పిల్లల చదువుకు అనుకూల వాతావరణం...!?

Posted By:
Subscribe to Boldsky

తల్లిదండ్రులందరూ తమ పిల్లలు అందరికంటే బాగా చదవాలి. అందరికంటే మంచి మార్కలు తీసుకురావాలి. ముఖ్యంగా పరీక్షలు బాగా రాసి, వారి పిల్లలే ఫస్ట్ ఉండాలని కోరుకుంటారు. అది సహజం. అందుకు ముఖ్యంగా పిల్లలకుండాల్సిందే ఏకాగ్రత. ఏకాగ్రత ఉంటేనే ఎవరైన ఏపనైనా సవ్యంగా నిర్వర్థించగలరు. పరీక్షలని పిల్లల్ని ఒకే చోట కూర్చొని చదవమంటే అది చాలా కష్టంగా.. ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. వారి ఏకాగ్రతను కల్పిచడానికి, మంచి సౌకర్యం కల్పించాలి. సౌకర్యానికి తగ్గ ఫర్నీచర్ ను ఏర్పాటు చేయాలి. అప్పుడు వారు తాజాగా ఫీలవ్వడంమే కాక.. ఏ పని చేయడానికైన సంసిద్దులవుతారు. వారి లక్ష్యాన్ని చేరుకుంటారు. అందుకు ఆసక్తి కరమైన కొన్ని డిజైన్లను, డెస్క్ లను అలంకరించి చూడండి వారి ముఖాల్లో నవ్వులు విరబూస్తాయి.

Desk Ideas For Kids Room...!

చదువు అనేది పిల్లల దిన చర్యలో భాగంగా ఉండేలా తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలి. కాబట్టి వారి గదిలో స్టడీ టేబుల్ ఉండేలా చూడండి. ఈ టేబుల్‌ను గదిలోని గోడకున్న పెయింటింగ్ కలర్‌తో సమానంగా ఉండేలా చూడండి. ఇలా కలిసే రంగులుంటే పిల్లలకు చాలా ఇష్టంగా ఉంటుంది. పిల్లల్ని ఎరుపు, నలుపు, తెలుపు రంగులు విశేషంగా ఆకట్టుకుంటాయి. అందుకే వారి గదుల్లో ఎరుపు, నీలం, పసుపుపచ్చ రంగులతో కూడిన వస్తువులను పెట్టడం మంచిది. చిన్నారుల గదిలో లైటింగ్ సాధారణంగా ఉంటే చాలు. వెలుగు జిలుగులకు ప్రాధాన్యం ఇవ్వకుండా సాధ్యమైనంతవరకు సహజ వెలుతురు ప్రాధాన్యం ఇవ్వాలి.

వివిధ రకాల షేప్ లో తీర్చిదిద్దిన డెస్క్ లాప్ లు: చదువు.. పిల్లలకు అత్యంత ముఖ్యమైన రోజువారీ కార్యక్రమం. ప్రతి విషయం గురించి తెలుసుకోవాలనీ, చూడాలనీ వీరికి ఉంటుంది. ఇందుకు అనుగుణంగా స్టడీ డెస్కును తీర్చిదిద్దుకోవాలి. డెస్కుకు అభిముఖంగా చార్టులు, వివిధ రకాల బొమ్మలు అమర్చడానికి అవకాశం ఉండాలి. కిడ్స్ డెస్క్ లను వివిధ మాడల్స్ లో ఉన్న డెస్క్ లను డెకరేట్ చేయాలి. ఉదాహరణకు పిల్లలకు రూమ్ లో అమర్చే డెస్క్ సన్ ఫ్లవర్ తో లేదా చాక్లెట్ బార్ పెయింటింగ్ తో డెకరేట్ చేసినవి. అలాగే వారు బుక్స్ సర్ధుకోవడానికి ఆకర్షనీయమైన ఒక ఇల్లు లాంటి ర్యాక్(రెండు డోర్లున్న)ను తయారు చేయించి ఇవ్వండి. డెస్క్ పక్కనే, బుక్స్ రాక్స్ ను అమర్చడం వల్ల పిల్లలు అక్కడ కూర్చొని చదువుకోవడానికి ఆసక్తి చూపిస్తారు.

