For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అంగస్తంభన లోపాలను ఖచ్ఛితంగా నివారించే 10 కామన్ ఫుడ్సే ..!!

ఈ క్రింది లిస్ట్ లో ఇచ్చిన ఆహారాలను పురుషులు వారి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల వారి శరీరంలోని(అంగాలకు) రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుంది.

|

అంగస్తంభన సమస్య శారీరక, మానసిక కారణాల వల్ల ఏర్పడుతుంది. వీటిలో కూడా 60 శాతం శారీరక కారణాలు, 40 శాతం మానసిక కారణాలుగా చెప్పవచ్చు. అంగస్తంభనను ఎరిక్టైల్ డిస్ ఫంక్షన్ అని అంటారు. ఈ ఎరిక్షన్ కేవలం పనల్ ఎరిక్షన్ మాత్రమే కాదు, ఎరిక్షన్ సెక్సువల్ ఇంటర్ కోర్స్ సమయంలో ఎక్కువ సమయం ఉండకపోవడం కూడా అంగస్తంభన లోపంగానే గుర్తించాలి. ఈ పరిస్థితి 40 ఏళ్ళు పైబడ్డ వారిలో సహజం. అంగస్తంభనకు మరికొన్ని అసాధారణ కారణాలు కూడా ఉన్నాయి. వాటిలో స్ట్రెస్, హార్మోనుల అసమతుల్యతలు, మానసిక ఆందోళన ఒత్తిడి, భయం, డిప్రెషన్, పెర్ఫార్మెన్స్ యాంగ్జయిటీతో బాధపడుతున్నవారికి వారి సెక్స్ సామర్థ్యం పైన నమ్మకం లేనందున అంగస్తంభన సమస్య ఏర్పడుతుంది.

అంగస్తంభన సమస్య కేవలం అది వున్న వాళ్ళనే కాకుండా వాళ్ళ పార్ట్నర్, కుటుంబ సభ్యుల్ని కూడా బాధిస్తుంది. అందువలన దీని చికిత్స గూర్చిన వివరాలు అందరూ తెలుసుకుంటే మంచిది. నపుంసకత్వం అన్నది కేవలం జననాంగానికి సంబంధించినదే కాదు. శరీరంలో కలిగే అనేక వికృతులు ఈ సమస్య కలిగిస్తాయి. శృంగారం అన్నది ఒక క్రీడ. ఈ క్రీడలో ఇద్దరూ భాగస్వాములే. అవతలి వాళ్ళకోసం వాళ్ళలోపం కూడా ఆడే వాడి మీద పడుతుంది. అనుమానించే భార్య, అసహ్యించుకునే భార్య, జడపదార్థం వలె పడుకునే భార్య, రసికత లేని భార్య, సెక్స్ డిమాండ్ చేసే భార్య, డామినేట్ చేసే భార్య - ఇలాంటి పార్టనర్ ప్రభావం కూడా సెక్స్ పై పడుతుంది.

అంగస్తంభన సమస్య రాకుండా ఉండాలంటే మానసిక ఆందోళన, ఒత్తిడి లేకుండా యోగ, వ్యాయామం, వాకింగ్ వంటివి చేయాలి. మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. పురుషులు ఈ సమస్య నుండి బయట పడాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు తినే ఆహారం మీద కూడా ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి. అప్పుడు పురుషులు వారి పార్ట్నర్ తో లవ్ లైఫ్ ను గడపడానికి సహాయపడుతాయి. కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు పండ్లు, పాలు, మినుములతో చేసినవి ఎక్కువుగా ఉండేట్లు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కామోద్దీపన పెంచడానికి సహాయపడుతాయి. అటువంటి సమస్య ఉన్నవారు అందుబాటులో వున్న కొన్ని ఆహారాలు తిని తమ పరిస్ధితి మెరుగుపరచుకోవచ్చు.

ఈ క్రింది లిస్ట్ లో ఇచ్చిన ఆహారాలను పురుషులు వారి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల వారి శరీరంలోని(అంగాలకు) రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుంది. దాని వల్ల బ్లడ్ ప్రెజర్ పెరిగి, తత్ఫలితంగా బలమైన అంగస్తంభనలు ప్రేరేపిస్తుంది. మరి అటువంటి స్ట్రాంగ్ పవర్ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం...

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ :

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ :

ఆకుకూరలు, పుదీనా, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల వీటిలో ఉండే నైట్రేట్ కంటెంట్ , నైట్రేట్స్ అధికంగా ఉంటాయి. ఇవి రక్తనాళాల్లో చాలా ఎఫెక్టివ్ గా కలిసిపోయి, రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి.దాంతో అంగస్థంభన లోపాలను నివారించుకోవచ్చు.

