For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మునగాకులో దాగున్న వందల వ్యాధులు నయం చేసే సత్తా !

By Swathi
|

మునక్కాడలు అందరూ ఉపయోగిస్తూ ఉంటారు కదూ. అయితే.. ఈ మునక్కాడలే కాదు.. మునగ ఆకులోనూ పవర్ ఫుల్ హెల్త్ బెన్ఫిట్స్ దాగున్నాయి. దీన్ని మోరింగా, హార్స్ రాడిష్ ట్రీ అని పిలుస్తారు. సన్నగా, గుండ్రంగా ఉండే ఈ ఆకుల నుంచి పోషకాలు, బీటా కెరోటిన్, పొటాషియం, విటమిన్ సి, క్యాల్షియం, ప్రొటీన్ పుష్కలంగా లభిస్తాయి.

4 వేల సంవత్సరాల కంటే ముందు నుంచే ఈ ఆకులను మెడిసిన్స్ లో ఉపయోగిస్తున్నారంటే.. ఇందులోని గొప్పదనం ఏంటో తెలుస్తోంది. ఆయుర్వేదంలో మునగాకును 300 లకు పైగా వ్యాధులు నయం చేయడానికి ఉపయోగిస్తారట. అందుకే దీన్ని ట్రెడిషనల్ మెడిసిన్ గా పిలుస్తారు. మ‌రి మున‌గ ఆకులో దాగున్న ఔష‌ధ‌గుణాలేంటో ఇప్పుడు చూద్దాం..

మునగ విత్తనాలు

మునగ విత్తనాలు

మునగ విత్తనాలు నీటిని శుభ్రం చేయడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయట. ఇతర పద్ధతుల కంటే.. మునగ విత్తనాలను ఉపయోగిస్తే.. ఎక్కువ ఫలితాలుంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఎండిన మునగ ఆకు

ఎండిన మునగ ఆకు

మునగ ఆకుల్లో విటమిన్స్, ఎమినో యాసిడ్స్, మినరల్స్ ఉంటాయి. ఎండిన మునగ ఆకు నుంచి క్యారట్ల ద్వారా పొందే విటమిన్ ఏ ని 10 రెట్లు ఎక్కువగా పొంద‌వ‌చ్చు.

క్యాల్షియం

క్యాల్షియం

పాల నుంచి పొందే క్యాల్షియం కంటే 17 రెట్లు ఎక్కువగా మునగ ఆకు నుంచి పొంద‌వ‌చ్చు.

ప్రొటీన్స్

ప్రొటీన్స్

పెరుగు నుంచి పొందే ప్రొటీన్స్ 9 రెట్లు ఎక్కువగా పొంద‌వ‌చ్చు.

పొటాషియం

పొటాషియం

అరటిపండ్ల నుంచి పొందే పొటాషియం 15 రెట్లు ఎక్కువగా ఎండిన మునగ ఆకు నుంచి పొంద‌వ‌చ్చు.

విటమిన్ సి

విటమిన్ సి

ఆరంజ్ ల నుంచి పొందే విటమిన్ సిని 12 రెట్లు ఎక్కువగా పొందవచ్చని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.

షుగర్ లెవెల్స్

షుగర్ లెవెల్స్

మునగాకులో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ ద్వారా బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుందట.

మహిళలకు

మహిళలకు

మహిళలు రోజుకి 7 గ్రాముల మునగాకు పొడిని 3 నెలల పాటు రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల 13.5 శాతం బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించవచ్చని సైంటిస్ట్ లు సూచిస్తున్నారు.

థైరాయిడ్

థైరాయిడ్

థైరాయిడ్ ని కూడా రెగ్యులేట్ చేసే న్యాచురల్ మెడిసిన్ మునక ఆకు.

క్యాన్సర్, యాంటీ ట్యూమర్ గుణాలు

క్యాన్సర్, యాంటీ ట్యూమర్ గుణాలు

మునగాకులలో పవర్ ఫుల్ నియాంజిమినైన్ అనే యాంటీ క్యాన్సర్, యాంటీ ట్యూమర్ గుణాలు ఉంటాయని అనేక అధ్యయనాలు నిరూపించాయి. అలాగే ఐదు రకాల క్యాన్సర్ లను నిరోధించే సత్తా ఈ మునగాకులో ఉందని తాజా అధ్యయనం తేల్చింది.

లంగ్, లివర్

లంగ్, లివర్

లంగ్, లివర్, ఒవేరియన్, మెలానోమా వంటి ఐదు రకాల క్యాన్సర్లు రాకుండా ఈ మునగాకు పొడి అరికట్టగలదట.

English summary

Surprising health benefits of Moring leaves

Amazing health benefits of Moringa leaves. Moringa is usually described as the “drumstick tree”, “horseradish tree”, or “miracle tree”, with a small and rounded leaves packed with a great amount of nutrition, as beta-carotene, potassium, Vitamin C, calcium, protein, and more.
Story first published:Wednesday, June 29, 2016, 14:34 [IST]
Desktop Bottom Promotion