For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సమ్మర్లో డీహైడ్రేషన్ నివారణకు ఖచ్చితంగా తినాల్సిన 15 వాటర్ రిచ్ ఫుడ్స్

శరీరం డీహైడ్రేషన్ కు గురైతే, ఆరోగ్య పరంగా చాలా సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. డీహైడ్రేషన్ వల్ల మలబద్దకం, పైల్స్, కిడ్నీలో రాళ్ళు మొదలగుని. డీహైడ్రేషన్ ను అధిగంచడానికి కొన్ని రకాల ఆహార పదార్థాలున్నాయి

|

మనందరికి తెలుసు నీరును ఎందుకు అధికంగా తీసుకొంటాం అని. మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి మరియు ఆరోగ్యంగా ఉంచడానికి ఎక్కువగా నీరు త్రాగుతుంటాం. నీరును అధికంగా తీసుకోవడం వల్ల శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడమే కాదు. ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది. ఇంకా శరీరంలో ఉండే మలినాలను భయటకు నెట్టివేసి శరీరాన్ని శుభ్రం చేస్తుంది. ఇంకా నీళ్ళు శరీరంలోని జీవక్రియలను క్రమబద్దం చేసి, శరీర ఉష్ణోగ్రను బ్యాలెన్స్ చేస్తుంది.

శరీరం డీహైడ్రేషన్ కు గురైతే, ఆరోగ్య పరంగా చాలా సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. డీహైడ్రేషన్ వల్ల మలబద్దకం, పైల్స్, కిడ్నీలో రాళ్ళు మొదలగుని. డీహైడ్రేషన్ ను అధిగంచడానికి కొన్ని రకాల ఆహార పదార్థాలున్నాయి. కాబట్టి మీ డైలీ డైయట్ లో వాటర్ రిచ్ ఫుడ్స్ అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోవడం వల్ల ప్రతి రోజూ మీ శరీరానికి అందవల్సిన నీరు అందుతుంది. దాంతో ఇటువంటి అనారోగ్య సమస్యల నుండి బయట పడవచ్చు.

15 Foods Rich In Water Content – A Must Have During Summer!

నీరు అధిక శాతంలో ఉన్న పండ్లు, మరియు కూరగాయలు ఉన్నాయి. ఒక్క వాటర్ మాత్రమే కాదు వీటిల్లో వివిధ రకాల విటమిన్స్ మరియు ప్రోటీనులు పుష్కలంగా ఉన్నాయి. వాటర్ రిచ్ ఫుడ్స్ అంటే పుచ్చకాయ, కీరదోసకాయ, ముల్లంగి, టమోటోలు, క్యారెట్ మొదలగునవి మీ డైలీ డయట్ లో చేర్చుకోవడం చాలా మంచిది. మరి వాటర్ రిచ్ ఫుడ్ ఏవేవో ఒక సారి ఈ క్రింది లిస్ట్ చూసి మీ ఆరోగ్యానికి, చర్మ సంరక్షణకు కావల్సిన నీరు పొందండి. తగినంత హైడ్రేషన్ పొందండి.
కీరదోసకాయ :

కీరదోసకాయ :

వాటర్ కంటెంట్ అత్యధికంగా ఉండే మరో వెజ్ ఫ్రూట్ కీరదోసకాయ. వీటిని సలాడ్ రూపంలో భోజనంలో చేర్చుకోవడం వల్ల ఆకలిని కంట్రోల్ చేస్తుంది. కీరదోసకాయలో వాటర్ కంటెంట్ 97శాతం ఉంటుంది. వీటిని సలాడ్స్, షేక్స్, సూప్స్ లో రూపంలో తీసుకోవచ్చు. కీరదోసకాయ శరీరాన్ని కూల్ చేయడం మాత్రమే కాదు, స్కిన్ స్ట్రక్చర్ ను మెరుగుపరుస్తుంది.