కలర్స్: వారు చదువుకోవడానికి అమర్చే డెస్క్ కలర్స్ పసుపు లేదా ఆరెంజ్ కలర్స్ లో ఉంటే, పిల్లలు ఎక్కువగా ఇష్టపడుతారు. మరికొందరికి వారి డెస్క్ ఎలా ఉండాలో, ఏకలర్ వారు ఇష్టపడుతారో వారి చాయిస్ ప్రకారం తయారు చేయించి ఇవ్వొచ్చు. అలాగే వారు కూర్చొనే కుర్చీలు కూడా వారికి ఇష్టమైన కలర్స్ తో పెయింట్ చేసినవై ఉండాలి.

బొమ్మలు: పిల్లలు స్టఫ్డ్ ఆటబొమ్మలను బాగా ఇష్టపడుతారు. దీంతో వారికి ఒంటరి తనం అనేది తెలీదు. పిల్లల గదిలో ఫర్నీచర్ వారి అవసరాలను తీర్చటంతోపాటు అందంగా కూడా ఉండాలి. స్పైడర్ మ్యాన్, క్రికెట్, రాజకుమారుల థీమ్‌లతో గది వినోద ప్రధానంగా ఉండాలి. అలాగే అర్థవంతమైన వాల్‌పేపర్లు, ఆదర్శనీయ వ్యక్తుల కొటేషన్లు పిల్లల గదిలో పెడితే ప్రతిరోజూ వాటిని చూడటం, చదవటం అలవాటు చేసుకుంటారు.

బ్లాక్ బోర్డ్: కిడ్స్ డెస్క్ దగ్గరలోనో లేదా కిడ్స్ డెస్స్ మీదనో బ్లాక్ బోర్డ్ అతికించి, అక్కడే కొన్ని చాక్ పీసులను అందుబాటులో పెట్టండి వారి ఆలోచనలను వారు బోర్డ్ మీద ఎంత చక్కగా రాయగలరు, గీయగలరో మీకే అర్థం అవుతుంది. స్కూల్ విన్నవి, చూసినవి మళ్ళీ ఇక్కడ ఎంత చక్కగా ప్రదర్శిస్తారో.. అలా వారి టీచర్ లో వ్యవహరించి వారి చదువును మరికొంత పదును పెడుతారు. స్టడీ టేబుల్ ఎప్పుడూ చాలా సింపుల్ గా ఉండేటట్లు చూసుకోవాలి.

సైడ్ డ్రాయర్స్: గదిలోనే ఒక్కో పనికి ఒక ప్రాంతాన్ని ప్రత్యేకించడం మంచిది. చదువుకోసం కొంత ప్రాంతాన్ని, ఆడుకోవడానికి కొంత స్థలాన్ని విడిగా అట్టిపెట్టాలి. ప్రత్యేకంగా తలుపులున్న ర్యాక్‌లు, డ్రాలలో అమర్చుకుంటే గది అందంగా కనబడుతుంది. పొందికగా సర్దుకోవడం, జీవించడం వీరికీ అలవాటవుతుంది.

ఇలాంటి చిన్న చిన్న మార్పులు, ఐడియాలతో పిల్లల గదిని అలంకరించి చూడండి. వారిలో మార్పులు అవంతటఅవే మారి, వారు చదువులో కూడా పాజిటివ్ మార్పులు ఏర్పడాయి.

English summary

Desk Ideas For Kids Room...! | పిల్లలు చదువులో బాగా రానించాలంటే...!?

All parents want their children to fare well in their exams. But the main problem with children is their lack of concentration. It becomes really difficult for them to sit in one place for long and study. So why not give your kids an interesting desk that would inspire them to study. Decorate your kids room with some of these unique desk ideas to bring a smile on your child's face.
Story first published: Monday, July 16, 2012, 14:31 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter