రోజుకు 8 గ్లాసుల నీళ్ళు తప్పనిసరిగా తాగితే , బాడీలో జరిగే అద్భుత మార్పులు..!!

ఎప్పుడైతే నీరు తాగడంలో విఫులులవుతారో, వారిలో డీహైడ్రేషన్ కు దారితీస్తుంది. డీమైడ్రేషన్ తో పాటు, ఇతర అనేక ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కుంటారు.కాబట్టి, రోజుకు ఎనిమిది గ్లాసుల నీళ్ళు తప్పని సరిగా తాగడం వల్ల

Posted By:
Subscribe to Boldsky

ఒక ఫేమస్ ఆర్టిస్ట్'' డా విన్సీ'', ఒకసారి ఏం చెప్పాడంటే ''ప్రకృతి మొత్తం పచ్చగా ఉండాలంటే ''నీళ్ళు చాలా అవసరం. భూమ్మీద పుట్టిన ప్రతి జీవరాశికి నీరు అత్యవసరం అని మనందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా మనుష్యులకు నీటి అవసరం, నీటి విలువ గురించి బాగా తెలుసు.

రోజుకు ఎనిమిది గ్లాసుల నీరు త్రాగడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు.

రోజుకు సరిపడా నీరు తాగకపోతవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. బిజీ షెడ్యూల్స్, బిజీ లైఫ్ లో వాటర్ తాగడానికి కూడా సమయం లేనంతంగా జీవించడం వల్ల బాడి డీహైడ్రేషన్ కు గురి అవుతుంది. కొంత మంది దాహమేసినప్పుడు మాత్రమే నీళ్ళు తాగుతుంటారు. అలా కాకుండా రోజులో మన శరీరానికి ఎంత నీరు అవసరం అవుతుందో తెలుసుకుని తాగడం మంచిది.

మన శరీరంలో 65శాతం నీటితో నిండి ఉంటుంది. అంత నీరు ఉంటేనే శరీరంలో అవయవాలన్నీ ఆరోగ్యంగా..చురుకుగా పనిచేస్తాయి. కాబట్టి, శరీరంలో నీటి శాతం తగ్గకుండా రోజుకు సరిపడా నీళ్ళు తాగుతూ బ్యాలెన్స్ చేసుకోవాలి.

ఎప్పుడైతే నీరు తాగడంలో విఫులులవుతారో, వారిలో డీహైడ్రేషన్ కు దారితీస్తుంది. డీమైడ్రేషన్ తో పాటు, ఇతర అనేక ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కుంటారు.కాబట్టి, రోజుకు ఎనిమిది గ్లాసుల నీళ్ళు తప్పని సరిగా తాగడం వల్ల పొందే ప్రయోజనాలు..

వర్కౌట్స్ చేయడానికి బెటర్ స్టామినా:

శరీరంలో ఎప్పుడైతే ఎక్కువ నీరు ఉంటుందో, అప్పుడు శరీరంలో ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ అవుతాయి. దాంతో శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఆ ఎనర్జీతోనే వర్కౌట్స్ సునాయాసంగా చేసుకోవచ్చు.

బెటర్ కిడ్నీ ఫంక్షన్స్ :

కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే, ఎక్కువ వాటర్ అవసరం అవుతుంది. వాటర్ ఎక్కువగా తాగడం వల్ల బాడీలోని టాక్సిన్స్ మూత్ర విసర్జన రూపంలో బయటకు నెట్టివేయబడుతాయి. రోజుకు 8గ్లాసులు నీళ్ళు తాగడం వల్ల కిడ్నీల పనితీరు చురుకుగా ఉంటారు.

గ్లోయింగ్ స్కిన్ :

శరీరంలోపలి బాగాలు హైడ్రేషన్లో ఉండాలంటే రేడియంట్ స్కిన్ పొందడానికి నీరు తప్పనిసరిగా 8 గ్లాసులు తగ్గకుండా తాగాలి. దాంతో చర్మం తేమగా, కాంతివంతంగా మెరిసిపోతుంటుంది.

మలబద్దకం నివారిస్తుంది:

బౌల్ మూమెంట్ రెగ్యులర్ గా జరగాలంటే శరీరానికి తప్పనిసరిగా నీళ్ళు తాగడం చాలా అవసరం. రోజుకు 8 గ్లాసుల నీళ్లు తాగడం వల్ల మలబద్దకం నివారిస్తుంది.

జలుబు, దగ్గు నివారిస్తుంది:

కొన్ని పరిశోధనల ప్రకారం, రోుకు సరిపడా 8 గ్లాసుల నీళ్ళు తప్పనిసరిగా తాగినట్లైతే శరీరంలో హైడ్రేషన్ ను అందివ్వడంతో పాటు, ఇమ్యూన్ సిస్టమ్ ను మెరుగుపరుస్తుంది.

తలనొప్పి తగ్గిస్తుంది:

తలనొప్పికి డీహైడ్రేషన్ ఒక ముఖ్యకారణం, రోజుకు 8 గ్లాసుల నీళ్ళు తప్పనిసరిగా తాగినప్పుడు, తలనొప్పి క్రమంగా తగ్గుతుంది.

హార్ట్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది.

బాడీలో తగిన హైడ్రేషనప్ ఉన్నప్పుడు హార్ట్ చురుకుగా పనిచేస్తుంది. శరీరంలోని అన్ని అవయవాలకు రక్తంను సరిపడా సరఫరా చేస్తుంది. దాంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. వ్యాధులు రాకుండా ఉంటాయి.

" కంపేర్ & బై " బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్

English summary

What Happens When You Drink 8 Glasses Of Water Everyday?

The famous artist, Da Vinci, once said, "water is the driving force of all nature", so as a part of nature, humans are more than aware about the importance of water.
Please Wait while comments are loading...
Subscribe Newsletter