వాటర్ మెలోన్:

వాటర్ మెలోన్:

వాటర్ శాతం అత్యధికంగా ఉండే ఒక ఆరోగ్యకరమైన ఆహారం నీళ్ళు. పుచ్చకాయలో క్యాలరీలు తక్కువ అందువల్ల, ఇది ఒక బెస్ట్ వెయిట్ లాస్ ఫ్రూట్ గా రెగ్యులర్ డైట్ లో నిరభ్యరంతరంగా చేర్చుకోవచ్చు.ఇది అత్యధిక నీటిశాతాన్ని కలిగినది. ఇవి వేసవిలో విరివిగా లభ్యం అవుతాయి. కాబట్టి ప్రతి రోజూ మీ డైయట్ లో దీన్ని తీర్చుకోవడం వల్ల శరీరానికి అందవల్సిన వాటర్ తో పాటు, విటమిన్ ఎ, బి, పొటాషియం, మరియు థైమిన్ అందిస్తుంది.

గ్రీన్ సలాడ్

గ్రీన్ సలాడ్

ఒక బౌల్ గ్రీన్ సాలాడ్ తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు, హైడ్రేషన్ తగ్గిస్తుంది. ఉందులో ఉండే వాటర్ కంటెంట్ అందుకు గ్రేట్ గా సహాయపడుతుంది. గ్రీన్ సాలడ్ లో ఫొల్లెట్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్, విటమిన్స్, మినిరల్స్ అధికంగా ఉంటాయి. కాబట్టి వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం మంచిది

ముల్లంగి:

ముల్లంగి:

ముల్లంగిలో 90శాతం నీరు ఉంటుంది. వీటిని భోజనంలో తీసుకోవడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ ను తొలగించడానికి గ్రేట్ గా సహాయపడుతుంది. అదేవిధంగా, ఇది గ్యాస్ కు కారణం అవుతుంది కాబట్టి, వీటిని మితంగా తీసుకోవాలి, ఈ దుంప కొద్దిగా ఘాటైన వాసన కారం కలిగి ఉంటుంది. దీనితో పాటు 95శాతం వాటర్, న్యూట్రీషియన్స్ కూడా అధికంగా ఉంటాయి. వేసవి సీజన్ లో రీహైడ్రేషన్ కు సహాయపడుతుంది. కొద్దిగా సాల్ట్ చిలకరించి, సలాడ్స్, జ్యూస్ ల రూపంలో తీసుకోవాలి.

టమోటోలు:

టమోటోలు:

టమోటోలు మెటబాలిజంను పెంచడంలో చాలా మంచిది . ఇది క్యాన్సర్ తో పోరాడుతుంది మరియు వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది. వీటిలో విటమిన్ సి మరియు పొటాషియం, మరియు లైకొపిన్ తో పాటు 94% వాటర్ ఉంటుంది. టమోటోలు బరువు తగ్గించడాని బాగా సహాయపడుతాయి. ఇందులో ఉండే విటిమన్ సి, ఫ్లెవనాయిడ్స్, ఫొల్లెట్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్స్ ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి చాలా మంచిది.

పైనాపిల్:

పైనాపిల్:

పైనాపిల్ లో మినిరల్స్, విటమిన్స్, యాంటీఆక్సిడెంట్స్ మరియు వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. టేస్టీగా కూడా ఉంటుంది. ఒక గ్లాసు ఫ్రెష్ పైనాపిల్ జ్యూస్ తీసుకోవడం వల్ల 87శఆతం వాటర్ కంటెంట్ ను పొందవచ్చు. ఇందులో నీటితో కూడిన యాంటీఆక్సిడెంట్స్ మరియు ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి పైనాపిల్ తరచూ తీసుకోవడం ఉత్తమం.

ఆప్రికాట్

ఆప్రికాట్

ఆప్రికాట్ లో వారట్ కంటెంట్ 80శాతం ఉంటుంది. ఈ రుచికరమైన ఆప్రికాట్ జ్యూస్ టేస్టీగా ఉంటుంది. ఆప్రికాట్ లో యాంటీఆక్సిడెంట్, బీటా కెరోటిన్, ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. సమ్మర్లో వీటిని ఎక్కువగా తీసుకోవడం మంచిది. సమ్మర్లో తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ సమస్య ఉండదు.

ఆరెంజెస్:

ఆరెంజెస్:

సిట్రస్ పండ్లలో కూడా వాటర్ అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఆరెంజ్ లో 87శాతం వాటర్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి ఆరెంజ్ జ్యూస్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మీ శరీరం హైడ్రేషన్ లో ఉంచి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.ఇందులో ఉండే విటమిన్ సి సమ్మర్లో బాడీని హైడ్రేషన్ లో ఉంచుతుంది.

