వింటర్లో చలి తట్టుకోవాలంటే ఈ మసాలాల ఘాటు తగలాల్సిందే...!!

ఆహారం అనేది, అది మీ ఆరోగ్యాన్ని నిర్ణయించే విషయం. మీ శరీర ఆరోగ్యానికి అవసరమైన, సరైన ఆహారం తీసుకోవడం, శరీరం యొక్క బాడీ మాస్ ఇండెక్స్ ను మెయింటైన్ చేయడానికి చాలా అవసరం. సీజన్ బట్టీ మీ శరీరం కూడా సర్దుబా

Posted By:
Subscribe to Boldsky

నవంబర్ వచ్చిందంటే చాలు చలికి సంకేతం. రుతు చక్రంలో చలికాలం ఒక ప్రధానమైన మలుపు. గజగజ వణికించే చలిని తన వెంట తీసుకువస్తుంది. సంవత్సరానికి ఒక సారివచ్చే ఈ శీతాకాలం, చల్లని వాతారణంతో పాటు మన శరీరంలో కూడా అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ శీతాకాలనికి , చలికి తగిన విధంగా మనం సిద్ధిం చేసుకోవాలి .

మారిన సీజన్ కు అనుగుణంగా మన దుస్తులు మారాలి. చలినుండి శరీరాన్ని కాపాడుకోవడం కోసం రక్షక కవచంగా స్వెటర్లు, కాళ్ళకు సాక్సులు, చేతులకు గ్లౌజులు ఉపయోగిస్తాం.. ఇలా దుస్తులు మారితేనే మనం మన దైనందిన జీవనాన్ని యథావిధిగా కొనసాగించ గలుగుతాము. అయితే శరీరానికి బయట రక్షణ సరే..శరీరంలోపల ఆరోగ్యం సంగతేంటి? కాలాన్ని బట్టి ఆహారనియమాలు కూడా పాటించాలి. అప్పుడే జీవక్రియ కూడా సక్రమంగా పనిచేస్తుంది.

ఆహారం అనేది, అది మీ ఆరోగ్యాన్ని నిర్ణయించే విషయం. మీ శరీర ఆరోగ్యానికి అవసరమైన, సరైన ఆహారం తీసుకోవడం, శరీరం యొక్క బాడీ మాస్ ఇండెక్స్ ను మెయింటైన్ చేయడానికి చాలా అవసరం. సీజన్ బట్టీ మీ శరీరం కూడా సర్దుబాటు చేసుకోవడం అవసరం, కాబట్టి మీరు వింటర్ సీజన్ లో రైట్ ఆహారం తీసుకోవాలి. వింటర్లో తీసుకొనే ఆహారాలు కొంత వెచ్చదనం కలిగించేవిగా ఉండాలి. వింటర్ వెచ్చదనం కోసం తీసుకొనే ఆహారం ఈ సీజన్ కు తగ్గ వింటర్ డైయట్ లిస్ట్ లో చేర్చుకొని ఖచ్చితంగా వాటిని తీసుకోవడం వల్ల చలి నుండి వ్యాధుల నుండి శరీరాన్ని బహిర్గతంగా మరియు అంతర్గతంగా ఆరోగ్యంగా ఉంచుకోగలుగుతాము.

మరి ఈ వింటర్ డైయట్ కు సరిపోయే అటువంటి ఆహారాలు కొన్ని మిస్ చేయకుండా తినాల్సినవి మీకోసం....

అల్లం:

శీతాకాలంలో తీసుకొనే ఆహారాల్లో అల్లం కూడా సాధారణ ఆహారవస్తువు. దీన్ని పిల్లలు పెద్దలు ఉపయోగించివచ్చు. అల్లంలో ఉండే వైద్యపరైన గుణగణాల వల్ల శీతాకలంలో ఎదురయ్యే సాధారణ జలువు మరియు ఫ్లూ వంటి జబ్బులను ఎదుర్కొంటుంది. వింటర్ సీజన్ లో ఒక కప్పు జింజర్ టీ తీసుకోవడం వల్ల ఫ్యాటీ ఫుడ్స్ జీర్ణం అవ్వడానికి సహాయపడుతుది మరియు ఎసిడిటిని నివారిస్తుంది. జలుబు మరియు దగ్గు నివారించడానికి అల్లం ఒక ఉత్తమ రెమడీ. వింటర్ సీజన్ లో మీరు తయారుచేసే వంటకాల్లో కొద్దిగా అల్లం చేర్చడం వల్ల మీలో వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవచ్చు.