. డార్క్ చాక్లెట్ :

. డార్క్ చాక్లెట్ :

డార్క్ చాక్లెట్స్ లో ఫ్లెవానాయిడ్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి కూడా మేల్ ప్రొడక్టివిటికి, జననాంగాలకు రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి . దాంతో అంగస్థంభన చురుకుగా ఉంటుంది.

పిస్తా :

పిస్తా :

పిస్తాలు అత్యధికి పోషకాలున్న న్యూట్రీషియన్ ఫుడ్. ఈ నట్స్ లో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. ఇది రక్తనాళాలను రిలాక్స్ చేస్తాయి, రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. దాంతో ఎరిక్టైల్ డిస్ ఫంక్షన్ నివారించబడుతుంది.

ఓయిస్ట్రెస్ :

ఓయిస్ట్రెస్ :

ఓయిస్ట్రెస్ లో జింక్ ఎక్కువగా ఉంటుంది. ఇది మేల్ సెక్స్ హార్మోన్స్ ను పెంచుతుంది. శరీరంలో టెస్టోస్టిరాన్ లెవల్స్ ను పెంచుతుంది. దాంతో అంగస్తంభన లోపాలను నివారిస్తుంది.

వాటర్ మెలోన్:

వాటర్ మెలోన్:

వాటర్ మెలోన్ నేచురల్ వయాగ్ర వలె పనిచేస్తుంది. దాంతో అంగస్తంభన లోపాలను నివారిస్తుంది. ఇందులో ఫైటోన్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి. ఇది రక్తనాళాలల్లో రక్తం ప్రసరించడానికి సహాయపడుతుంది. దాంతో అంగస్థంభన సమస్యలను నివారించుకోవచ్చు.

టమోటోలు :

టమోటోలు :

టమోటోలలో ఉండే లైకోపిన్ అనే కాంపౌండ్ కంటెంట్ బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరుస్తుంది. అంగస్థంభన లోపాలను మెరుగుపరుస్తుంది.

రెడ్ వైన్ :

రెడ్ వైన్ :

రెడ్ వైన్ లో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి అంగస్థంభన లోపాలను నివారించడంలో గొప్పగా సహాయపడుతాయి. ఒక గ్లాసు రెడ్ వైన్ లో రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల బెడ్ రూమ్ లో యాక్టివ్ గా ఉండగలుగుతారు.

అరటిపండు

అరటిపండు

అరటిపండు ఇది దాని లింగ ఆకారంతో ఉండటం మాత్రమే కాకుండా, అరటిలో అసంఖ్యాకంగా ప్రయోజనకరమైన లక్షణాలను కలిగి ఉంటుంది. అరటి పండులో ఉండే బ్రొమెలైన్(bromelain)అనే ఎంజైమ్ లిబిడోను పెంపొందిస్తుంది మరియు పురుషుల్లో లైంగిక సమస్యలను తగ్గిస్తుంది. నేచురల్ బూస్టర్ గా పనిచేస్తుంది. సెక్స్ డ్రైవ్ ను పెంచుతుంది . ఒక అరటి పండులో విటమిన్ A,B మరియు C మరియు పొటాషియం ఉంటాయి. విటమిన్B మరియు పొటాషియం శరీరంలో సెక్స్ హార్మోన్ ఉత్పత్తి పెంచడానికి సహాయపడతాయి. అరటి పండులో టెస్టోస్టెరాన్ స్థాయిని పెంచే బ్రోమేలిన్ ఉంటుంది. అరటిపండులో అధిక స్థాయిలో చక్కెర ఉండుట వల్ల కొద్దిసేపు శక్తి ఇవ్వటానికి సహాయపడుతుంది.

దానిమ్మ

దానిమ్మ

దానిమ్మలో చాలా తక్కువగా ఐరన్ కలిగి ఉండి, ఇది శరీరంలో ఎర్రరక్తకణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. దాంతో శరీరంలో మరింత రక్తం ఉత్పత్తి అవుతుంది. దాంతో పురుషుల్లో లైంగిక సామర్థ్యం కూడా పెరుగుతుంది.

గుడ్డు

గుడ్డు

అంగస్తంభన మెరుగుపరిచే ఫుడ్స్ లో ఒక బ్రిలియంట్ ఫుడ్. గుడ్లలో విటమిన్ బి6 మరియు విటమిన్ బి5 పుష్కలంగా ఉంటాయి. ఇవి హార్మోనుల లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తాయి. ఒత్తిడితో పోరాడుతాయి. అధిక లైంగిక వాంఛను కలిగిస్తాయి. ముఖ్యంగా గుడ్లను ఫెర్టిలిటికి సంకేతంగా సూచిస్తారు.

English summary

Common Foods That Can Treat Erectile Dysfunction Easily!

If you want to have a better sex life, try these common foods!
Story first published: Wednesday, January 18, 2017, 16:21 [IST]
Desktop Bottom Promotion