For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెగ్యులర్ గా తులసి తాగడం వల్ల పొందే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.!!

Now, most of us would be aware of the famous tulsi leaves, right? In India, the tulsi plant is considered to be holy and is grown in front of many houses and is also worshiped!

|

నిత్య జీవితంలో తులసి మొక్కకు గల ప్రాధాన్యం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తులసి మొక్కను పూజిస్తే సకల పాపాలు, దోషాలు తొలగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆడపడుచులు తులసి మొక్కకు పూజలు చేయడం చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా కార్తీక మాసంలో ఈ మొక్కకు పూజలు చేయడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు.!

హిందువులు అత్యంత పవిత్రంగా భావించే తులసి మొక్క ఆరోగ్యాన్ని కాపాడడంలో అంతే ప్రాధాన్యత వహిస్తుంది. సహజంగా ఇంటిల్లిపాదికి ఉపయోగపడే ఔషధ మొక్కలు పెంచుకుంటే ఇంట్లో ఉండే అన్నివయస్సుల వారికి ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. తులసిలో ఎన్నో రకాలున్నప్పటికీ ప్రధానంగా రామ తులసి, కృష్ణ తులసి మాత్రమే వాసికెక్కాయి. ఈ రెండు రకాలనే ఎక్కవగా ఔషధ సేవనంలో కూడా వాడతారు. ప్రకృతి వైద్యంలో తులసిది విడదీయరాని బంధం. అందుకే సహజ వైద్యంలో తులసికి మొదటి ప్రాధాన్యతనిస్తారు. తులసి మొక్క ఆకులు, కొమ్మలు, గింజలు, వేర్లు అన్నింటినీ వైద్య రంగంలో ఉపయోగిస్తారు.

Surprising Health Benefits Of Drinking Tulsi Tea

తులసిని పురాతన కాలం నుండే దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇందులో ఉండే అనేక పవర్ ఫుల్ బెనిఫిట్స్ వల్ల ఆ కాలం నుండి ఇప్పటి వరకూ బాగా పాపులర్ అయ్యింది. పురాతన కాలం నుండే తులసిని ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తున్నారు. జబ్బుల నివారణ కోసం డాక్టర్స్ వద్దకు వెళ్లి ఎక్కువ డబ్బుతో పాటు, సమయం వ్రుదా చేయడం కంటే ఇటువంటి ఆయుర్వేదిక్ హెర్బల్ రెడీని ఎంపిక చేసుకోవడం మంచిది. దీన్ని బెస్ట్ నేచురల్ రెమెడీగా ఉపయోగించుకోవచ్చు . తులసి ఆకులను నీటిలో వేసి బాగా మరిగించి, ఒక టీస్పూన్ తేనె కలిపి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది:

బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది:

తులసి టీ తాగడం వల్ల, ఇందులో ఉండే ఫాలీ అన్ శ్యాచురేటెడ్ ఫ్యాయాటీ యాసిడ్స్ వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతుంది. డయాబెటిస్ ను నివారిస్తుంది.

డిప్రెషన్ తగ్గిస్తుంది:

డిప్రెషన్ తగ్గిస్తుంది:

తులసి టీలో ఉండే పొటాషియం కంటెంట్ బ్రెయిన్ లో సెరోటినిన్ లెవల్స్ పెంచడంతో డిప్రెషన్ లక్షణాలను తగ్గిస్తుంది.

ఏజింగ్ స్కిన్ నివారిస్తుంది:

ఏజింగ్ స్కిన్ నివారిస్తుంది:

మీరు యూత్ ఫుల్ స్కిన్ పొందాలంటే, తులసి టీ తాగాలి. కొద్ది రోజుల పాటు తులసి టీ క్రమం తప్పకుండా తాగుతుంటే, ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించి కొత్త చర్మ కణాలను పునరుత్పత్తి చేస్తుంది.

ఫ్లూ నివారిస్తుంది.

ఫ్లూ నివారిస్తుంది.

తులసి టీలో ఉండే రెమెడీస్ ఫ్లూ లక్షణాలను నివారిస్తుంది. ఇది నేచురల్ అనాల్జిక్ లక్షణాలను కలిగి ఉండటం వల్ల చర్మంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

హార్ట్ డిసీజ్ ను నివారిస్తుంది

హార్ట్ డిసీజ్ ను నివారిస్తుంది

తులసి టీలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ మరియు బీటా కెరోటిన్స్ గుండెకు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. అందుకు తులసి టీని రెగ్యులర్ గా తాగడం మంచిది.

కిడ్నీ స్టోన్స్ ను నివారిస్తుంది

కిడ్నీ స్టోన్స్ ను నివారిస్తుంది

తులసి టీని రెగ్యులర్ గా తాగడం వల్ల హెల్తీ డైట్ గా పనిచేస్తుంది. దాంతో కిడ్నీలలో రాళ్ళు ఏర్పడకుండా నివారిస్తుంది. తులసి టీ రెగ్యులర్ గా తాగడం వల్ల కిడ్నీలను డిటాక్సిఫై చేస్తుంది.

డైజెస్టివ్ డిజార్డర్స్ ను నివారిస్తుంది.

డైజెస్టివ్ డిజార్డర్స్ ను నివారిస్తుంది.

తులసి టీని రెగ్యులర్ గా తాగడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పొట్టను ప్రశాంత పరుస్తుంది.

English summary

Surprising Health Benefits Of Drinking Tulsi Tea

Now, most of us would be aware of the famous tulsi leaves, right? In India, the tulsi plant is considered to be holy and is grown in front of many houses and is also worshiped!
Story first published: Monday, January 23, 2017, 16:01 [IST]
Desktop Bottom Promotion