For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆహ్లాదపరిచే ఇండోర్ గార్డెనింగ్: టిప్స్

|

గార్డెన్..అనగానే చాలా మందికి అవుట్ డోర్ గార్డెనింగ్ గుర్తొస్తుంది. కానీ ప్రస్తుతం ఇండోర్ గార్డెనింగ్ కి కూడా ఆదరణ పెరుగుతోంది. ఎవరి స్థోమతకు తగినట్లుగా వారు ఇంట్లోనే ఆయా గదులకు సరిపోయే మొక్కల్ని పెంచుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల ఇళ్లంతా చాలా స్టైలిష్ గా, అందంగా కనిపిస్తుంది. అలాగే దీని వల్ల ఇంట్లో చల్లటి వాతావరణం కూడా ఏర్పడుతుంది. మరి మీరు కూడా మీ ఇంట్లో ఇండోర్ గార్డెన్ ను ఏర్పాటు చేసుకునే ఆలోచనలో ఉన్నారా? అయితే మీకోసమే ఈ చిట్కాలు...

10 Tips For The Perfect Indoor Garden

1. ఆయా గదుల్లో ఏయే మొక్కల్ని ఎక్కడ అమర్చాలో ముందుగానే నిర్ణయించుకోవాలి,
2. ఇండోర్ గార్డెన్ కోసం మీరు ఎంచుకొనే మొక్కలు ఇంటికి సరికొత్త శోభను తీసుకొచ్చేలా, కలర్ ఫుల్ గా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం.
3. కొన్ని మొక్కలు సూర్యకాంతిలో పెరుగుతాయి. అలాంటి వాటిని ఇంట్లో సూర్యకాంతి పడే చోటా అమర్చాలి. కానీ ఎండవేడికి మొక్క ఆకులు వాడిపోతున్నాయా? కుండీలో ఉన్న మంట్టి తేమగా ఉందా లేదా? తదితర విషయాలు ఎప్పటికప్పుడు గమనించడం మంచిది.
4. ఇంట్లో అసలు సూర్యకాంతి పడకపోతే మొక్కల పెరుగుదలకు ఆటంకం కలుగుతుంది. కాబట్టి వాటికి ప్రత్యేకంగా లైటింగ్ సిస్టమ్ ని ఏర్పాటు చేసుకోవాలి.
5. మొక్క ఆరోగ్యంగా పెరగాలంటే బాగా చల్లగా బాగా వేడిగా ఉండే ప్రదేశాల్లో ఉంచకూడదు.
6. కొన్ని మొక్కలు డిమ్ లైట్ లో బాగా పెరుగుతాయి. అలాంటి మొక్కల్ని పెద్ద కిటికీల దగ్గర తూర్పు లేదా పడమరకు అభిముఖంగా అమర్చవచ్చు. ఒక వేళ కిటికీలో నుంచి ఎక్కువ వెలుతురు పడుతున్నట్లైతే నెట్ కర్టెన్ వేస్తే సరిపోతుంది.
7. ఒక వేళ మొక్కలు నాటడానికి ప్లాస్టిక్ కుండీలు ళఉపయోగిస్తే మాత్రం గతంలో రసాయనాలు తెచ్చిన వాటిని మాత్రం వాడకూడదు. ఎందుకంటే అందులో ఉండే రసాయనాల ప్రభావాినకి మొక్క పాడైపోయే అవకాశం ఉంది.
8. ఇంటికి పునాది ఎంత ముఖ్యమో..మొక్కలకు కింది భాగం నుంచి నీరందడం అంత ముఖ్యం. కాబట్టి ఏదో పైపైన మొక్కలకు నీరు పోయడంకాకుండా మీరు పోసే నీరు మొక్క కాండానికి అందేలా ఉండాలి.
9. అలాగని మొక్కకు నీళ్లు బాగా ఎక్కువైనా కూడా ప్రమాధకరమే. ఎందుకంటే మోతాదు కంటే ఎక్కువ నీళ్ళు పోయడం వల్ల మొక్క కుళ్లిపోయే ప్రమాదం ఉంది.
10. ఇండోర్ మొక్కల విషయంలో ప్రత్యేకించి వానాకాలంలో మొక్కలకు నీరు పోయడానికి బదులు కొన్ని ఐస్ ముక్కల్ని కుండీలో ఉన్నమట్టిపై ఉంచండి అవే నెమ్మదిగా కరిగి మొక్కకు నీరందుతుంది.

English summary

10 Tips For The Perfect Indoor Garden


 Growing a garden in the backyard is something most people are doing these days. But, it is important to note that not all weather conditions support an outdoor garden. That is when the prospect of growing an indoor garden sees considerable sheen.
Story first published: Wednesday, July 30, 2014, 17:32 [IST]
Desktop Bottom Promotion