For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దగ్గు నుండి తక్షణ ఉపశమనం కలిగించే హోం మేడ్ నేచురల్ సిరఫ్ ..!

ఎక్కువ రోజుల నుండి కంటిన్యూగా దగ్గు ఆగకుండా అలాగే బాధిస్తుంటే, తలనొప్పి, చెస్ట్ పెయిన్, పొట్టనొప్పికి కారణమవుతుంది. కాబట్టి, ఈ కఫ్ సిరఫ్ లో ఉపయోగించే అల్లంను పురాతన కాలం నుండి ఔషధాల్లో, ఆయుర్వేదంలో ఎక

|

ఎక్కువ రోజుల నుండి దగ్గుతో బాధపడుతున్నారా? దగ్గు నివారించుకోవడానికి వివిధ రకాల మందులు, సిరఫ్ లు తాగినా ఫలితం లేదా? ఇటువంటి పరిస్థితిని మీరు కూడా ఎదుర్కుంటుంటే, వెంటనే నేచురల్ రెమెడీస్ కు టర్న్ అయిపోండి. మంచి ఫలితం ఉంటుంది. ఎఫెక్టివ్ గా కూడా పనిచేస్తాయి. దగ్గు నుండి ఇన్ స్టాంట్ రిలీప్ కలిగిస్తాయి.

అందుకు మీరు చేయాల్సిందల్లా, కేవలం వంటగదిలో ఉండే నిత్యవసర వస్తువుల్లో ఒకటైన అల్లం, తేనె, వాటర్ మరియు నిమ్మరసంతో కఫ్ సిరఫ్ తయారుచేసుకోవచ్చు. ఈ కఫ్ సిరఫ్ ప్రత్యేకత ఏంటంటే, పదార్థాలన్నీ నేచురల్ గా మనకు అందుబాటులో ఉన్నవి. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కెమికల్స్ భయముండుదు.

This Homemade Natural Syrup Cures Cough Instantly; Check It Out!

ఎక్కువ రోజుల నుండి కంటిన్యూగా దగ్గు ఆగకుండా అలాగే బాధిస్తుంటే, తలనొప్పి, చెస్ట్ పెయిన్, పొట్టనొప్పికి కారణమవుతుంది. కాబట్టి, ఈ కఫ్ సిరఫ్ లో ఉపయోగించే అల్లంను పురాతన కాలం నుండి ఔషధాల్లో, ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అల్లంలో యాంటీఇన్ఫ్లమేటరీ ఏజింట్స్ ఎక్కువగా ఉన్నాయి. మరో పదార్థం, తేనె. తేనెలో విటమిన్స్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.

ఇక నిమ్మరసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంది. దీంతో పాటు, ఐరన్ కంటెంట్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ మూడు పదార్థాల యొక్క కాంబినేషన్ లో తయారుచేసు హోం మేడ్ సిరఫ్ దగ్గుకు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కఫ్ సిరఫ్ ను మనమే ఇంట్లో స్వయంగా ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం...

This Homemade Natural Syrup Cures Cough Instantly; Check It Out!

1. మీడియం సైజ్ అల్లం ముక్క తీసుకుని, అవుటర్ స్కిన్ తొలగించి, చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

2. రెండు నిమ్మకాయలను తీసుకుని, నిమ్మరసం పిండి, తర్వాత తొక్కను కూడా తురుముకోవాలి.

This Homemade Natural Syrup Cures Cough Instantly; Check It Out!

3. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని అందులో రెండు గ్లాసుల నీళ్ళు పోసి, అందులోనే అల్లం ముక్కలు, నిమ్మకాయ తురుము వేయాలి.

4. ఈ మొత్తం మిశ్రమాన్ని కొన్ని నిముషాలు తక్కువ మంట మీద ఉడికించి, స్టౌ ఆఫ్ చేసి, చల్లారనివ్వాలి.

5. ఇప్పుడు ఈ ద్రవాన్ని ఒక గ్లాసులోనికి ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకోవాలి.

This Homemade Natural Syrup Cures Cough Instantly; Check It Out!

6. తర్వాత అరకప్పు తేనె తీసుకుని, పాన్ లో వేసి తక్కువ మంట మీద వేడి చేయాలి.

7. ఇప్పుడు ఉడుకుతున్న తేనె లో ముందుగా తయారుచేసుకున్న లెమన్, జింజర్ వాటర్ మిక్స్ చేయాలి.

8. మొత్తం మిశ్రమాన్ని కలబెడుతూ చిక్కగా సిరఫ్ లా మారే వరకూ కొన్ని నిముషాలు తక్కవు మంట మీద ఉడికించాలి. తర్వాత క్రిందికి దింపి, చల్లారనివ్వాలి. అంతే ఇప్పుడు హోం మేడ్ నేచురల్ కఫ్ సిరఫ్ రెడీ. ఈ కఫ్ సిరఫ్ ను పిల్లలు(1-2 టీస్పూన్లు), పెద్దవాళ్లు (2-4)టీస్పూన్లు తాగితే ఇన్ స్టాంట్ గా రిలీఫ్ అవుతారు.

English summary

This Homemade Natural Syrup Cures Cough Instantly; Check It Out!

Have you been been suffering from cough for long? You might have tried several medications but failed to get the desired results. If this is the condition then you definitely need to try out this homemade natural cough syrup. It helps in providing instant relief from cough.
Desktop Bottom Promotion