భోజనం తర్వాత చిటికెడు బెల్లం తింటే పొందే అద్భుతమైన ప్రయోజనాలు..!!

చిటికెడు బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే చాలు... ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ బాగా జ‌రుగుతుంద‌ట‌. రోజంతా ఆఫీసుల్లో టెన్ష‌న్ టెన్ష‌న్ గా గ‌డిపేవాళ్ల‌కు ఇది ఎంతో మంచిద‌ట‌.

Posted By:
Subscribe to Boldsky

సాధారంగా ఇల్లల్లో పెద్దవారు(వయస్సైన వారు) ఉన్నట్లైతే వారు ప్రతి భోజనం తర్వాత చిటికెడు బెల్లం ముక్కను నోట్లో వేసుకుని చప్పరించడం అలవాటు . అదే యంగర్ జనరేషన్ వారికైతే ఫుల్ మీల్స్ తర్వాత ఒక స్వీట్ లేదా యమ్మీ డెజర్ట్ ఉండాల్సిందేనని కోరుకుంటారు. అయితే యంగ్ జనరేషన్ కంటే ఓల్డర్ జనరేషన్ వారు పాటించే విధానంలోనే అత్యధిక, అత్యద్భుతమైన ప్రయోజనాలున్నాయి. అందుకే పురాతన కాలం నుండే ఈ అలవాటు వాడుకలో ఉన్నది. ఇంటి నుంచి బ‌య‌లుదేరే ముందు కాస్త బెల్లం తిని వెళ్తే మంచి శ‌కునమ‌ని పెద్ద‌వాళ్లు కూడా చెబుతుంటారు. పంచదార కంటే బెల్లంలో అద్భుతమైన ప్రయోజనాలున్నాయి.

మన ఇండియాలో బెల్లంను వివిధ రకాల పేర్లుతో పిలుస్తారు. బెల్లంను షుగర్ కేన్ జ్యూస్(చెరకు రసం) , డేట్ పాల్మ్ నుండి తయారుచేస్తారు. పామే కుటుంబానికి చెందిన తాటి, జీలుగ చెట్లనుండి కూడా బెల్లం తయారవుతుంది. భారతీయ వంటలలో బెల్లం ఒక ముఖ్యమైన భాగం. బెల్లం (Jaggery)ఒక తియ్యటి ఆహార పదార్థం.. అంతే ఔషధాల గని అని కూడా చెప్పవచ్చు. బెల్లం తినాలంటే ఎక్కువ ప్ర‌యాస ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. బెల్లం కోసం ఎక్కువ డ‌బ్బు ఖ‌ర్చుపెట్టాల్సిన అవ‌స‌రం కూడా ఉండ‌దు. మార్కెట్లో ఇత‌ర ధ‌ర‌ల‌తో పోలిస్తే బెల్లం రేటు కాస్తంత త‌క్కువే. ఏదో పండ‌గ సంద‌ర్భంలో త‌ప్ప బెల్లం జోలికి వెళ్ల‌డం చాలా త‌క్కువ‌. ఆ బెల్ల‌మే క‌దా అని తీసి పారేయ‌కండి. బెల్లంతో ఎన్నో ప్ర‌యోజ‌నాలున్నాయి. ముఖ్యంగా చ‌లికాలంలో బెల్లం తిన‌డం ఆరోగ్యానికి ఎంతో మంచిద‌ట‌.

ముఖ్యంగా దీంతో శ‌రీరానికి కావాలసిన వేడి అందుతుంద‌ని చెబుతారు. అంతేకాదు ఎన్నోర‌కాల రోగాల‌ను నిరోధించే శ‌క్తి బెల్లానికి ఉంది. ముఖ్యంగా గ‌ర్భ‌వ‌తి అయిన స్త్రీలు బెల్లాన్ని సేవిస్తే ఎంతో మంచిద‌ట‌.ఆయుర్వేదంలోనూ బెల్లానికి ఎంతో ప్రాధాన్య‌త ఉంది. చ‌లికాలంలో ద‌గ్గు, జలుబు లాంటి ఎన్నో రోగాల‌ను నిరోధించే శ‌క్తి బెల్లానికి ఉంది. చిటికెడు బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే చాలు... ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ బాగా జ‌రుగుతుంద‌ట‌. రోజంతా ఆఫీసుల్లో టెన్ష‌న్ టెన్ష‌న్ గా గ‌డిపేవాళ్ల‌కు ఇది ఎంతో మంచిద‌ట‌.

ఈ నేచురల్ స్వీట్(బెల్లం ) లో దాగున్న 12 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. పంచదార లేదా చక్కెర కంటే బెల్లం ఆరోగ్యపరంగా శ్రేష్టం ఎందుకంటే బెల్లంలో ఇనుము మొదలైన మూలకాలు ఉంటాయి. బెల్లంలో ఎలాంటి రసాయ‌న ప‌దార్థాల వాడ‌కం ఉండ‌దు. చూశారా బెల్లానికి ఎంత ప్రాధాన్య‌త ఉందో.. ఇక నుంచి ఆ బెల్ల‌మే క‌దా అని లైట్ తీసుకోకండి.. కాస్త అప్పుడ‌ప్పుడు చిటికెడు బెల్లాన్ని నోట్లో వేసుకుందాం... ఆరోగ్యానికి అవసరమైయ్యేన్ని ప్రయోజనాలను పొందుదాం...