పసుపు:

పసుపులో వింటర్ సీజన్లో వచ్చే అన్ని రకాల చిన్న పెద్ద జుబ్బుల నుండి ఉపశమనం కలిగించే గుణాలు మెండుగా ఉన్నాయి. అంతే కాదు పసుపులో ఉండే యాంటీసెప్టిక్ మరియు యాంటీబ్యాక్టీరియల్ గుణాలు, వింటర్ సీజన్ లో వచ్చే అన్ని రకాల ఇన్ఫెక్షన్స్ ను దూరం చేసి, శరీరానికి వెచ్చదనాన్ని కలిగిస్తాయి.

దాల్చిన చెక్క:

వింటర్ లో సాధారణంగా వచ్చే జలుబు మరియు ఫ్లూ మరియు వింటర్ సీజన్ లో వచ్చే ఇతర ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడానికి ఇండియన్ మసాలా దినుసులు గ్రేట్ గా సహాయపడుతుంది. ఇండియన్ మసాలాలు శరీరంలో వేడి మాత్రమే పెంచడం కాదు, వ్యాధినిరోధకతకు సపోర్టో చేసి న్యూట్రీషియన్ ను ఇది ఉత్పత్తి చేస్తుంది.

పచ్చిమిర్చి:

వింటర్ సీజన్లో చలి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, చలికి మన శరీరాన్ని వెచ్చగాఉంచుకోవడం చాలా అవసరం. బాడీ టెంపరేచర్ క్రమంగా ఉన్నప్పుడు ఎలాంటి జబ్బులు రావు. ముఖ్యంగా పచ్చిమిర్చిలో ఉండే క్యాప్ససిన్ అనే కాంపౌడ్ శరీరానికి అవసరం అయ్యే వెచ్చదానాన్ని అందిస్తుంది. చలికాలంలో చర్మం పగుళ్లు, బర్నింగ్ సెన్సేషన్ నుండి ఉపశమనం కలిగించడానికి గ్రీన్ చిల్లీ గ్రేట్ గా సహాయపడుతుంది.

యాలకలు:

యాలకలు మరో ఇండియన్ మసాల దినుసు. ఇది వంటలకు ఆరోమా వాసన అందివ్వడం మాత్రమే కాదు, శరీరంలో వేడి పుట్టిస్తుంది. ముఖ్యంగా వింటర్ సీజన్ లో ఎక్కువ సహాయపడుతుంది. ఇది ఆహారాల్లోనే కాదు, టీలో కూడా వేస్తుంటారు. మంచి ఆరోమా వాసనతోపాటు, రుచి కూడా ఉంటుంది.

జీలకర్ర:

బాడీ హీట్ కలిగించడంలో జీలక్రర ఒకటి. ఇది కూడా మరో ఇండియన్ పోపుదినుసు. శరీరంలో వేడిని ఉత్పత్తి చేసి, బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే జీర్ణశక్తిని పెంచుతుంది.

ధనియాలు:

ఇండియన్ మసాలా దినుసుల్లో ధనియాలు ఒకటి, ఇవి శరీరంలో వేడి ఉత్పత్తి చేయకపోయినా...వేడిని బ్యాలెన్స్ చేస్తాయి. ఇవి కొత్తిమీరకు సమానంగా పనిచేస్తాయి. జీర్ణశక్తిని పెంచుతాయి.

" కంపేర్ & బై " బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్

English summary

These Indian Spices Help To Keep You Warm During Winter - Suggests Top Indian Chef Sanjeev Kapoor

Spices are an indispensable part of every Indian kitchen. There is not a single meal that goes without a spice. The only thing one needs to keep in mind while using the spices is to make use of the correct amount. It is only then it would prove helpful for one's health.
Please Wait while comments are loading...
Subscribe Newsletter