For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గ్యాస్ట్రిక్ మరియు ఇన్ డైజషన్ కు చెక్ పెట్టే 20 ఎఫెక్టివ్ హోం రెమెడిస్

|

ఆహారం తినగానే భరించలేనంత ఛాతీలో నొప్పి..ఆ నొప్పి మొదలవ్వగానే మనకు ఏమైపోతుందోనని ఆందోళన మొదలవుతుంది. ఈ సమస్యే గ్యాస్ట్రి సమస్య. ఈ సమస్య సాధారణంగా జీర్ణాశయం ఖాళీగా ఉండటం వల్ల వస్తుంది. ఆఖరికి ఆరోగ్యవంతమైన మానవునికి సైతం ఈ సమస్య వల్ల ఇబ్బంది, చిరాకు వస్తుంది. దీనినే వైద్య పరిభాషలో దీన్నే గ్యాస్ట్రటిస్ అంటారు. గ్యాస్టోటిస్ అనగా జీర్ణకోశం లోపల ఉండే మ్యూకోసల్ పొరలు ఇన్‌ఫ్లమేషన్‌కు గురైనప్పుడు ఆ ప్రదేశంలో వాపు, కమిలిపోవడం, నొప్పి వంటి లక్షణాలు ఏర్పడతాయి.

ఈ సమస్య ఉత్పన్నమవటానికి గల కారణాలు ఎన్నో ఉన్నాయి. ప్రధానంగా మీరు తీసుకునే ఆహారం వల్ల కూడ మొదలవుతుంది. అందుచేత మీరు తీసుకునే ఆహారం విషయంలో మీరు చాలా జాగ్రత్త వహించాలి.

ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సమస్యకు కారణాలు ఎసిడిటి, కడుపులో మంట, గుండెలో మంట లాంటివి. కొన్ని గ్యాస్ట్రిక్ కారణాలేమంటే వైరల్ ఇంఫెక్షన్స్, ఫుడ్ పొయిజనింగ్, కిడ్నీ లో రాళ్ళు, అజీర్నం, త్యూమర్లు, అల్సర్లు లాంటివాటి వల్ల కూడా ఈ సమస్య కూడా మొదలవుతుంది. కొందరిలో ఒత్తిడి, అందోళన, సరిగ్గా ఆహారాన్ని నమలకపోవటం వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుంది. గ్యాస్ సమస్య కొన్ని బ్యాక్టీరియా వల్ల కూడా వస్తుంది. ఉదాహరణకు హెచ్ పిలోరి అనే బ్యాక్టీరియా వల్ల కూడా వస్తుంది. నోటి దుర్వాసన, అజీర్ణం, వాంతులు, డయేరియా, నోటి పూత లాంటివి గ్యాస్ సమస్య లక్షణాలు.

గ్యాస్ స్టిక్ సమస్యల తాత్కాలిక ఉపశమనం కోసం పొందడం కోసం కొన్ని ఎఫెక్టి హోం రెమెడీస్..

1. నిమ్మ రసాన్ని వాడటం

1. నిమ్మ రసాన్ని వాడటం

మీ గ్యాస్ సమస్యకు తాత్కాలిక ఉపశమనానికి నిమ్మ రసాన్ని వాడటం ఎంతో మంచిది. గ్యాస్ సమస్య ఉత్పన్నమయినప్పుడు ఒక నిమ్మకాయను తీసుకోండి, మొక్కలుగా కోసి దానిలో నుంచీ రసాన్ని తీసి వేసి తర్వత దానిలో సగం టేబుల్ స్పూన్ బేకింగ్ సోడ వేసి దానిలో కాస్త ఒక కప్ నీటిని వేసుకుని తర్వాత త్రాగితే చాలా మంచిది. దీనిని రోజూ ఉదయానే త్రాగితే చాలా మంచిది.

2. హెర్బల్ టీలు

2. హెర్బల్ టీలు

మీరు ఎప్పుడైనా మూలికా టీల గురించి విన్నారా? అవును మీ గ్యాస్ సమస్యకు మూలికా టీలు ఎంతో మంచివి. అవేంటంటే ఫాల్సా, రాస్బెర్రీల టీ, బ్లాక్ బెర్రీస్ చమోమిలి, మింట్ తో తయారు చేస్తారు. ఈ మూలికా టీలను ఎక్కువ సేపు మరిగించకూడదు. ఎందుకంటే దీనిలో ఉన్న మూలికా గుణాలు తగ్గిపోతాయి.

ఇప్పుడు పసుపు ఆకులు

3. మంచి నీరు

3. మంచి నీరు

మీ కడుపు ఖాళీగా ఉంటే గ్యాస్ సమస్య మొదలయినట్టే.. కాబట్టి మంచినీరు సరిగ్గా తీసుకుంటే ఈ సమస్య ఉండదు. అంతేకాక రోజూ 6 నుంచీ 8 గ్లాసుల నీటిని తీసుకోవాలి. ఇలా తీసుకుంటే గ్యాస్ సమస్య తలెత్తదు.

