కిడ్నీ ఇన్ఫెక్షన్ నివారించే టాప్ హోం రెమెడీస్ ..!!

కిడ్నీ ఇన్ఫెక్షన్ నేచురల్ గా ఎలా నివారించాలి? కిడ్నీ లేదా రీనల్ ఇన్ఫెక్షన్ నివారించడానికి కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఈ క్రింది వాటిని గమనించి మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల కిడ్నీ ఇన్ఫెక్షన్

Posted By:
Subscribe to Boldsky

మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాలు మూత్రపిండాలు. ఎందుకంటే ఆహారం జీర్ణమయ్యే క్రమంలో ఏర్పడే మలినాలు కావచ్చు... శరీరంలో జరిగే ఏ జీవక్రియలోనైనా ఏర్పడే వ్యర్థపదార్థాలు కావచ్చు.. ఏవైనా సరే వాటిని ఎప్పటికప్పుడు తొలగించి రక్తాన్నే కాదు.. శరీరం మొత్తాన్నీ శుచిగా, శుద్ధిగా ఉంచే సహజసిద్ధ యంత్రాలు కిడ్నీలు. అవి ఒక్కసారి పనిచేయమని మొరాయిస్తే.. ఆరోగ్యం అస్తవ్యస్తం అయిపోతుంది. అంతటి ప్రాముఖ్యం ఉన్న కిడ్నీలను కాపాడుకోవాలంటే ముందు జీవనశైలి ఆరోగ్యంగా ఉండాలి.

మూత్ర వ్యవస్థ అంటే మూత్రపిండాలు, మూత్రా శయం, మూత్రనాళాలకు సంబంధించిన వ్యాధులు బ్యాక్టీరియా వలన సోకే ఇన్‌ఫెక్షన్‌ కారణంగా వస్తాయి. మూత్రపిండాలకు ఇన్‌ఫెక్షన్‌ రావడానికి అనేక కారణాలున్నాయి. శరీరంలో ఇతరభాగంలో ఇన్‌ ఫెక్షన్‌ సోకడం, చీముగడ్డలు, టిబి, టాన్సిల్స్‌, గ్రంథులకు సోకే ఇన్‌ఫెక్షన్లు మొదలైనవి రక్తం ద్వారా మూత్రపిండాలకు చేరడం మొదలైన కార ణాల వలన వీటికి ఇన్‌ఫెక్షన్లు సోకుతాయి.

కిడ్నీ ఇన్ఫెక్షన్ నేచురల్ గా ఎలా నివారించాలి? కిడ్నీ లేదా రీనల్ ఇన్ఫెక్షన్ నివారించడానికి కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఈ క్రింది వాటిని గమనించి మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల కిడ్నీ ఇన్ఫెక్షన్ తగ్గించుకోవచ్చు...

అలోవెర:

అలోవెర చాలా అద్భుతమైన మూలిక. దీన్ని ప్రతి రోజూ కొద్దికొద్దిగా తీసుకొన్నట్లైతే ఇది యూరిన్ ఇన్ఫెక్షన్ ను నివారిస్తుంది ఇది మూత్రపిండాలను చాలా ఎఫెక్టివ్ గా శుభ్రం చేసి శరీరంలోని టాక్సిన్స్ ను తొలగిస్తుంది.

నీళ్ళు తాగాలి:

మన శరీరంను నిరంతరం తేమగా ఉంచుకోవడం వల్ల కిడ్నీ స్టోన్స్ ను నివారిస్తుంది మరియు కిడ్నీలను స్ట్రాంగ్ గా ఉంచుతుంది. నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎక్కుసార్లు యూరిన్ పోవడానికి ఎక్కువగా సహాయపడుతుంది. దాంతో శరీరంలోని మూత్రంలో మినిరల్స్ మరియు సోడియం ఫ్లష్ చేస్తుంది.కిడ్నీ ఇన్ఫెక్షన్ కు కారణమయ్యే బ్యాక్టీరియాను నివారిస్తుంది.

