For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రంగుల పొదరిల్లు మరింత రొమాంటిక్ గా

|

ఇంటి గోడలన్నింటికీ ఒకే రంగు వేసి సరిపెట్టుకునేవాళ్లు ఇదివరకు. కాని ఇప్పుడు... ఇంటి ముఖ ద్వారం బయట కనిపించే గోడల దగ్గర్నించి బాత్రూమ్‌ గోడల వరకు వేరు వేరు రంగులు వేయిస్తున్నారు. ఈ రంగులు ఎంపిక చేసుకునే లోపు ఇంకో ఇల్లు కట్టేయొచ్చు అనేవాళ్లు లేకపోలేదు. అంతకష్టం అయిపోతోంది రంగుల ఎంపిక. ఇలాగెందుకంటే ఒక రంగుని ఎంపిక చేసుకుంటే కొన్ని నెలల పాటు అదే రంగుతో సహజీవనం చేయాలి. తీరా గోడలకు రంగు వేశాక పేపర్‌ మీద పెన్సిల్‌ గీతలను తుడిపేసినట్టు తుడిపేయలేం కదా. ఎంపిక చేసినప్పుడు ఒకలా అనిపించి వేశాక మరోలా అనిపిస్తే ఎలాగా... అంటున్నారా. ఆ పరిస్థితుల నుంచి బయటపడేందుకు ప్రస్తుతం మార్కెట్‌లో నడుస్తున్న కలర్‌ ట్రెండ్స్‌ గురించి తెలుసుకోవాలి.

లివింగ్‌ రూమ్‌ / హాల్‌

లివింగ్‌ రూమ్‌ / హాల్‌

హాల్‌ గోడలకి సన్నీ ఎల్లో అంటే సాయం సంధ్య వేళప్పుడు కనిపించే పసుపు రంగు వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఈ రంగు మీలోని ఆలోచనల్నే కాదు మిమ్మల్ని కూడా స్థిరంగా ఉంచుతుంది. అందుకేనేమో ఈ రంగుల్ని స్కూల్‌ బస్సులకు ఎక్కువగా వాడతారు. ఈ సన్నీ ఎల్లో కలర్‌ని లివింగ్‌ రూమ్‌ గోడలకు వేయిస్తే మీలో ఉత్తేజం కట్టలు తెంచుకోవడం ఖాయం. వీటిలో బాగా మెరిసే గోల్డ్‌, పంచీ, ఎసిడిక్‌ సిట్రస్‌ రంగులు ఉంటాయి. ఉత్తేజాన్నిచ్చే ఎల్లో షేడ్స్‌ జీవితంలో నూతన స్ఫూర్తిని నింపుతాయి. చిరునవ్వును చెదరనివ్వకుండా ఉంచే బెస్ట్‌ మెడిసిన్‌ ఈ రంగు. సన్నీ ఎల్లో వద్దనుకుంటే ఆరెంజ్‌, రెడ్‌, చార్‌కోల్‌, పేల్‌ గ్రే, నేవీబ్లూ రంగులు కూడా బాగుంటాయి.

కిచెన్‌

కిచెన్‌

ఆకుపచ్చ రంగు షేడ్స్‌లో ఉండే సీఫోమ్‌, మింట్‌, పేస్టల్‌, సాగ్‌లు వంటగది గోడలకు వేయాలి. ఆకుపచ్చని రంగులో అంతరంగా దాగి ఉన్న రంగులివి. ఒక రకంగా ఇవి వంటగదిలో నిశ్శబ్దంగా సరాగాలను పలికిస్తాయని చెప్పొచ్చు. ఈ రంగులు సంప్రదాయంగా కనిపించడమే కాదు లేటెస్ట్‌ ట్రెండ్‌కి తగ్గట్టుగా స్టయిల్‌ లుక్‌నిస్తాయి కూడా. మోడ్రన్‌ కిచెన్‌ మారథాన్‌లో ఈ రంగులు సరిగ్గా మ్యాచవుతాయి. లేత బూడిద రంగు, సన్నీ ఎల్లో, ఆరెంజ్‌, నేవీ బ్లూ రంగులు కూడా వంటగదికి బెటర్‌ చాయిసే.