4. అల్లం

4. అల్లం

గ్యాస్ సమస్యకు మంచి మందుగా మన వంటింట్లో ఉండే అల్లం ఎప్పుడూ మంచిది. దీనిని చిన్న ముక్కగా చేసి రోజూ భోజనానికి ముందు నమిలి తీసుకుంటే చాలా మంచిది. అదే మీరు తిన్నగా నమలలేకపోతే వేరే సుగర్లో కలుపుకుని తినవచ్చు.

5. బంగాళాదుంప

5. బంగాళాదుంప

బంగాళ దుంపల్ని తీసుకుని వాటిని గ్రైండ్ చేసుకుని ఆ జ్యూస్ ని రోజూ భోజనానికి ముందు త్రాగాలి. ఇలా చేస్తే చాలా చక్కగా గ్యాస్ సమస్యని తొలగించుకోవచ్చు.

6. ఉపవాసం

6. ఉపవాసం

2 నుంచీ 3 రోజుల వరకూ ఉపవాసాలు ఉంటే కడుపు శుభ్రం అవుతుంది. ఇలా చేయటం వల్ల టాక్సిక్ యాసిడ్ లు బయటకు పోతాయి.

7. వెల్లుల్లి

7. వెల్లుల్లి

వెల్లుల్లి చాలా చక్కటి సహజసిధ్ధమైన మందు. దీనిని తిన్నగా నమిలాలి. లేదా ఈ వెల్లుల్లి ముక్కలకు కొత్తిమీర విత్తనాలు, జీలకర్ర గింజల్ని తీసుకుని 5 నిముషాలపాటు ఉడికించిన జ్యూస్ మొత్తం తీసివేసిన తర్వాత త్రాగాలి.

8. దాల్చిన చెక్క

8. దాల్చిన చెక్క

దాల్చిన చెక్క గ్యాస్ సమస్యకు మంచి మందు. దాల్చిన చెక్కను తీసుకుని నీటిలో వేసి ఉడికించాలి. తర్వాత ఆ జ్యూస్ ను త్రాగాలి. ఇలా రోజూ భోజనానికి ముందు త్రాగితే మీ గ్యాస్ సమస్య పోతుంది. ఉదయాన్నే త్రాగాలి అనుకుంటే ఈ దాల్చిన పొడికి తోదుగా తేనె వేసుకుని త్రాగితే ఎంతో మంచిది. ఇలా నెల రోజులు ఈ చిట్కాను పాటిస్తే మంచి ఫలితాలుంటాయి.

9. యాలుకలు

9. యాలుకలు

యాలుకల్ని సాధారణంగా అన్ని రెసిపీలలో వేస్తారు. ఇక దీనిని గ్యాస్ సమస్యకు మందుగా వాడవచ్చు. కొన్ని యాలుకల్ని రోజూ 2-3 సార్లు నములుతూ ఉంటే మీ గ్యాస్ సమస్య పోతుంది. అలాగే యాలుకల టీ కూడా త్రాగితే మంచిది.

10. పెప్పర్మింట్

10. పెప్పర్మింట్

పెప్పర్మింట్ టీ గ్యాస్ సమస్యకు ఎంతో మంచిది. దీనిని టీ గా తీసుకుంటే చాలా మంచిది. ఇది హెర్బల్ టీ కాబట్టి రోజుకు 2 నుంచీ 3 సార్లు త్రాగాలి.

11. కొబ్బరి నీళ్ళు

11. కొబ్బరి నీళ్ళు

గ్యాస్ సమస్యను తీర్చేందుకు మంచి మందుగా కొబ్బరి నీళ్ళను చెప్పవచ్చు. దీనిలో అసాధారణ ప్రోటీన్లు ఉన్నాయి. రోజూ కొబ్బరి నీళ్ళని త్రాగటం అలవాటు చేసుకుంటే మంచిది.

12. యాపిల్ సైడర్ వెనిగర్

12. యాపిల్ సైడర్ వెనిగర్

వేడినీటిలో మూడు టేబుల్ స్పూన్స్ యాపిల్ సైడర్ వెనిగర్ వేసుకుని త్రాగాలి. ఇలా త్రాగటం వల్ల గ్యాస్ సమస్య తీరుతుంది.

13.మజ్జిగ

13.మజ్జిగ

మజ్జిగలో క్యారం విత్తనాలు కలుపుకుని తర్వాత పేస్ట్ గా చేసుకోవాలి. అలాగే దీనికి నల్ల ఉప్పు కూడా కలుపుకోవాలి. రోజూ ఇలా త్రాగితే గ్యాస్ సమస్య కూడా తొలగిపోతుంది.

