For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్యారెట్ మొక్కలు ఎలా పెంచాలి?సులభ పద్ధతులు

|

ప్రపంచంలో ఆరోగ్యకరమైన కూరగాయల్లో ఉత్తమైనది క్యారెట్. క్యారెట్ లో మినిరల్, విటమిన్స్ అధికంగా ఉంటాయి. కొన్ని రకాల ప్రాణాంతక వ్యాధులను నివారించే గుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఆరోగ్యపరంగా మనకు ఉపయోగపడే క్యారెట్ హెల్త్ బెనిఫిట్స్ గురించి మనం ఇదివరకే తెలుసుకున్నాము. అటువంటి క్యారెట్ మన గార్డెన్ లో ఉంటే, ఇక ఆరోగ్యానికి లోటేముంటుంది. మరి ఇంటి ఆవరణలో క్యారెట్ ను ఎలా పెంచాలో తెలుసుకుందాం...

మొక్కలు పెంచడం ఒక కళ, కొంత సమయాన్ని, మరికొంత శ్రమను జోడిస్తే ఆ కళలో నైపుణ్యాన్ని సాధించవచ్చు. ఇంటి ఆవరణలో చక్కటి తోటను పెంచవచ్చు. గార్డెన్‌ను చక్కగా మెయింటేయిన్‌ చేస్తే ఇల్లు ఆరోగ్యంగా, ఆనందంగా వుంటుంది. తాజా గాలిని, పూల పరిమళాన్ని ఆస్వాదించవచ్చు. రోజంతా ఎన్ని ఒత్తిడులకు లోనయినా అరగంట సమయం మొక్కల మధ్య తిరిగితే టెన్షన్‌ నుండి బయటపడవచ్చు. అంతే కాకుండా ఇంట్లో పెరిగిన కూరగాయలతో తాజాగా, రుచికరమైన భోజనం కూడా చేయవచ్చు.

అందుక ఇంటి ఆవరణలో ఏడాదిలో ఏ కాలంలోనైనా సూర్యరశ్మి. గాలి వెలుతురు ప్రసరించే ప్రదేశాన్ని ఎంచుకోవాలి. గింజలు లేదా మొక్కలను సిద్ధం చేసుకోవాలి. నర్సరీ నుండి మొక్కలను కొనడం కంటే మనమే గింజలు చల్లినారు పెంచుకుంటే ఖర్చు తగ్గుతుంది. గింజలు చల్లాల్సిన సీజన్‌లో సాధ్యం కాకపోయినా, చల్లిన గింజలు సరిగా మొలవకపోతే అప్పుడు నేరుగా మొక్కలను తెచ్చుకోవచ్చు.

Steps To Grow Carrots in Your Garden

మొక్కను నాటే ముందు చెట్లు వేర్లు భూమిలోకి చొచ్చుకుపోవడానికి వీలుగా, రాళ్ళను తొలగించి మట్టిని గుల్లబరిచి, నేలను చదును చేయాలి. పైపొరలో ఆకులు, గడ్డినింపాలి. ఇది నీరు ఎక్కువ - తక్కువల ప్రభావం మొక్కల మీద పడకుండా నిరోధిస్తుంది. ఈ పొర భూమిలోని అదనపు తేమను పీల్చుకుంటుంది. అలాగే నేల త్వరగా ఎండిపోకుండా కాపాడుతుంది.

సాయిల్ టైప్: లైట్ గా అసిడిక్ సాయిల్ ఉన్నచోట క్యారెట్స్ బాగా పెరుగుతాయి. కాబట్టి, క్యారెట్ విత్తనాలు నాటే ముందు ఎరువు పూర్తిగా పొడిపొడి విడదీయాలి అలాగే ఆర్గానిక్ ఫ్రెర్టిలైజర్స్ ను ఉపయోగించడం చాలా ముఖ్యం. ఇది విత్తనాలు ఆరోగ్యంగా మొలకెత్తడానికి సహాయపడుతాయి.

క్యారెట్‌, బీట్‌రూట్‌ వంటి దుంపకూరలను లోతుగా వుండే బాక్సుల్ల నాటాలి. పాలకూర, కొత్తిమీర వంటి ఆకుకూరలకు గింజలను టబ్‌లలో చల్లాలి. అందుకు మంచి విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. గార్డెన్ లో క్యారెట్ ను పెంచడానికి మూడు రకాల విత్తనాలు లభ్యం అవుతాయి-రా క్యారెట్ సీడ్స్, ఫంగసైడ్ సీడ్స్, మరియు క్లే కోటెడ్ సీడ్స్ ఇంటి ఆవరణలో పెంచుకోవడానికి క్లే కోటెడ్ సీడ్స్ బాగా సహాయపడుతాయి.

గింజలు చల్లిన నేలను నీటితో నింపకుండా, ప్రతిరోజు కాస్త నీటిని చిలకరించినట్లు చల్లాలి. మొక్కల మొదళ్ళకు మాత్రం నీటిని సరిపెట్టుకుండా ఆకుల మీద కూడా చల్లాలి. అలాగే ఎండుటాకులు, మొక్కలకు హాని కలిగించే పురుగులను ఎప్పటికప్పుడు తొలగించాలి.

English summary

Steps To Grow Carrots in Your Garden

Carrots are amongst the healthiest vegetables in the world. Rich in several minerals, they are known to prevent dreaded diseases including cancer. In this article, whilst understanding the importance of carrots in enhancing health, we look at four ways to grow carrots in your garden.
Story first published: Friday, September 19, 2014, 17:57 [IST]
Desktop Bottom Promotion