హెర్బల్ జ్యూస్:

మరో బెస్ట్ హెర్బ్ పార్ల్సే. ఇడి కిడ్నీ ఇన్ఫెక్షన్ నివారించడంలో ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది. ఇందులో విటమిన్స్, రిబోఫ్లెవిన్స్ ఎక్కువగా ఉంటాయి. కొన్ని పార్ల్సే లీవ్స్ ను బాయిల్ చేసి, వడగట్టి, కూల్ చేసి తాగాలి.

ఫ్రూట్ జ్యూస్ :

యూరినరీ ట్రాక్స్ ఇన్ఫెక్షన్స్ ను నివారించడంలో ఇది చాలా అద్భుతంగా సహాయపడుతుంది. ఇది కిడ్నీలలో అసిడిక్ లెవల్స్ ను తొలగిస్తుంది . ముఖ్యంగా ఆరెంజ్, నిమ్మ , ద్రాక్ష వంటి విటమిన్ సి అధికంగా ఉన్నవి కిడ్నీ ఇన్ఫెక్షన్ నివారిస్తుంది. కాబట్టి ప్రతి రోజూ ఆరెంజ్ ను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.

బేకింగ్ సోడ:

బేకింగ్ సోడా చాలా ఎఫెక్టివ్ హోం రెమెడీ . ఇది కిడ్నీలో బైకార్బోనేట్ లెవల్స్ ను కిడ్నీలో నింపడానికి చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. నీటిలో ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను నీళ్ళలో వేసి ప్రతి రోజూ త్రాగడం వల్ల కిడ్నీఇన్ఫెక్షన్ ను తగ్గిస్తుంది.

గార్లిక్:

కిడ్నీ ఇన్ఫెక్షన్ నివారించే మరో ఉత్తమ హోం రెమెడీ . ఇది ఒక ఘాటైన వాసన కలిగిన నేచురల్ రెమడీ. అందుకే ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే యాక్టివ్ పదార్థం ఉంటుంది. ఇందులో యాంటీబ్యాక్టీరియల్ మరియు యాంటీఇన్ఫమేటరీ మరియు యాంటీ ఫంగల్ ఏజెంట్ పుష్కలంగా ఉంటుంది. రోజూ రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల కిడ్నీ ఇన్ఫెక్షన్స్ ను అతి కొద్దిరోజుల్లోనే నివారిస్తుంది .

ఆలివ్ ఆయిల్:

స్వచ్చమైన ఆలివ్ ఆయిల్ ను ఉపయోగించడం కిడ్నీ ఇన్ఫెక్షన్ ను చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. కిడ్నీ స్టోన్స్ ను నివారిస్తుంది. ఇది ఒక హై క్వాలిటీ ప్రొడక్ట్. ఇది మంచి ఫ్లేవర్ మరియు ఎసిడిటిని బ్యాలెన్స్ చేస్తుంది. ఈ స్వచ్చమైన ఆలివ్ ఆయిల్ లూబ్రికేట్స్ కు సహాయపడుతుంది మరియు కిడ్నీ, లివర్ మరియు గాల్ బ్లాడర్ లోని టాక్సిన్స్ ను ఫ్లష్ చేస్తుంది.నిమ్మరసంతో పాటు తీసుకుంటే చాలా గ్రేట్ గా పనిచేస్తుంది. ఒక గ్లాసు లెమన్ వాటర్ లో ఒక చెంచా ఆలివ్ ఆయిల్ తీసుకోవాలి.

" కంపేర్ & బై " బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్

English summary

Top Home Remedies For Kidney Infection

Kidney or renal infection has been one of the major factors that cause kidney failure. Once your kidney fails, the entire body functioning gets paralysed. Hence, getting the correct treatment for kidney infection is highly essential in order to prevent kidney failure and in keeping it healthy.
Please Wait while comments are loading...
Subscribe Newsletter