For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మదర్స్ డే స్పెషల్ : సర్వికల్ క్యాన్సర్ కు కారణాలు..నివారణ..!

మదర్స్ డే , అంటేనే హ్యాపీ మూమెంట్ . ఈ సంతోష సమయంలో ప్రతి తల్లికీ బిడ్డలు వివిధ రకాల బహుమతులును బహుకరిస్తుంటారు. ఉదాహరణకు ఫ్లవర్స్, కార్డ్స్, గిప్ట్స్ ఇలా అనేక గిప్ట్స్ ఇచ్చి తమ తల్లి మీద ఉన్న ప్రేమను

|

మదర్స్ డే , అంటేనే హ్యాపీ మూమెంట్ . ఈ సంతోష సమయంలో ప్రతి తల్లికీ బిడ్డలు వివిధ రకాల బహుమతులును బహుకరిస్తుంటారు. ఉదాహరణకు ఫ్లవర్స్, కార్డ్స్, గిప్ట్స్ ఇలా అనేక గిప్ట్స్ ఇచ్చి తమ తల్లి మీద ఉన్న ప్రేమను అలా వ్యక్తపరుస్తుంటారు. గిప్ట్స్ ఎన్ని ఇచ్చినా, ఎలాంటివి ఇచ్చిని బిడ్డల దగ్గర నుండీ తీసుకునే ఆ బహుమతులు తల్లికి వెలకట్టలేనివి. అయితే అన్నికంటే ముఖ్యమైనది ఆరోగ్యం. అది కుటుంబ సభ్యులైనా, స్నేహితులైనా సరే..

అయితే మహిళలు ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించాలంటే ఏం చేయాలి. వీరికి ఒక వయస్సు వచ్చిన తర్వాత ఆరోగ్య పరంగా కొన్ని హెల్త్ చెకప్స్ అవసరం అవుతాయి. తల్లి ఆరోగ్యంగా ఉంటేనే కుంటుంబం మొత్తం ఆరోగ్యంగా జీవించగలుగుతుంది.

సహజంగా మహిళలు కుంటుంబలోని వారందరి ఆరోగ్యాన్ని చూసుకుంటారు, కానీ వారి ఆరోగ్యాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇటువంటి పరిస్థితి నుండి మహిళలు ఒక్క అడుకు ముందుకు వేసి, రెగ్యులర్ మెడికల్ చెకప్స్, హెల్తీ లైఫ్ స్టైల్ ను అలవర్చుకోవాలి.

కొంత మంది మహిళల్లో సర్వికల్ క్యాన్సర్ మరణానికి దారిస్తుంది. సర్వికల్ క్యాన్సర్ ను ప్రారంభంలోనే గుర్గించి చికిత్స తీసుకున్నట్లైతే 100శాతం తగ్గించుకోవచ్చు.జ

సర్వికల్ క్యాన్సర్ ను గుర్తించడానికి PAP అనే టెస్ట్ కేవలం 5 నిముషాలు సమయం మాత్రమే పడుతుంది. ఈ అలవాటు ఇప్పటి వరకూ మీకు లేనట్లైతే ఈ మదర్స్ డే నుండి ప్రారంభించి, తల్లి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

సర్వికల్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది. అందుకు కారణాలు, లక్షణాలు ఏంటి అని తెలుసుకోవడం ద్వారా భవిష్యత్ లో ఎలాంటి సమస్యలు ఎదుర్కోకుండా ఆరోగ్యంగా జీవించవచ్చు.

మరి ఈ ఆర్టికల్ ద్వారా సర్వికల్ క్యాన్సర్ యొక్క లక్షణాలు, నివారణ గురించి తెలుసుకుందాం..

 హ్యుమన్ పాపిల్లోమవైరస్ – కాసేటివ్ ఏజెంట్

హ్యుమన్ పాపిల్లోమవైరస్ – కాసేటివ్ ఏజెంట్

సర్వికల్ క్యాన్సర్ కు సహజ లక్షణం హ్యుమన్ పాపిల్లోమవైరస్((HPV).. చాలా పరిశోధనల్లో ఈ విషయాన్ని నిర్ధారించారు. దీని నివారణకు వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేకంగా మహిళలో కోసం (HPV) బ్యాక్సినేషన్ ను టీనేజ్ నుండే మొదలు పెడుతున్నారు.

అసురక్షితమైన లైంగిక ప్రక్రియ

అసురక్షితమైన లైంగిక ప్రక్రియ

అసురక్షితమైన లైంగిక ప్రక్రియ ద్వార హెచ్ పివి వ్యాధి సోకుతుంది. కొన్ని రకాల ఈ వ్యాధి లక్షణాలను వ్యాక్సినేషన్స్ కూడా నయం చేయలేవు. అందువల్ల సురక్షితమైన పద్దతి ఏంటంటే కండోమ్స్ ను ఉపయోగించడం . ఇలా చేయడం వల్ల HPV వ్యాధి సోకకుండా నివారించుకోవచ్చు.

