For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వెంటనే నీళ్లు తాగాలని సూచించే లక్షణాలు..!!

కొన్ని సందర్భాల్లో మీకు డీహైడ్రేషన్ లక్షణాలు కనిపించకపోయినా, దప్పిక లేకపోయినా.. నీళ్లు తాగాల్సి ఉంటుంది. ఎలాంటి సందర్భాల్లో వెంటనే నీళ్లు తాగాలో తెలుసుకుందాం..

By Swathi
|

నీళ్లు తాగడం చాలా అవసరం. ఎందుకంటే.. మనుషుల శరీరం మూడోవంతు నీటితోనే నిర్మాణమై ఉంటుంది. కాబట్టి నీళ్లు సరిగా అందకపోతే.. శరీరంలో అనేక సమస్యలు ఎదురవుతాయి. శరీరంలోని ప్రతి భాగం, ప్రతి చిన్న అవయవం, టిష్యూ, కణం అన్నీ కూడా నీటిపై ఆధారపడి ఉంటాయి.

Warning Signs You Need Water Urgently!

అందుకే రోజుకి సరిపడా నీళ్లు తాగాలి. నీళ్లు శరీరానికి చాలా కీలకమైనవి, హెల్తీ కూడా. మీకు తెలుసా.. డీహైడ్రేషన్ ని సూచించే.. కొన్ని లక్షణాలు ? శరీరం డీహైడ్రేట్ అయితే.. అనేక రకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.

డీహైడ్రేషన్ వల్ల బరువు పెరుగుతారు అనడానికి 11 కారణాలు..!! డీహైడ్రేషన్ వల్ల బరువు పెరుగుతారు అనడానికి 11 కారణాలు..!!

అలాగే మనందరికీ తెలుసు.. నీళ్లు దప్పిక అయినప్పుడు వెంటనే తాగాలని. డీహైడ్రేషన్ లక్షణాలు కూడా ప్రతి ఒక్కరికీ తెలిసే ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తుంటాం. అలాగే కొన్ని సందర్భాల్లో మీకు డీహైడ్రేషన్ లక్షణాలు కనిపించకపోయినా, దప్పిక లేకపోయినా.. నీళ్లు తాగాల్సి ఉంటుంది. ఎలాంటి సందర్భాల్లో వెంటనే నీళ్లు తాగాలో తెలుసుకుందాం..

పల్స్ రేట్

పల్స్ రేట్

కొన్ని సందర్భాల్లో కష్టపడకపోయినా, వ్యాయామం చేయకపోయినా.. గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. దీనికి కారణం డీహైడ్రేషన్ అయి ఉండవచ్చు. కాబట్టి.. వెంటనే కొన్ని నీళ్లు తాగాలి.

బ్లడ్ సర్క్యులేషన్

బ్లడ్ సర్క్యులేషన్

కొన్ని సందర్భాల్లో సరిపడా నీళ్లు అందనప్పుడు కూడా.. బ్లడ్ సర్క్యులేషన్ నెమ్మదిగా మారుతుంది. దీనివల్ల తలనొప్పి వస్తుంది. వెంటనే నీళ్లు తాగితే.. పరిస్థితిలో మార్పు వస్తుంది.

ఏకాగ్రత కుదరకపోవడం

ఏకాగ్రత కుదరకపోవడం

ఒకవేళ మీరు మీకు ఇచ్చిన టాస్క్ ని పూర్తిచేయలేకపోవడం, ఏకాగ్రత కుదరకపోవడం, చాలా నీరసంగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే.. వెంటనే నీళ్లు తాగండి.

డ్రైగా మారడం

డ్రైగా మారడం

సాలివా ఉత్పత్తి చేయడానికి శరీరానికి నీళ్లు అవసరం. మీరు డీహైడ్రేట్ అయితే.. మీ నోరు డ్రైగా మారుతుంది. కాబట్టి.. వెంటనే కొన్ని నీళ్లు తాగితే.. నాలుక డ్రైగా మారకుండా ఉంటుంది.

డ్రై స్కిన్

డ్రై స్కిన్

ఎలాంటి కారణం లేకుండానే మీ చర్మం డ్రై అవుతోంది అంటే.. డీహైడ్రేషన్ కారణం అయి ఉండవచ్చు. కాబట్టి మీ చర్మం పేలవంగా, డ్రైగా మారుతుంటే.. వెంటనే నీళ్లు ఎక్కువగా తాగండి.

జీర్ణక్రియ

జీర్ణక్రియ

జీర్ణక్రియలోనూ నీళ్లు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. ఒకవేళ ఎలాంటి కారణం లేకుండా.. కాన్ట్సిపేషన్ సమస్యను ఫేస్ చేస్తున్నారంటే.. మీరు నీళ్లు ఎక్కువగా తాగాల్సి ఉంటుంది.

యూరిన్ కలర్

యూరిన్ కలర్

యూరిన్ కలర్ మారడం, పసుపు రంగులో యూరిన్ రావడం వంటి లక్షణాలు మీ శరీరంలో నీళ్లు సరిపడా లేవని సూచిస్తాయి. డీహైడ్రేషన్ వల్ల శరీరంలో మలినాలను తొలగించడం కష్టంగా మారుతుంది. కాబట్టి.. వెంటనే నీళ్లు తాగడం మంచిది.

English summary

Warning Signs You Need Water Urgently!

Warning Signs You Need Water Urgently! There are some occasions when you may need to drink water even when you don't see any symptoms of dehydration. What are those signs? Well, read on....
Desktop Bottom Promotion