For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బాడీపెయిన్స్, జాయింట్ పెయిన్స్ తగ్గించే నేచురల్ పెయిన్ కిల్లర్స్ ..!

సహజ నొప్పి నివారుణుల మరికొన్ని మీ వంటగదిలోనే ఉన్నాయి. నొప్పి నివారించుకోవడానికి వీటిని ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి సురక్షితం మాత్రమే కాదు. ఎక్కువగా నొప్పిగా ఉన్నా చాలా ప్రభావవంతగా పనిచేస్తాయి.

|

అనవసరంగా తీసుకొనే డ్రగ్స్(మందులు)శరీర ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తాయి. అంటువంటి డ్రగ్స్(మందు)ల్లో పెయిన్ కిల్లర్స్ ఒకటి. సాధారణంగా చాలా మంది పెయిన్ కిల్లర్స్ కు చాలా అలవాటు పడి ఉంటారు. ఏ చిన్న నొప్పి అనిపించినా డాక్టర్ ప్రిస్రిప్షన్ లేకుండానే పెయిన్ కిలర్స్ తినేస్తుంటారు. చాలా మంది అతి చిన్న సమస్యలకే చిన్న తలనొప్పి లేదా రుతుక్రమంలో వచ్చే సాధారణ నొప్పులకు కూడా పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. కానీ, నేచురల్ పెయిన్ కిల్లర్స్ లోనే చాలా రకాలు యాంటీ స్పాస్మోడిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు అనాల్జిక్ (నొప్పి నివారిణి) ఉన్నాయి. ఈ సహజ నేచురల్ పెయిన్ కిల్లర్స్ ను ఇంటర్నల్ గా మీడైయట్ లో చేర్చుకోవచ్చు మరికొన్ని ఎక్స్ టర్నల్ గా మసాజ్ చేయవచ్చు.

నేచురల్ పెయిన్ కిల్లర్స్ మీ నొప్పి నివారించడానికి చాలా బాగా సహయం చేస్తాయి. కానీ, అదే సమయంలో ఏ దీర్ఘకాలం మరియు దీర్ఘకాల నొప్పిలకు వైద్యం తీసుకోవాలి . పెయిన్ కిల్లర్స్ ను తీసుకోవడం వల్ల అవి కేవలం నొప్పి సంకేతాలను అడ్డుకోవటంతో కండరాలు సడలించడం లేదా నరాలకు ఉపశమనం కలిగించడానికి పనిచేస్తుంది. వేడి అనేది నొప్పి నివారిణిగా పరిగణించవచ్చు. నొప్పిని నివారించడానికి ఇది ఇంట్లో చేసుకొనే సాధారణ పరిస్కారం.

These Natural Painkillers Are A Must-Have For Every Home!

ఇటువంటి సహజ నొప్పి నివారుణుల మరికొన్ని మీ వంటగదిలోనే ఉన్నాయి. నొప్పి నివారించుకోవడానికి వీటిని ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి సురక్షితం మాత్రమే కాదు. ఎక్కువగా నొప్పిగా ఉన్నా చాలా ప్రభావవంతగా పనిచేస్తాయి. కాబట్టి ఎటువంటి నొప్పికోసమైనా మీరు పెయిన్ కిల్లర్స్ తీసుకొనే ముందు ఈ వంటగదిలో లభ్యం అయ్యే ఈ నేచురల్ రెమడీస్ ను ట్రై చేసి చూడండి..ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవు. తక్షణ ఉపశమనం కలిగిస్తాయి. మరి ఆ సహజనివారణోపాయాలేంటో ఒకసారి చూద్దాం...

ల్యావెండర్ ఆయిల్:

ల్యావెండర్ ఆయిల్:

ల్యావెండర్ ఆయిల్ కామన్ టైప్ పెయిన్ కిల్లర్, బాడీలో ఎలాంటి నొప్పైనా తగ్గించేస్తుంది, కొన్ని చుక్కల లావెండర్ ఆయిల్ ను బాడీలో ఎక్కడ పెయిన్ ఉంటే అక్కడ అప్లై చేస్తే నొప్పి తగ్గిపోతుంది.

ఎప్సమ్ సాల్ట్ :

ఎప్సమ్ సాల్ట్ :

గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి, ఆ నీటిని నోట్లో పోసుకొని పుక్కలించడం లేదా గార్గిల్ చేయడం వల్ల చాలా మంచి ప్రభావాన్ని చూపెడుతుంది. గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల ఏర్పడ్డ ఎటువంటి వాపులనైనా ఉప్పు తగ్గిస్తుంది. కాబట్టి రోజులో రెండు మూడు సార్లు ఇలా ఉప్పునీటిని గలగరించడం వల్ల గొంతునొప్పి నివారించుకోవచ్చు.కొద్దిగా ఉప్పును నీటిలో వేసి స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

కేయాన్ పెప్పర్ :

కేయాన్ పెప్పర్ :

కేయాన్ పెప్పర్ హాట్ ఫుడ్ . ఇది బాడీ పెయిన్స్ ను తగ్గించడంలో ఒక మంచి పెయిన్ కిల్లర్ . ఆపరేటివ్ పెయిన్ తగ్గించడంలో గ్రేట్ గా పనిచేస్తుంది.

