For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

7 రోజుల పాటు ఉదయాన్నే వెల్లుల్లి, తేనె తినడం వల్ల పొందే బెన్ఫిట్స్..!

సహజంగా వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిదా, కాదా? అందరినీ వేధించే ప్రశ్న. పరగడుపునే వెల్లుల్లి తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఎప్పటికప్పుడు పరిశోధనలు రుజువు చేస్తూనే ఉన్నాయి. అయితే వెల్లుల్లి ఆరోగ్

By Super Admin
|

మీరు తరచుగా అలసిపోతున్నారా ? ఎలాంటి కారణం లేకుండా.. తీవ్రంగా నీరసించిపోతున్నారా ? ఒకవేళ ఈ లక్షణాలు మీలో కనిపించి ఉంటే.. మీ వ్యాధినిరోధక వ్యవస్థ సామర్థ్యాన్ని కోల్పోతోందని సంకేతం. హెల్తీగా ఉండాలంటే.. స్ట్రాంగ్ ఇమ్యున్ సిస్టమ్ చాలా అవసరం. అది బలహీనమయ్యే కొద్దీ రకరకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.

సహజంగా వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిదా, కాదా? అందరినీ వేధించే ప్రశ్న. పరగడుపునే వెల్లుల్లి తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఎప్పటికప్పుడు పరిశోధనలు రుజువు చేస్తూనే ఉన్నాయి. అయితే వెల్లుల్లి ఆరోగ్యానికి చేసే మేలు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అంటున్నారు న్యూజెర్రసీకి చెందిన వైద్యులు.

What Happens When You Eat Garlic And Honey For 7 Days?

పరగడుపున చిన్న వెల్లుల్లి ముక్క తింటే ఆరోగ్యవంతులుగా మారడం ఖాయమంటున్నారు. వెల్లుల్లి శాస్త్రీయ నామం అల్లియమ్ సాటివుమ్, వెల్లుల్లిలో సల్ఫర్ కంటెంట్ పరిమాణం ఎక్కువ ఉన్నందున ఘాటైన వాసన వస్తుంది. రిల్లీ కుటుంబానికి చెందిన ఈ వెల్లుల్లి ..నీరుల్లికి దగ్గర చుట్టం. అందుకే దానికి కన్నా ఔషధ గుణాలు ఎక్కువ.

వంటింట్లో ఉండే ఔషధాల్లో వెల్లుల్లి ఒకటి. ఇది వంటకాలకు రుచిని గుమగమలను తెస్తుంది. ఆరోగ్య రక్షణలో వెల్లుల్లి పాత్ర ఎంతో విశిష్టమైనది వాసన ఘాటుగా ఉంటుందని, తింటే వాసన వస్తుందని కొందరు వెల్లుల్లిని అంతగా ఇష్టపడరు.

What Happens When You Eat Garlic And Honey For 7 Days?

కానీ ఆరోగ్య పరిరక్షణకోసం వెల్లుల్లి చేసే మేలు అంతా ఇంతా కాదు. దాదాపు అన్ని రకాల వ్యాధులను తగ్గించడానికి వెల్లుల్లి వాడుతారు. ఆయుర్వేద ఔషధాల తయారీలో కూడా వెల్లుల్లికి డిమాండ్ ఉంది. మరి ఎన్నో ఔషధ గుణాలున్న వెల్లుల్లిని ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే ఇంకెన్ని లాభాలుంటాయో తెలుసా...

కాబట్టి హెల్తీగా ఉండాలంటే.. హెల్తీ లైఫ్ స్టైల్, హెల్తీ డైట్ ఫాలో అవ్వాలి. పోషకాహారం తీసుకోవడం వల్ల.. రకరకాల అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు. అందరి ఇంట్లో కామన్ గా ఉండే వెల్లుల్లి, తేనె రెండింటినీ తీసుకోవడం వల్ల మీ వ్యాధినిరోధక శక్తి మెరుగవుతుంది. అంతేకాదు.. ఈ రెండింటినీ ప్రతి రోజూ క్రమం తప్పకుండా ఏడు రోజులు తీసుకుంటే.. అమోఘమైన ఫలితాలు పొందవచ్చు అంటున్నారు నిపుణులు..