14. బేకింగ్ సోడ, నిమ్మ

14. బేకింగ్ సోడ, నిమ్మ

ఒక గ్లాస్ లో బేకింగ్ సోడా కొంచెం వేసుకుని తర్వాత నిమ్మ రసాన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న రసాన్ని త్రాగితే చక్కగా గ్యాస్ సమస్య నయమవుతుంది. ఒకవేల మీకు అప్పటికప్పుడు వేగంగా గ్యాస్ తగ్గిపోవాలంటే ఒక గ్లాస్ లో పూర్తిగా నీటిని పోసి దానిలో బేకింగ్ సోడా వేసుకుని త్రాగాలి.

15. నల్ల మిరియాలు

15. నల్ల మిరియాలు

చాలా వంటల్లో వేయటం చూస్తూనే ఉంటాం. అయితే ఎండు మిరప కాయలు కూరల్లో వేయకుండా దీనిని కొందరు వేస్తారు. ఆరోగ్యపరంగా దీనిని వేస్తే మంచిది. గ్యాస్ట్రిక్ జ్యూసెస్ రావటం వల్ల కడుపు మంట మొదలవుతుంది. కాబట్టి నల్ల మిరియాలు అజీర్ణానికి మంచిది. వీటిని పాలతో పాటూ త్రాగితే మంచిది. గ్యాస్ సమస్య తీరుతుంది.

16. ఇంగువ

16. ఇంగువ

కడుపులో నొప్పి అలాగే అజీర్ణంగా ఉంటే ఇంగువా చక్కటి మందు. ఇది ప్రతీ వంటింట్లో ఉండేదే. ఒక గ్లాస్ లో వేడినీటిని తీసుకుని దానిలో ఇంగువ వేసుకుని బాగా కలిపి త్రాగాలి. ఇలా త్రాగితే కడుపు నొప్పి, అజీర్ణం అన్ని పోతాయి.

17. సోపు గింజలు

17. సోపు గింజలు

సోపు గింజలు ప్రతీ ఇంటా దొరికేవే. సోపు గింజలు కొలెస్టరాల్ ను తగ్గిస్తాయి. రోజూ కాస్త సోపు గింజల్ని తినటం వల్ల మీకు గ్యాస్ సమస్య తొలగిపోతుంది. కొన్ని సోపు గింజల్ని తీసుకుని గ్రైండ్ చేసుకుని నీటితో త్రాగితే గ్యాస్ సమస్య తొలగుతుంది.

18. లవంగాలు

18. లవంగాలు

లవంగాలు ఔషధ లక్షణాలు కలది. ఇవి గ్యాస్ సమస్యని చక్కగా పోగొడతాయి. రోజూ మీరు తిన్నగా నమిలి తినవచ్చు. లేదా లవంగాల నూనెను గ్యాస్ సమస్యని తీర్చేందుకు వాడవచ్చు.

19. వాము విత్తనాలు

19. వాము విత్తనాలు

వాము వితానాల్ని కొంతమంది అజోవైన్ అనే పేరుతో పిలుస్తారు. ఇది కొన్ని సంవత్సరాలకు పూర్వం నుంచీ గ్యాస్ సమస్యకు మంచి ఔషధంగా చెప్పబడుతోంది. ఇవి అజీర్ణ సమస్యని తొలగిస్తాయి. ఇది చాలా శక్తివంతమైనది. మీరు ముందుగా వాము గింజల్ని తీసుకుని దానికి ఉప్పును కలుపుకుని ఈ మిశ్రమాన్ని మంచి నీటిలో కలుపుకొని త్రాగాలి. మీరు స్పైసీ వంటల్ని తిన్నప్పుడు దీనిని త్రాగితే గ్యాస్ సమస్య ఉండదు.

20 వేడి నీరు

20 వేడి నీరు

వేడి నీరు చాలా మంచిది. మీరు స్పైసీ ఫుడ్స్ తిన్నప్పుడు మీ కడుపు భారంగా ఉన్నప్పుడు, అలాగే మీకు బాగా అజీర్నంగా అనిపించినప్పుడు ఒక గ్లాస్ వేడినీటిని తీసుకుంటే ఆ నీరు కడుపులోనికి వెళ్ళి కొలెస్టరాల్ ను కరిగిస్తుంది. అంతేకాక రోజూ పరగడుపుతో వేడి నీటిని త్రాగితే పరిపూర్ణ ఆరోగ్యం, గ్యాస్ సమస్య ఉండదు.

English summary

Top 20 Home Remedies for Gas and Indigestion Problems ...

Medically known as dyspepsia, indigestion is a gastrointestinal problem people commonly complaint about. Its symptoms can be bloating, belching, burning sensation and nausea. Gas and indigestion are problems occurring from the secretion of the digestive juices in our stomach.
Story first published:Saturday, April 30, 2016, 14:35 [IST]
Desktop Bottom Promotion