యూకలిప్టస్ ఆయిల్:

యూకలిప్టస్ ఆయిల్:

తరచూ తలనొప్పితో బాధపడుతున్నట్లైతే యూకలిప్టస్ ఆయిల్ తలకు మర్ధన చేసుకోవడం వల్ల ఉపశమనం పొందవచ్చు. ఇందులో ఉండే యాంటీఇన్ఫ్లమేటరీ అంశాలు నొప్పి నివారిణిగా పనిచేస్తుంది.

పసుపు:

పసుపు:

కీళ్ళ నొప్పులు ఆర్థరైటిస్ కు కారణం అవుతుంది. కాబట్టి మీ రెగ్యులర్ డైట్ లో పసుపును ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి మాత్రమే కాదు కీళ్ళ నొప్పులకు కూడా ఉపశమనం కలిగిస్తుంది.

లవంగాలు:

లవంగాలు:

పంటినొప్పితో బాధపడుతుంటే కనుక లవంగాలను నమలడం వల్ల తక్షణ ఉపశమనం లభిస్తుంది. ఇది గమ్ ఇన్ఫ్లమేషన్ గా బాగా పనిచస్తుంది. లవంగాల్లో ఉండే ఈజినోల్(eugenol)అనే కారం కలిగించే అంశం ఉండటం వల్ల ఇది నొప్పిని నివారించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఒక శక్తివంతమైన సహజ నివారిణి.

హాట్ కంప్రెసర్ :

హాట్ కంప్రెసర్ :

నెయిక్ పెయిన్, జాయింట్ పెయిన్స్ తో బాధపడేవారు హాట్ కంప్రెసర్ ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. హాట్ వాటర్ బ్యాగ్ తో కాపడం పెట్టుకోవాలి. లేదా క్లీన్ గా ఉండే టవల్ ను హాట్ వాటర్లో డిప్ చేసి, కాపడం పెట్టుకుంటే నొప్పుల నుండి త్వరగా ఉపశమనం కలుగుతుంది.

కోల్డ్ కంప్రెసర్ :

కోల్డ్ కంప్రెసర్ :

కండరాల నొప్పులను నివారిచడంలో కోల్డ్ కంప్రెసర్ గ్రేట్ గా సహాయపడుతుంది, తలనొప్పి, కండరాల నొప్పులున్న ప్రదేశంలో ఐస్ క్యూబ్స్ తో మర్ధన చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

అల్లం:

అల్లం:

అల్లంను ప్రతి రోజూ మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇది కండరాలను స్టిఫ్ గా ఉంచడంతో పాటు కీళ్ళ వాపులను తగ్గిస్తుంది. ఇది పచ్చి అల్లంలో ఉండే జింజరోల్స్ వల్ల ఇలా నొప్పినివారిస్తుంది. కాబట్టి మీ రెగ్యులర్ డైట్ లో అల్లంను తప్పనిసరిగా ఉండేవిధంగా చూసుకోవాలి.

వెల్లుల్లి

వెల్లుల్లి

వెల్లుల్లి యాంటీ ఇన్ల్ఫ‌మేట‌రీ గుణాలు ఉండ‌టం వ‌ల్ల ఉల్లిపాయ‌, వెల్లుల్లి వ‌ల్ల బాడీ పెయిన్ న్యాచుర‌ల్‌గా త‌గ్గిస్తుంది. వెల్లుల్లిలో కూడా ఇన్ఫెక్ష‌న్ల‌తో పోరాడే బాడీ పెయిన్ ని తగ్గిస్తుంది.మీ చెవులలో శ్మ్లేషం చేరినట్లయితే అప్పుడు మీకు చెవి నొప్పి వస్తుంది. వేడి ఆవాల నూనెకు మెత్తగా చేసిన వెల్లుల్లి జోడించండి. ఇప్పుడు తక్షణ నొప్పి ఉపశమనానికి మీ చెవులలో కొన్ని చుక్కల నూనెను పోయాలి.

English summary

These Natural Painkillers Are A Must-Have For Every Home!

All of us at some point of time might have suffered from some kind of pain and at times these might have been excruciating. So what would you have done in such a situation? Unable to bear the pain most of us would have just popped in a painkiller tablet or taken injections.
Story first published: Saturday, October 22, 2016, 8:59 [IST]
Desktop Bottom Promotion