెల్తీ బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం వల్ల హార్ట్ ఎటాక్ రిస్క్ నుంచి బయటపడవచ్చు. టిఫిన్ తినకపోవడం వల్ల హైపర్ టెన్షన్ రిస్క్ కూడా ఉంది.
Skipping breakfast may increase heart disease risk

ఉదయాన్నే చేసే బ్రేక్‌ఫాస్ట్‌ని మరచిపోయినా, అసలు చేయకపోయినా గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని హార్వర్డ్‌ పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. సుమారు 27 వేల మంది మీద సుదీర్ఘ కాలం పరిశోధనలు నిర్వహించారు. వీరిని రెండు గ్రూపులుగా విభజించి ఒక గ్రూపు వారికి ఉదయాన్నే అల్పాహారం అందించారు. రెండవ గ్రూపు వారికి అల్పాహారాన్ని ఇవ్వలేదు. కొన్ని రోజుల తర్వాత వీరిని పరిశీలించగా, అల్పాహారం తీసుకోని వారిలో 13 శాతం మందిలో గుండె సంబంధిత సమస్యలను గుర్తించారు. కాబట్టి ఎట్టిపరిస్థితుల్లో బ్రేక్ ఫాస్ట్ మానేయకండి.

" కంపేర్ & బై " బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్

English summary

Skipping breakfast may increase heart disease risk

Skipping breakfast may increase heart disease risk. HSPH researchers found that men who regularly skipped breakfast had a 27% higher risk of heart attack or death from coronary heart disease than those who did eat a morning meal.
Story first published: Tuesday, November 15, 2016, 8:00 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter