మగవాళ్లకు అత్యంత అవసరమైన టెస్టోస్టెరాన్ ని పెంచే పవర్ ఫుల్ ఫుడ్స్..!

టెస్టోస్టెరాన్ రకరకాల బాధ్యతలు నిర్వర్తిస్తుంది. ముఖ్యంగా లైంగిక సామర్థ్యం, రీప్రొడక్షన్, కండరాలు, స్టామినా, లిబిడో వంటి రకరకాల ఫంక్షన్స్ కి టెస్టోస్టెరాన్ హార్మోన్ సహాయపడుతుంది.

Posted By:
Subscribe to Boldsky

ఈ కాలంలో చాలామంది అబ్బాయిలకు టోన్డ్ స్కిన్, బాగా ఆకట్టుకునే బాడీ కావాలనుకుంటారు. బాగా ఫిట్ గా కనిపించాలని ఆశిస్తారు. అయితే కొన్ని ఆహారాలు.. అబ్బాయిల శరీరంలో టెస్టోస్టెరాన్ లెవెల్స్ ని మెరుగుపరుస్తాయి. దీనివల్ల మీరు ఎక్కువ కండలు పొందవచ్చు.

Testosterone-Boosting Foods Men Must Consume For Stamina!

కండల వీరుడిలా రెచ్చిపోవాలని.. ప్రతి అబ్బాయూ ఇష్టపడతాడు. దానివల్ల చాలా ఎట్రాక్టివ్ గా, అందంగా, ఫిట్ గా కనిపించవచ్చని భావిస్తారు. ఫిట్ గా ఉండాలంటే.. రెగ్యులర్ గా వ్యాయామం కంపల్సరీ. వ్యాయామం చేయడం వల్ల అనేక వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.

టెస్టోస్టెరాన్ అనేది ఒక హార్మోన్. అది మగవాళ్ల శరీరంలో ఉత్పత్తి అవుతుంది. ఇది రకరకాల బాధ్యతలు నిర్వర్తిస్తుంది. ముఖ్యంగా లైంగిక సామర్థ్యం, రీప్రొడక్షన్, కండరాలు, స్టామినా, లిబిడో వంటి రకరకాల ఫంక్షన్స్ కి టెస్టోస్టెరాన్ హార్మోన్ సహాయపడుతుంది.

ఒకవేళ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఇంబ్యాలెన్స్డ్ గా, తక్కువగా ఉన్నాయంటే.. ఆరోగ్యంగా దుష్ర్పభావం పడుతుంది. కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. కండరాలు బలహీనంగా మారడం, సెక్స్ పై ఆసక్తి తగ్గడం, ఎరెక్టల్ డిస్ ఫంక్షన్, అలసట, డిప్రెషన్, చిరాకు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి మగవాళ్లలో చాలా ముఖ్యమైన టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెంచడంతో పాటు, స్టామినా పెంచే.. ఆహారాలేంటో చూద్దాం..

గ్రేప్స్

గ్రేప్స్ న్యాచురల్ గానే టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెంచుతాయి. అలాగే స్పెర్మ్ కౌంట్ ని మెరుగుపరిచి.. సంతానోత్పత్తిని పెంచుతాయి.

ట్యూనా ఫిష్

ట్యూనా ఫిష్.. శరీరంలో టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెంచడానికి సహాయపడుతుంది. ఇందులో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ఇది.. టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది.

దానిమ్మ

మగవాళ్లలో టెస్టోస్టెరాన్ లెవెల్స్ మెరుగుపరచడానికి దానిమ్మ సహాయపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి.. మగవాళ్లకు ఇది చాలా ఎఫెక్టివ్ ఫుడ్.

వెల్లుల్లి

వెల్లుల్లిలో శరీరంలో కార్టిసాల్ ని తగ్గించే సత్తా ఉంటుంది. అలాగే టెస్టోస్టెరాన్ లెవెల్స్ ని మెరుగుపరుస్తుంది. దీనివల్ల కండరాలు పెరుగుతాయి. సెక్సువల్ పర్ఫామెన్స్ పెరుగుతుంది.

ఎగ్

న్యాచురల్ గా టెస్టోస్టెరాన్ ని మెరుగుపరచడంలో.. ఎగ్స్ సహాయపడతాయి. పచ్చసొనలో.. ఉండే కొలెస్ట్రాల్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ని మగవాళ్లలో పెంచుతుంది. దీనివల్ల కండరాల గ్రోత్ కూడా ఉంటుంది.

క్యాబేజ్

క్యాబేజ్ లో.. ఇండోల్ 3 కార్బినాల్ అనేది పుష్కలంగా ఉంటుంది. ఇది.. మగవాళ్లలో ఈస్ట్రోజెన్ లెవెల్స్ ని న్యాచురల్ గా తగ్గించి.. టెస్టోస్టెరాన్ లెవెల్స్ ని మెరుగుపరుస్తుంది.

పాలు

పాలల్లో ఉండే ఎమినో యాసిడ్స్.. ప్రొటీన్.. మగవాళ్లలో న్యాచురల్ గా టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని పెంచుతాయి. అలాగే.. స్టామినాని మెరుగుపరుస్తాయి.

" కంపేర్ & బై " బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్

English summary

Testosterone-Boosting Foods Men Must Consume For Stamina!

Testosterone-Boosting Foods Men Must Consume For Stamina! Listed here are some of the best foods that can increase testosterone level and stamina in men, try them out for yourself!
Please Wait while comments are loading...
Subscribe Newsletter