For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హలో..! చెవులు వినపడుట లేదా..? ఈసింపుల్ రెమెడీ మీ చెవులను క్లియర్ చేస్తుంది..

The fruiting season of pineapple runs from March to June and this is definitely the best time to relish this fruit along with the amazing health benefits.This fruit is a repository of nutrients that i

|

చెవుడు లేదా వినికిడి లోపం అనగా శబ్దాలను పూర్తిగా లేదా పాక్షికంగా వినలేకపోవడం. దీనికి చాలా విధాల జీవసంబంధ మరియు పర్యావరణ కారకాల వలన ఏర్పడుతుంది. అయితే ఈ వినికిడి లోపం ఏ వయసులోనైనా పెను శాపమే! చాలామంది వినికిడి లోపమంటే... అదేదో పెద్దల, మరీ ముఖ్యంగా వృద్ధుల సమస్యేననుకుంటారు. కానీ అది సరికాదు. వినికిడి లోపం పిల్లల్లోనూ, యుక్తవయస్కుల్లో కూడా తరచుగా కనబడుతూనే ఉంటుంది. పైగా ఆ చిన్నవయసులో వినికిడి లోపం వల్ల ఎదుగుదల తీవ్రంగా ప్రభావితమై, వారి ఉజ్జ్వలమైన భవిష్యత్తు అయోమయంగా కూడా తయారవుతుంది. అదృష్టవశాత్తూ చిన్నవయసులో తలెత్తే వినికిడి లోపాన్ని ముందుగా గుర్తిస్తే చక్కదిద్దేందుకు ఇప్పుడు అత్యాధునికమైన మార్గాలు చాలానే ఉన్నాయి.

This Remedy Clears Your Ear And Enhances Your Hearing Ability!

చెముడు కారకాలు:
* కర్ణభేరిలో రంధ్రం వల్ల కర్ణభేరికి అనుసంధానంగా మధ్య చెవిలో ఉండే మూడు గొలుసు ఎముకల్లో ఒకటి గట్టిపడిపోవటం, మధ్య చెవి నుంచి ముక్కుకు ఉండే యూస్టేషన్‌ ట్యూబు మూసుకుపోయి చెవిలో ద్రవాలు, జిగురు వంటి పదార్థాలు పేరుకుపోవటం, మధ్యచెవిలో కణుతులు రావటంవల్ల
* అంతర్‌ చెవిలోని శ్రవణనాడులు బలహీనపడటం, కొన్ని రకాల మందులు వాడినప్పుడు ఈ నాడులు దెబ్బతినటం తదితర కారణాల వల్ల
* మెదడులో వినికిడికి సంబంధించిన కేంద్రం దెబ్బతినటం వల్ల .

చెవి ఇన్ ఫెక్షన్ నివారణకి ఎఫెక్టివ్ హోం రెమెడీస్

వినికిడిలోపానికి కారణాలు ఏవైనా..ప్రారంభ దశలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే సమస్యను కొంత వరకూ తగ్గించుకోవచ్చు . చెవులు మూసుకు పోయినప్పుడు. ముందు కంటే ఎక్కువగా వినపడుతుంటాయి. కాబట్టి సమస్య ఎక్కువ కాక ముందు వినికిడి లోపానికి ఒక చక్కటి పరిష్కార మార్గం ఉంది. అది వెల్లుల్లి మరియు మంచి నూనె లేదా ఆముదం! అయితే ఇటువంటి హోం రెమెడీస్ ను ప్రయత్నించడానికి ముందు డాక్టర్ ను సంప్రదించడం చాలా అవసరం. అలాగే ఇంటర్నల్ ఇంజ్యురి (కర్ణబేరి సమస్యలు )ఉన్నప్పుడు, ఇయర్ ఇన్ఫెక్షన్, ఇతర చెవి సమస్యలున్నప్పుడు ఇటువంటి హోం రెమెడీస్ ను ఉపయోగించకూడదు. తాత్కాలికంగా చెవిలో నీళ్ళు, గుమిలి, ఇతర కారణాల వల్ల చెవి వినపడనప్పుడు మాత్రమే ఇలాంటి హోం రెమెడీస్ ఉపయోగించాలి.

కావల్సిన పదార్థాలు

కావల్సిన పదార్థాలు

వెల్లుల్లి రెబ్బలు : 4 , స్వచ్చమైన మంచినూనె, లేదా ఆముదం మరియు ఇయర్ డ్రాపర్

స్టెప్ #1

స్టెప్ #1

మొదట వెల్లుల్లి రెబ్బను బాగా వాష్ చేయాలి. తర్వాత మెత్తగా చేయాలి. ఇలా కచాపచా దంచిన వెల్లుల్లిని గ్లాస్ జార్ లో వేయాలి. అలాగే కొద్దిగా స్వచ్చమైన మంచినూనె, లేదా ఆముదం కూడా వేయాలి.

స్టెప్ #2

స్టెప్ #2

తర్వాత జార్ కు మూత పెట్టి , వంటగదిలో ఎండ, వేడి తగలని ప్రదేశంలో ఉంచాలి.

స్టెప్ #3

స్టెప్ #3

రెండు రోజుల తర్వాత మూత తీసి నూనెను వడగట్టకోవాలి. ఈ నూనెను వినపడకుండా ఉండే చెవిలో రెండు చుక్కల వేసి, కొద్దిగా కాటన్ పెట్టుకోవాలి. తర్వాత కొన్ని నిముషాలు కదలకుండా విశ్రాంతి తీసుకోవాలి.

ఇలా ఎన్ని రోజులు ?

ఇలా ఎన్ని రోజులు ?

ఇలా ఒక క్రమం తప్పకుండా 5 రోజుల పాటు చెవిలో వేసుకోవాలి. అప్పటికి మీ చెవులు మూసుకుపోయినట్లు అనిపిస్తుంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. చెవుల్లో దురద, నొప్పి, ఇతర చీకాకులేవైనా ఉంటే వెంటనే ఈ హోం రెమెడీని నిలిపివేసి డాక్టర్ ను కలవాలి.

సూచన!

సూచన!

చెవులు వినపడుట లేదని, ఇయర్ బడ్, పెన్సి, స్టిక్ లేదా ఇతర వస్తువులను చెవులో తిప్పడం వల్ల చెవులు మరింత డ్యామేజ్ అవుతాయి. స్నానం చేసినా కూడా చెవుల్లో తేమను కాటన్ క్లాత్ తో మాత్రమే తుడుచుకోవాలి.

English summary

This Remedy Clears Your Ear And Enhances Your Hearing Ability!

This remedy uses garlic and olive oil. But wait! Consult your doctor before you try such a home remedy. Also, never try this remedy if you have any internal injury in your ear or certain other conditions like ear infections, mastoid cavity or any other ear problem.
Story first published: Friday, March 24, 2017, 16:20 [IST]
Desktop Bottom Promotion