For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నవరాత్రి కలర్ ఫుల్ గా ఉండాలంటే? ఇంటి అలంకరణ చిట్కాలు

|

నవరాత్రి పండుగను సౌత్ లోనే కాదు, నార్త్ లో కూడా గ్రాండ్ గా జరుపుకునే ఒక పెద్ద పండుగ, ఎందుకంటే, నవరాత్రిని 9 రోజుల పాటు సెలబ్రేట్ చేసుకుంటారు. అంతే కాదు, నవరాత్రి వేడకలను చాలా వరకూ అవుట్ డోర్స్ లోనే జరుపుకుంటారు. జన్మాష్టమి లేదా గణేష్ చతుర్థి వంటివి ఇండోర్ లో జరుపుకుంటారు. నవరాత్రి రోజుల్లో దేవాలయాల్లో దుర్గామాతను వివిధ రూపాల్లో కొలువు దీర్చి, తర్వాత దేవుడి ముందు దాండియా డ్యాన్స్ ను ప్రత్యేకంగా నృత్య ప్రదర్శన చేస్తారు. అయితే, కొందరు 9 రోజుల నవరాత్రి సెలబ్రేషన్స్ ను ఇంట్లోనే జరుపుకుంటారు. 9రోజులు ఇంట్లో పవిత్రంగా జరుపుకొనే నవరాత్రి పూజకు ఇల్లు కూడా అందంగా అలంకరించడం చాలా ముఖ్యం.

పువ్వులతో డెకరేషన్: ఇంటి అలంకరణలో ఫ్లవర్ డెకరేషన్ చేయడం చాలా సులభం మరియు మూల దండలను గోడలకు, స్తంభాలకు మరియు పైకప్పు వేలాడదీసి, అలంకరించడానికి పూలహారాలను ఉపయోగించవచ్చు. అలాగే మీరు కలషంను ఉంచే ప్రదేశంలో బారిగా రకరకాల పువ్వులతో గ్రాండ్ గా అలంకరించుకోవచ్చు.

4 Home Decoration Themes For Navratri

దేవుడిని కొలువుదీర్చే, టేబుల్ అలంకరణ: వివిధ కలర్స్ కలిగి టేబుల్ క్లాత్స్ మరియు దుప్పటాలు టేబుల్ డెకరేషన్ కు అందంగా కనబడుతాయి. అలాగే మిర్రర్ వర్క్ చేసిన కొన్నిటేబుల్ కవర్స్ లేదా దుప్పటాస్ చూడటానికి అట్రాక్షన్ గా కనబడుతాయి. ఇటువంటి కలర్ ఫుల్ డ్రాప్స్ తో పండుగ వాతారణం నెలకొంటుంది.

లైట్స్ తో డెకరేషన్: చాలా మంది పండుగ వేళల్లో పూజగది మరియు దేవుడి దగ్గర మిరిమిట్లు గొలిపే లైట్స్ తో ఇంటిని అలంకరిస్తుంటారు. అక్కడ మాత్రమే కాకుండా పండుగ వేళల్లో ఇల్లంతా కూడా దీపాలతో లేదా స్ట్రింగ్ లైట్స్ తో అలంకరించుకోవచ్చు. అలాగే డిఫరెంట్ టైప్ ల్యాంతర్స్ మరియు ఎలక్ట్రానిక్ లైట్స్ తో ఇళ్ళంతా కలర్ ఫుల్ గా అలంకరించుకోవచ్చు. ఇలా అలంకరించడం దుర్గాదేవిని ఆహ్వానించడానికి ఇదొకి మంచి ఆలోచన.

ముగ్గులతో అలంకరణ: మన ఇండియాలో ముగ్గులు లేకుండా ఏ పండుగ జరుపుకోరు. పండుగలు, శుభకార్యాలు అంటే వెంటనే రంగోలి డెకరేషన్ గుర్తొస్తుంది. కాబట్టి, నవరాత్రి పండుగ సమయంలో ఇల్లంతా ముగ్గులతో అలంకరించాలి . అలాగే కలషంను ఉంచే ప్రదేశంలో కూడా కలర్ఫుల్ గా ముగ్గులను తీర్చిదిద్దవచ్చు.

English summary

4 Home Decoration Themes For Navratri

Navratri is largely seen as an outdoor festival. Unlike Janmashtami or Ganesh Chaturthi that are usually celebrated indoors, for Navratri you go out to the 'Mata Ki Chauki' or to dance to the beats of dandiya. But still, the festivity does rub off on yout home as well. There are also some people who do Navratri puja at home.
Desktop Bottom Promotion