బరువు తగ్గిస్తుంది:

బరువు తగ్గించడంలో బెల్ల అద్భుతమైన ఆహారపదార్థం. బెల్లంలో ఉండే పొటాషియం కంటెంట్ శరీరంలోని వాటర్ రిటెన్షన్ ను తగ్గిస్తుంది. ఇది బరువును రెగ్యులేట్ చేస్తుంది. స్వీట్స్ తినడం కంటే రెగ్యులర్ డైట్ లో బెల్లం చేర్చుకోవడం బరువు కంట్రోల్లో ఉంటుంది, స్వీట్స్ తినాలనే కోరికా తగ్గుతుంది.

ఎనర్జీ పెంచుతుంది:

స్వీట్ తినడం కంటే బెల్లం తినడం వల్ల ఇన్ స్టాంట్ ఎనర్జీని పొందుతారు. రక్తనాళాల్లో ఐరన్ కలవడం వల్ల తక్షణ శక్తిని అందిస్తుంది. బెల్లం తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ పెరగకుండా ఉంటాయి.

దగ్గు, జలుబు నివారిస్తుంది:

కామన్ కోల్డ్ అండ్ కఫ్ తో బాధపడుతున్నట్లైతే గోరువెచ్చని నీటిలో లేదా టీలో బెల్లం కలిపి తాగడం వల్ల దగ్గు, జలుబు నుండి తక్షణ ఉపశమనం పొందుతారు.

మలబద్దకం నివారిస్తుంది:

భోజనం తర్వాత చిటికెడు బెల్లం తినడం వల్ల శరీరంలో ఎంజైమ్స్ యాక్టివేట్ అవుతాయి. బౌల్ మూమెంట్ మెరుగుపడుతుంది. దాంతో మలబద్దక సమస్యను నివారించుకోవచ్చు.

లివర్ కు మంచి నేస్తం:

ఇతర స్వీట్స్, ఫ్యాటీ ఫుడ్స్ కంటే బెల్లం తినడం వల్ల లివర్ క్లీన్ అవుతుంది. శరీరంలో హానికరమైన టాక్సిన్స్ ను తొలగిస్తుంది. . స్ట్రాంగ్ లివర్ ఉండాలంటే వీటిని రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిందే.

మెనుష్ట్రువల్ పెయిన్ తగ్గిస్తుంది:

బెల్లంలో న్యూట్రీషియన్స్ అధికంగా ఉండటం వల్ల దీన్ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే, మహిళల్లో నెలసరిలో వచ్చే సమస్యలను , క్రాంప్స్ ను నివారిస్తుంది.

కూలింగ్ ఎఫెక్ట్ :

వేసవి సీజన్లో బెల్లం వినియోగించడం ఆరోగ్యానికి మంచిది. ఇది నార్మల్ బాడీ టెంపరేచర్ ను మెయింటైన్ చేస్తుంది. పొట్టను కూల్ గా ఉంచుతుంది, అందువల్ల ఇతర సమస్యలను నివారిస్తుంది.

అనీమియా నివారిస్తుంది:

పైన సూచించిన విధంగానా , బెల్లంను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల అనీమియా సమస్యను నివారించుకోవచ్చు. ఇది రెడ్ బ్లడ్ సెల్స్ ను నార్మల్ లెవల్స్ కు తీసుకొస్తుంది.

బ్లడ్ ఫ్యూరిఫై చేస్తుంది:

బెల్లంను రెగ్యులర్ గా తినడం వల్ల శరీరంలో రక్తంను శుద్ది చేయడానికి గ్రేట్ గా సహాయపడుతుంది.

వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది:

బెల్లంలో ఉండే యాంటీఆక్సిడెంట్స్, మినిరల్స్ శరీరానికి తగినంత శక్తిని అందిస్తుంది. ఫ్రీరాడికల్స్ తో పోరాడుతుంది. రక్తంలో హీమోగ్లోబిన్ కౌంట్ ను పెంచుతుంది.

క్యాన్సర్ నివారిణి:

బెల్లంలో మెగ్నీషియం అధికంగా ఉండటం వల్ల క్యాన్సర్ ను నివారించడంలో ఫర్ఫెక్ట్ ఏజెంట్ గా పనిచేస్తుంది. కోలన్ ను క్యాన్సర్ కూడా నివారిస్తుంది.

బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేస్తుంది:

బెల్లంలో ఉండే పొటాసియం, సోడియం కంటెంట్స్ శరీరంలో అసిడిక్ లెవల్స్ ను మెయింటైన్ చేస్తుంది,. దాంతో బ్లడ్ ప్రెజర్ నార్మల్ గా ఉంటుంది.

" కంపేర్ & బై " బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్

English summary

Substitute Sweet With Jaggery In Your Diet & You Will Get These 12 Excellent Results For Your Health

Jaggery is a powerhouse of nutrients and is an easy substitute for sugar. This article lists 12 benefits of jaggery for our health.
Please Wait while comments are loading...
Subscribe Newsletter