వెల్లుల్లి, తేనె

వెల్లుల్లి, తేనె

రెండు వెల్లుల్లి రెబ్బలు మెత్తగా పేస్ట్ చేయాలి. ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల తేనె కలపాలి. దీన్ని ప్రతి రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో క్రమం తప్పకుండా.. ఏడు రోజు తీసుకోవాలి.

ఇమ్యునిటీ

ఇమ్యునిటీ

వెల్లుల్లి, తేనె మిశ్రమాన్ని రెగ్యులర్ గా పరకడుపున తీసుకుంటే.. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఎలాంటి వ్యాధులు రాకుండా.. అరికడుతుంది.

కరోనరీ డిజార్డర్స్

కరోనరీ డిజార్డర్స్

కరోనరీ డిజార్డర్స్ అంటే.. రక్తం గడ్డకట్టడం. వెల్లుల్లి, తేనె మిశ్రమాన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ధమనుల్లో ఏర్పడే ఫ్యాట్ ని తొలగించి.. గుండెకు రక్త ప్రసరణ వేగంగా జరగడానికి సహాయపడుతుంది.

గొంతు నొప్పి

గొంతు నొప్పి

వెల్లుల్లి, తేనె మిశ్రమం గొంతు నొప్పి, గొంతులో ఇన్ఫెక్షన్ ని నివారిస్తుంది. ఇందులో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉండటం వల్ల వాపును తగ్గిస్తుంది.

డయేరియా

డయేరియా

ఈ పవర్ ఫుల్ పేస్ట్ డయేరియాని నివారిస్తుంది. జీర్ణవ్యవస్థకు సంబంధించిన ఎలాంటి వ్యాధినైనా నయం చేసే శక్తి వెల్లుల్లి, తేనె మిశ్రమంలో ఉంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ నేచర్ కోలన్ లో ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.

జలుబు

జలుబు

వెల్లుల్లి, తేనె మిశ్రమాన్ని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల జలుబు, ఫ్లూ, సైనసైటిస్ ను ఎఫెక్టివ్ గా నివారించవచ్చు.

ఫంగల్ ఇన్ఫెక్షన్స్

ఫంగల్ ఇన్ఫెక్షన్స్

వెల్లుల్లి, తేనె రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల శరీరంలో ఏర్పడే ఎలాంటి బ్యాక్టీరియానైనా నాశనం చేస్తుంది.

డిటాక్స్

డిటాక్స్

వెల్లుల్లి, తేనె మిశ్రమం తీసుకోవడం వల్ల శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది. శరీరంలోని మలినాలను, హానికారక క్రిములను శరీరం నుంచి బయటకు పంపుతుంది. హెల్తీగా ఉంచుతుంది.

ఒకే ఒక్క వెల్లుల్లి రెబ్బను పరగడపున తింటే..

ఒకే ఒక్క వెల్లుల్లి రెబ్బను పరగడపున తింటే..

<strong>ఒకే ఒక్క వెల్లుల్లి రెబ్బను పరగడపున తింటే వెల్లుల్లి చేసే మ్యాజిక్ ఏంటో తెలుసుకుందాం...</strong>ఒకే ఒక్క వెల్లుల్లి రెబ్బను పరగడపున తింటే వెల్లుల్లి చేసే మ్యాజిక్ ఏంటో తెలుసుకుందాం...

English summary

What Happens When You Eat Garlic And Honey For 7 Days?

What Happens When You Eat Garlic And Honey For 7 Days? Garlic and honey are two common ingredients that are found in your kitchen. The combination of these two ingredients helps in boosting your immune system.
Desktop Bottom Promotion