For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలర్ట్ : వన్ సైడ్ చెస్ట్ పెయిన్ కు కొన్ని ఫర్ఫెక్ట్ రీజన్స్ ..!!

సహజంగా చెస్ట్ పెయిన్ హార్ట్ సమస్యలకు సంబందించిన సంకేతంగా భావిస్తుంటారు. అలా అది కంటిన్యుగా వస్తుంటే వెంటనే డాక్టర్ వద్దకు వెళ్ళే పరీక్షలు చేయించుకుంటుంటారు .

|

ఛాతీ బాగంలో ఏ మాత్రం కొద్దిగా నొప్పిగా అనిపించినా ఆందోళనకు గురి అవుతుంటారు. ఆ నొప్పి హార్ట్ కు సంబంధించినదని భయపడుతుంటారు. అయితే హార్ట్ మరియు లంగ్స్ రెండూ ఒకే దగ్గర ఉంటాయన్న విషయం మీకు తెలుసా..? అందులోనూ ఒక వైపు మాత్రమే చెస్ట్ పెయిన్ వస్తుంటే అందుకు అనేక కారణాలున్నాయి

సహజంగా చెస్ట్ పెయిన్ హార్ట్ సమస్యలకు సంబందించిన సంకేతంగా భావిస్తుంటారు. అలా అది కంటిన్యుగా వస్తుంటే వెంటనే డాక్టర్ వద్దకు వెళ్ళే పరీక్షలు చేయించుకుంటుంటారు .

Reasons For Pain On One Side Of Chest

ఇలా చేయించుకోవడం ఒక రకంగా మంచిదే. ఎందుకంటే నొప్పిని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా.. అది ఇతర సైడ్ ఎఫెక్ట్స్ కు దారితీస్తుంది. కాబట్టి, ఒక్క వైపు వచ్చే చెస్ట్ పెయిన్ ను నిర్లక్ష్యం చేయకుండా దానికి ఖచ్చితైన కారణాలు తెలుసుకోవడం మంచిది. ఒక వైపు మాత్రమే చెస్ట్ పెయిన్ ఎందుకొస్తుంది. అందుకు హిడన్ రీజన్స్ ఏంటి అనేవి కొన్ని ఈ క్రింది విధంగా ఉన్నాయి..

బోన్ ఫ్రాక్చర్ :

బోన్ ఫ్రాక్చర్ :

చెస్ట్ పెయిన్ సైడ్ లో వస్తుంటే , రిబ్స్ లో చిన్న పాటి ఫ్రాక్చర్ లక్షణాలు కనబడుతాయి. ఈ పెయిన్ పడిపోవడం లేదా యాక్సిడెంట్ వల్ల జరిగి ఉండవచ్చు. గాయాల వల్ల బోన్ ఫ్రాక్చర్ అవ్వొచ్చు. టైట్ గా హగ్ చేసుకోవడం వల్ల నొప్పికి దారితీస్తుంది. కొన్ని సందర్భాల్లో ఊపిరితిత్తుల సమస్యలు, ఊపిరితిత్తుల గాయాల వల్ల కూడా చెస్ట్ పెయిన్ కు దారితీస్తుంది.

కార్టిలేజ్ ఇన్ఫ్లమేషన్ కు గురైనప్పుడు

కార్టిలేజ్ ఇన్ఫ్లమేషన్ కు గురైనప్పుడు

రిబ్స్ లో ఉండే కార్టిలేజ్ ఇన్ఫ్లమేషన్ కు గురైనప్పుడు. ఒత్తిడి, గాయాలు, రుమటాయిడ్ ఆర్థైటిస్ వంటి కారణాల వల్ల కూడా ఒక్క వైపు చెస్ట్ పెయిన్ కు దారితీస్తుంది. నారాల మీద ఒత్తిడి లేదా నారాలు దెబ్బతిన్నప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ చెస్ట్ పెయిన్ కు దారితీస్తుంది.

క్యాన్సర్ :

క్యాన్సర్ :

లంగ్ క్యాన్సర్ వల్ల కూడా లెఫ్ట్ సైడ్ చెస్ట్ పెయిన్ కు దారితీస్తుంది. స్మోక్ చేసే వారు వెంటనే మానేయడం మంచిది. ఇంకా కొన్ని క్యాన్సర్ కారక బ్యాక్టీరియా వల్ల కూడా రిబ్స్ లో నొప్పికి దారీ తీసి, చాతీ నొప్పికి కారణం కావచ్చు .

వైరల్ ఇన్ఫెక్షన్స్

వైరల్ ఇన్ఫెక్షన్స్

వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా కూడా చెస్ట్ పెయిన్ కు దారితీస్తుంది. కొన్ని సందర్భాల్లో లంగ్స్ కు రక్తప్రసరణ సరిగా జరగనప్పుడు కూడా చాతీ నొప్పికి కారణమవుతుంది.

కండరాలు స్ట్రెయిన్ అయినప్పుడు

కండరాలు స్ట్రెయిన్ అయినప్పుడు

చెస్ట్ చుట్టూ ఉన్న కండరాలు స్ట్రెన్ కు గురైనప్పుడు, కండరాలు చిరిగినప్పుడు నొప్పి వస్తుంది. అధికబరువులు ఎత్తి వ్యాయామాలు చేసే వారిలో , తరచూ దగ్గు సమస్యలున్న వారిలో వన్ సైడ్ చెస్ట్ పెయిన్ కు కారణమవుతుంది.

ఇన్ఫెక్షన్స్ :

ఇన్ఫెక్షన్స్ :

పలిమనరీ ట్యూబర్ క్యులోసిస్ మరియు ప్యునోమినియా వంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా చెస్ట్ పెయిన్ కు గురి అవుతారు. ఆ ప్రదేశంలో పస్ పెరిగి లంగ్స్ లో ఫ్ల్యూయిడ్స్ పెరగడంతో నొప్పికి దారితీస్తుంది. బ్రొంకైటిస్ కూడా ఛాతీ నొప్పికి కారణమే..

అసిడిక్ రిఫ్లెక్షన్ :

అసిడిక్ రిఫ్లెక్షన్ :

అసిడిక్ రిఫ్లెక్షన్ , ఇది జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్య,. ఇది హార్ట్ బర్న్ కు కారణమై ఛాతి నొప్పికి దారితీస్తుంది. వన్ సైడ్ ఛాతీ నొప్పికి వివిధ రకాలైన అనేక కారణాలున్నాయి. కాబట్టి, ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ ను సంప్రదించడం మంచిది.

English summary

Reasons For Pain On One Side Of Chest

When you experience pain in the chest, you may first suspect pain in the heart. But both the heart as well as the lungs are located in the same area and there could be so many other reasons behind pain on one side of the chest.
Story first published: Thursday, February 23, 2017, 16:45 [IST]
Desktop Bottom Promotion