కేవలం వారం రోజుల్లో గ్యాస్ట్రిక్ సమస్య నివారించే రెమెడీ..!!

రకరకాల మందులు, హాస్పిటల్ కోసం ఎంత ఖర్చుపెట్టినా ఫలితం పొందడం లేదు అంటే.. ఈ సమస్యకు పరిష్కారం మీ ఇంట్లోనే ఉంది. ఇంట్లోనే చాలా అనారోగ్య సమస్యలను ఎఫెక్టివ్ గా, న్యాచురల్ గా నివారించవచ్చు.

Posted By:
Subscribe to Boldsky

ప్రతిరోజూ గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారా ? ఒకవేళ అవును అయితే.. ఈ ఎఫెక్టివ్ రెమెడీని మీరు ఒకసారి ట్రై చేయాల్సిందే. ఇది ఖచ్చితంగా వారం రోజుల్లో మీ సమస్యను నివారిస్తుంది.

రకరకాల మందులు, హాస్పిటల్ కోసం ఎంత ఖర్చుపెట్టినా ఫలితం పొందడం లేదు అంటే.. ఈ సమస్యకు పరిష్కారం మీ ఇంట్లోనే ఉంది. ఇంట్లోనే చాలా అనారోగ్య సమస్యలను ఎఫెక్టివ్ గా, న్యాచురల్ గా నివారించవచ్చు.

gastritis problem

మీ వంటింట్లో చాలా పవర్ ఫుల్ న్యాచురల్ పదార్థాలుంటాయి. వీటన్నింటిలో ఔషధ గుణాలుంటాయి. ఇవి అనేక వ్యాధులను నివారించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. పొట్టలో యాసిడ్ లెవెల్స్ పెరిగినప్పుడు స్టమక్ లైనింగ్ లో వాపు రావడం అనేది గ్యాస్ట్రిక్ ప్రధాన సంకేతం.

గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ రకరకాల కారణాల వల్ల వస్తుంది. అన్ హెల్తీ డైట్, ఇన్ఫెక్షన్, గాయాలు, ఆల్కహాల్ తీసుకోవడం, కొన్ని మందులు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ కి కారణమవుతాయి.

బెల్లీ పెయిన్, వికారం, హార్ట్ బర్న్, ఆకలి తగ్గిపోవడం, వాంతులు, తరచుగా త్రేన్పులు వంటివి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ కి లక్షణాలు. కాబట్టి.. ఈ సమస్య నుంచి తేలికగా బయటపడటానికి.. అది కూడా వారం రోజుల్లో నయం చేసుకోవడానికి ఎఫెక్టివ్ రెమెడీ.. ఇది.

vinegar

కావాల్సిన పదార్థాలు
ఉల్లిపాయ రసం అర కప్పు
వెనిగర్ 2 టీస్పూన్లు

ఈ రెమెడీ పాలో అయ్యేటప్పుడు ఖచ్చితంగా ఫ్రైడ్ ఫుడ్, స్పైసీ ఫుడ్ తీసుకోకూడదు. అలాగే ఫ్యాట్ రిచ్ ఫుడ్స్ తీసుకోకూడదు. ఇందులో ఉపయోగించే వెనిగర్, ఉల్లిపాయలో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలుంటాయి. ఇవి గ్యాస్ట్రిక్ లక్షణాలను తగ్గిస్తాయి.

onion juice

తయారు చేసే విధానం
ఉల్లిపాయ రసం, వెనిగర్ ను పైన చెప్పిన మోతాదులో తీసుకుని బాగా కలపాలి. రోజుకి రెండు సార్లు తీసుకోవాలి. భోజనం తిన్న తర్వాత ఈ డ్రింక్ తాగాలి. వారం రోజులు కంటిన్యూగా తీసుకుంటే.. గ్యాస్ట్రిక్ సమస్య నుంచి తేలికగా బయటపడవచ్చు.

" కంపేర్ & బై " బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్

English summary

This Home Remedy Can Reduce Gastritis In A Week!

This Home Remedy Can Reduce Gastritis In A Week! Are you suffering from gastritis? If yes, learn how to prepare and consume an effective home remedy for gastritis, here!
Please Wait while comments are loading...
Subscribe Newsletter