స్ట్రాబెర్రీస్

స్ట్రాబెర్రీస్

లవ్లీ రెడ్ జ్యూసీ ఫ్రూట్ స్ట్రాబెర్రీ. అత్యధిక న్యూట్రీషియన్స్ కలిగినటువంటి పండ్లు. ఈ వాటర్ కంటెంట్ ఫ్రూట్స్ ను తీసుకోవడం వల్ల వేసవి సీజన్ లో శరీరంను హైడ్రేట్ చేస్తుంది. బెర్రీస్ లో ముఖ్యంగా స్ట్రాబెర్రీ మరో వాటర్ రిచ్ ఫుడ్. అంతే కాకుండి ఇందులో విటమిన్స్, ప్రోటీన్స్ మరియు న్యూట్రీషియన్స్ పుష్కలం.బెర్రీస్ లో 92శాతం వాటర్ కంటెంట్ ఉంటుంది. వేడి ఉష్ణోగ్రతలలో రీహైడ్రేషన్ ను కలిగిస్తుంది

ద్రాక్ష:

ద్రాక్ష:

ఈ చిన్నని మరియు జ్యూస్ ఉన్న పండ్లలో వాటర్ పుష్కలంగా ఉంటుంది. 80శాతం వాటర్ కంటెంట్ ఉండే వీటిని తినడం వల్ల శరీరం హైడ్రేషన్ పొందడం మాత్రమే కాదు, జీర్ణ సమస్యలను అధిగమిస్తుంది. ద్రాక్షలో ఉండే విటమిన్ కె , సి ని పెంచడంతో పాటు, వ్యాధినిరోధకతను పెంచుతుంది.

పీచెస్ :

పీచెస్ :

పీచెస్ లో వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇంకా విటమిన్ ఎ, సి మరియు బీటాకెరోటిన్ వంటి పుష్కలమైన పోశకాలుంటాయి. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ శరీరంలోని ఫ్రీరాడికల్స్ ను తొలగిస్తుంది.

పెరుగు:

పెరుగు:

వేసవి సీజన్ లో జీర్ణక్రియను మెరుగుపరిచే ఆహారాల్లో బట్టర్ మిల్క్ ఒకటి . ఇది శరీరంలో వేడి తగ్గిస్తుంది. శరీరంను చల్లబరుస్తుంది. ఇది వేసవి సీజన్ కు పర్ఫెక్ట్ సౌత్ ఇండియన్ మీల్ , పెరుగులో క్యాల్షియం, విటమిన్ బి మరియు బి12 మరియు ప్రోబయోటిక్స్ అధికంగా ఉన్నాయి.

గ్రీన్ పీస్

గ్రీన్ పీస్

గ్రీన్ పీస్ లో 92శాతం వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. గ్నీ్ పీస్ ను వివిద రకాల ఆహారాలతో కలిపి తీసుకోవచ్చు.

 బ్రొకోలీ

బ్రొకోలీ

బ్రొకోలీలో వాటర్ కంటెంట్ అత్యధికంగా ఉంటుంది. ఈ బిట్టర్ వెజిటేబుల్ శరీరంలోని టాక్సిన్స్ ఫ్లష్ చేయడానికి మరియు హైడ్రేషన్ లో ఉంచడానికి సహాయపడుతుంది.వాటర్ కంటెంట్ తో పాటు పొటాషియం, విటమిన్ ఎ, సిలు కూడా అధికంగా ఉంటాయి. గ్రీన్ సలాడ్స్ లో బ్రొకోలీ చేర్చుకోవడం కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

కర్భూజ

కర్భూజ

వేసవిలో కర్బూజతో జ్యూస్ తయారుచేసి తాగుతారు. ఇందులో 90శాతం వాటర్ కంటెంట్ ఉండి. దీన్నే మస్క్ మెలోన్ అని పిలుస్తారు. హైడ్రేషన్ బెనిఫిట్స్ ను అందివ్వడంలో ఇది గ్రేట్ .

English summary

15 Foods Rich In Water Content – A Must Have During Summer!

15 Foods Rich In Water Content – A Must Have During Summer!Listed in this article are foods that are rich in water content and hence why they need to be included during summer. These foods help to keep the body cool.
Desktop Bottom Promotion