వార్నింగ్: ఎట్టిపరిస్థితుల్లో వెల్లుల్లి తినకూడని వాళ్లు..!

ఎలాంటి చిన్న ఇన్ఫెక్షన్ ఉన్నా.. వెల్లుల్లి తీసుకుంటే ఇట్టే తగ్గిపోతుంది. కానీ.. కొన్ని రకాల వ్యాధులతో బాధపడేవాళ్లు, కొంతమంది వ్యక్తులు.. ఎట్టిపరిస్థితుల్లో వాడకూడదు.

Posted By:
Subscribe to Boldsky

వెల్లుల్లి.. ఘాటు తగలనిదే.. చట్నీ కూడా పసందుగా ఉండదు. ఎలాంటి వంటకానికైనా.. వెల్లుల్లి రుచి తప్పనిసరిగా జోడించడం.. మన ఇండియన్స్ కి బాగా అలవాటు. కూర, చారు, సాంబార్ ఎందులో అయినా.. వెల్లుల్లి వాడతారు.

garlic side effects

అలాగే వెల్లుల్లిలో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉండటం వల్ల.. ప్రతి ఒక్కరూ.. వెల్లుల్లిని ప్రతి రోజూ తీసుకోవాలని నిపుణులు సూచిస్తూ ఉంటారు.

ఎలాంటి చిన్న ఇన్ఫెక్షన్ ఉన్నా.. వెల్లుల్లి తీసుకుంటే ఇట్టే తగ్గిపోతుంది. కానీ.. కొన్ని రకాల వ్యాధులతో బాధపడేవాళ్లు, కొంతమంది వ్యక్తులు.. ఎట్టిపరిస్థితుల్లో వాడకూడదు. వెల్లుల్లికి దూరంగా ఉండాల్సిన వాళ్లు ఎవరో తెలుసుకుందాం..

సర్జరీకి ముందు

త్వరలో సర్జరీ చేయించుకోబోతున్న వాళ్లు.. వెల్లుల్లి తీసుకోకూడదు. కనీసం సర్జరీకి రెండు వారాల ముందు నుంచైనా.. వెల్లుల్లి తినడం మానేయాలి. లేదంటే..వెల్లుల్లి ఎక్కువగా రక్తస్రావం అవడానికి కారణమవుతుంది.

లో బ్లడ్ ప్రెజర్

వెల్లుల్లి బ్లడ్ ప్రెజర్ ని తగ్గిస్తుంది. కాబట్టి.. లో బ్లడ్ ప్రెజర్ తో బాధపడేవాళ్లు.. వెల్లుల్లి తీసుకోకూడదు. బ్లడ్ ప్రెజర్ మరింత పడిపోవడానికి కారణమవుతుంది.

కాలేయ సమస్యలు

వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు, బ్యాక్టీరియా, వైరస్ ని నాశనం చేసే సత్తా ఉన్నప్పటికీ.. కాలేయ సమస్యలతో బాధపడేవాళ్లు.. వెల్లుల్లి తినకూడదు. పేగులు, పొట్టలో ప్రేరణ కలిగించడానికి కారణమవుతుంది. ఆహారం జీర్ణంకావడంపై దుష్ర్పభావం చూపుతుంది.

కంటి సమస్యలు

కంటి సమస్యలు, వ్యాధులతో బాధపడేవాళ్లు.. వెల్లుల్లి తీసుకోకూడదు. రెగ్యులర్ గా ఎక్కువ మొత్తంలో వెల్లుల్లి తినేవాళ్లలో తర్వాత కళ్లు, కాలేయం డ్యామేజ్ అవుతుందని, మెమరీ లాస్ సమస్య వస్తుందని.. నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నాన్ బ్యాక్టీరియల్ డయేరియా

డయేరియాతో బాధపడేవాళ్లు కూడా.. పచ్చి వెల్లుల్లి తీసుకోకూడదు. ఇందులో ఉండే స్పైసీ ఫ్లేవర్.. సమస్యను మరింత తీవ్రం చేస్తుంది. కాబట్టి డయేరియాతో బాధపడేవాళ్లు జాగ్రత్తగా, సరైన మోతాదులో వెల్లుల్లి తీసుకోవాలి.

గర్భిణీ స్త్రీ, పాలు ఇచ్చే తల్లులు

ప్రెగ్నన్సీ టైంలో వెల్లుల్లి తీసుకోవడం మంచిదే. అయితే ఆహారంలో చేర్చుకుంటే ఎలాంటి సమస్యా ఉండదు. కానీ.. పచ్చి వెల్లుల్లి తీసుకోవడం మంచిది కాదు. అలాగే.. ప్రెగ్నన్సీ సమయంలో, బిడ్డకు పాలు ఇచ్చే సమయంలో.. వెల్లుల్లిని మోతాదుకి మించి తీసుకోవడం సేఫ్ కాదు.

 

 

" కంపేర్ & బై " బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్

English summary

Warning: Stop Using Garlic If You Are in These 6 Types of People

Warning: Stop Using Garlic If You Are in These 6 Types of People. However, there are six types of people who should avoid its consumption, and they are the following.
Please Wait while comments are loading...
Subscribe Newsletter