డైనింగ్‌ రూమ్‌

డైనింగ్‌ రూమ్‌

భోజనాలు చేసే గదికి ముదురు రంగులు వేస్తేనే బాగుంటుంది. వీటిలో కూడా ఊదా రంగుల్లో ఉండే కొన్ని రంగులు బాగుంటాయి. ముఖ్యంగా డార్క్‌ప్లమ్‌ లేదా డస్టీ గ్రేయిష్‌ రంగులు మాంచి లుక్‌ ఇస్తాయి. గాలా పార్టీలకయినా, భార్యాభర్తలిద్దరే రొమాంటిక్‌ లంచ్‌ లేదా డిన్నర్‌ చేసేప్పుడయినా ఈ రంగులు తోడుగా ఉంటాయి. వీటితో పాటు లేత పసుపు రంగులు వాడినా లుక్‌ బాగుంటుంది. ఈ రంగుల గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది నోటితో పాటు కళ్లకూ విందునందిస్తాయి.

బెడ్‌రూమ్‌

బెడ్‌రూమ్‌

పడక గదులకు లేత బూడిద, లేత నీలం, లేత గులాబి, చార్‌కోల్‌, నేవీ, సన్నీ ఎల్లో, ఆరెంజ్‌, లావెండర్‌ రంగులు బాగుంటాయి. లేత గులాబీ రంగు వేసిన గోడలు మృదువుగా కనిపించడమే కాకుండా రొమాంటిక్‌ వెదర్‌ను సృష్టిస్తాయి. పింక్‌ అనగానే అమ్మాయిల కోసమే ఉన్న కలర్‌ అనుకుంటారు. కాబట్టి ఈ షేడ్స్‌ను ఎంపిక చేసుకోవడం కాస్త కష్టమే. వాస్తవానికి ఈ షేడ్స్‌ ఫెమినైన్‌ లుక్‌నిస్తాయే తప్ప మీరనుకుంటున్నట్టు పూర్తిగా అమ్మాయిలు ఇష్టపడే రంగులా కనిపించవు. అందుకని గో అండ్‌ గెట్‌ ఎ రొమాంటి క్‌ షేడ్‌.

కిడ్స్‌ బెడ్‌రూమ్‌

కిడ్స్‌ బెడ్‌రూమ్‌

షుగర్‌ అండ్‌ స్పైస్‌ - ఎవ్రీథింగ్‌ నైస్‌. గులాబీ రంగు చిట్టిపొట్టి పాపాయిలకు ఎంతో ఇష్టమయ్యే రంగు. ఈ రంగులో మాంచి షేడ్‌ను తీసుకుంటే చూడగానే హాయిగా, తాజాగా ఉంటుంది. ఈ రంగులు వేసిన కిడ్స్‌ బెడ్‌రూమ్‌ సున్నితమైన వాతావరణంతో నిండిపోతుంది. షేడ్స్‌ ఎంపికలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కోతి పుండు బ్రహ్మరాక్షసి అన్నట్టు తయారవుతుంది. అందుకే పిల్లల బెడ్‌రూమ్‌ షేడ్స్‌ ఎంపిక చేసేటప్పుడు హడావిడిగా కాకుండా మీ మనసు ప్రశాంతంగా ఉండాలి. కాస్త పెద్ద పిల్లలయితే చాయిస్‌ వాళ్లకే వదిలేయండి. లేత బూడిద రంగు, ముదురు బూడిద రంగులు కూడా పిల్లల బెడ్‌రూమ్స్‌కి బాగుంటాయి.

బాత్‌రూమ్‌

బాత్‌రూమ్‌

స్నానాలగది గ్లామర్‌గా కనిపించాలంటే ఆ గది గోడలకు నలుపు రంగు వేయాల్సిందే. మరీ ముఖ్యంగా బాత్‌రూమ్‌ సైజ్‌ చిన్నదిగా ఉన్నప్పుడు నలుపు రంగు వాడితే బాగుంటుంది. అపార్టుమెంట్‌ల్లో చిన్న చిన్న బాత్‌రూమ్‌లు ఉంటాయి కాబట్టి జస్ట్‌ ట్రై బ్లాక్‌. నలుపు అంటే మరీ కాకి నలుపే కానక్కర్లేదు. ఈ రంగులో కూడా షేడ్స్‌ ఉన్నాయి. నలుపురంగుని ఇష్టపడని వాళ్లు లేత ఆకుపచ్చ లేదా లేత నీలం రంగు షేడ్లు వేయించుకోవచ్చు.

Story first published: Friday, August 22, 2014, 17:44 [IST]
Desktop Bottom Promotion