స్మోకింగ్

స్మోకింగ్

స్మోకింగ్ అత్యంత ప్రమాదకరమైనది , ఇది క్యాన్సర్ రిస్క్ ను పెంచుతుంది. అదే విధంగా సర్వికల్ క్యాన్సర్ కూడా కారణమవుతుంది. మహిళలు ఎవరైతే ఈ వ్యాధికి గురి అవుతారు, స్మోకింగ్ వల్ల మరింత ప్రమాదం ఉంటుంది.

నిర్లక్ష్యం

నిర్లక్ష్యం

కొన్ని వ్యాధులను నిర్లక్ష్యం చేయడం వల్ల మరింత ప్రమాదకర స్థితిని ఎదుర్కోవల్సి వస్తుంది. ప్రస్తుత రోజుల్లో చాలా చోట్లో ప్రచారలు, క్యాంపులు, అవేర్ నెస్ ప్రోగ్రామ్ లు చేస్తుంటారు. అలాంటి చోట్లో వివిధ రకాల హెల్త్ సమస్యలను గురించి , వాటి లక్షణాలు, నివారణ మార్గలు గురించి తెలియజేస్తుంటారు. అలాంటి వాటిలో సర్వికల్ క్యాన్సర్ ఒకటి. కాబట్టి, ఇలాంటి అవేర్ నెస్ ప్రోగ్రామ్స్ ను మహిళలు తప్పనిసరిగా పాల్గొంటే వారి ఆరోగ్యం మీద ఒక మంచి అవగాహన, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి వీలుంటుంది

కాంట్రాసెప్టివ్ పిల్స్

కాంట్రాసెప్టివ్ పిల్స్

ఇది కొంచెం కాంట్రవర్సీగానే ఉండొచ్చు. కానీ కొన్ని పరిశోధనల ద్వార కాంట్రాసెప్టివ్ పిల్స్ తీసుకోవడం వల్ల కూడా సర్వికల్ క్యాన్సర్ కు కారణమవుతుందని తెలుపుతున్నారు. ఇది హార్మోనులను అసమతుల్యం చేస్తుంది,. సెల్స్ అబ్ నార్మల్ గా మారడం వల్ల ఇలా జరగుతుంది.

 హార్మోన్ థెరఫి:

హార్మోన్ థెరఫి:

మోనో పాజ్ తర్వాత కొంత మంది మహిళలు హార్మోన్ థెరఫిని తీసుకుంటారు. మెడిసిన్స్ డోసేజ్ స్వయంగా తీసుకోవడం వల్ల హార్మోన్లోలు అసమతుల్యతలు సర్వికల్ క్యాన్సర్ రావచ్చు. ఈ హార్మోన్ థెరఫీని ఎప్పుడూ డాక్టర్ల సమక్షంలోనే చేయించుకోవాలి. సర్వికల్ క్యాన్సర్ కు కారణాలు తెలుసుకున్నట్లైతే ప్రారంభంలోనే నివారించుకోవచ్చు

వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉండటం :

వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉండటం :

వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉండట వల్ల ఇన్ఫెక్షన్స్ త్వరగా వ్యాప్తి చెందుతాయి. కాబట్టి, అందుకు హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం, బ్యాలెన్స్ డైట్ ప్లాన్ చేసుకోవడం మంచిది. ఇది వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది. మీకు ఏవైనా మెడికల్స్ కండీషన్స్ ఉన్నట్లైతే ముందుగానే డాక్టర్ కు తెలియజేయాలి.

మెంటల్ స్ట్రెస్

మెంటల్ స్ట్రెస్

అనేక అనారోగ్యాలకు కారణమయ్యేది స్ట్రెస్, మానసికంగా ఒత్తిడికి గురైన వారిలో హార్మోనుల అసమతుల్యతల కారణంగా సర్వికల్ క్యాన్సర్ పెరిగే చాన్సెస్ ఉన్నాయంటున్నారు నిపుణులు . స్ట్రెస్ కారణంగా ఆల్కహాల్, స్మోకింగ్ వంటివి, ప్రమాదాన్ని మరింత తీవ్రం చేస్తాయి,. సర్వికల్ క్యాన్సర్ లక్షణాలు తెలుసుకున్నప్పుడు అందులో స్ట్రెస్ కూడ ఒకటని గుర్తించాలి.

English summary

Mother's Day Special: Causes & Prevention Of Cervical Cancer

Mother's Day Special: Causes & Prevention Of Cervical Cancer ,Cervical cancer can be prevented. Know about the causes and the preventive measures for cervical cancer..
Desktop Bottom Promotion