For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అనుకోకుండా అథితులు వస్తున్నారా?చిటికెలో ఇల్లు సర్దేయండి

|

అనుకోకుండా అథితులు వచ్చి సర్ప్రైజ్ చేస్తే మీకు ఇష్టమా?మరి వచ్చే అథితులకు ఎలాంటి సౌకర్యం కల్పించాలనుకుంటున్నారు? మరియు వచ్చేవారు మీ ఇంట్లో మరింత సౌకర్యంగా ఎలా ఫీలవుతారు.

ఈ ఉరుకుల పరుగుల ప్రపంచంలో బిజీగా సోషియల్ లైఫ్ జీవిస్తున్నారంటే, తప్పనిసరిగా మీ ఇంటికి వచ్చే వారు మీకు ముందుగానే ఫోన్ చేసి చెప్పే వస్తారు కాబట్టి, మీరు ఇంట్లోనే ఉండి, కొంచెం శ్రమ మరియు కొంచెం సమయం వెచ్చించి ఇంటిని చక్కగా మీ అథితులు ఆశ్చర్య పడే విధంగా అలంకరించండి. ఎప్పటిలాగే కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఇంటిని అలంకరించడం వల్ల మీ ఇంటికి వచ్చే అథితులకు ఆశ్చర్యంతో పాటు, విశ్రాంతి, సంతోషాలు వెల్లువిరుస్తాయి. మీ సంబంధాలు మరింత గట్టిగా బలపడుతాయి. వారు ఒక రోజు లేదా రెండు రోజులు ఉండేట్లైతే వారికి అవసరం అయ్యే సదుపాయాలను సమకూర్చాలి. మద్యహ్నానం భోజనం మరియు రాత్రి డిన్నర్ స్పెషల్ గా వండితే ఆ వాతావరణం మరింత ఆహ్లాదకరంగా మారుతుంది.

అయితే ఇలా అనుకోకుండా సడెన్ గా వచ్చే అథితులకు కోసం కొద్ది సమయంలో మీరేం చేయాలి, మరియు ఇల్లంతా గజిబిజిగా వారిని స్వాగతిస్తే అటు వారికి ఇటు మీకు కూడా ఇబ్బంది కరంగా ఉంటుంది. కాబట్టి, అటువంటి పరిస్థితి ఎదుర్కోకుండా, ఇంటిని ఎప్పుడూ సాధ్యమైనంత వరకూ క్లీన్ అండ్ నీట్ గా ఉంచాలి. అందుకోసం కొన్ని చిట్కాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి...

క్లీనింగ్

క్లీనింగ్

అథితుల కోసం మీరు చేసే ఇంటి అలంకరణలో మొదటిది, మీ ఇల్లును క్లీన్ అండ్ నీట్ గా ఉంచడం. త్వరగా దుమ్ము దులిపేసి, ఫ్లోర్ ను మాప్ చేయాలి. ఇట్లు చెత్తా చెదారాన్ని తొలగించాలి. షింక్ లో ఉన్న పాత్రలను శుభ్రంగా కడిగి, షింక్ ను శుభ్రంగా కడిగి పెట్టాలి. సాధ్యం అయితే తేమలేకుండా పొడిగా ఉంచండి.

వస్తువులను ఎక్కడివక్కడ చక్కగా సర్ధండి

వస్తువులను ఎక్కడివక్కడ చక్కగా సర్ధండి

ఇంట్లో ప్రతి రోజు చదివే న్యూస్ పేపర్లు, ల్యాప్ టాప్, మొబైల్స్ వంటివి తీసి భద్రంగా సురక్షిత ప్రదేశంలో ఉంచాలి. ముఖ్యంగా లివింగ్ రూమ్ మరియు మిగిలిన రూమ్స్ లో కూడా వస్తువులు, దుస్తులు, పుస్తకాలు,న్యూస్ పేపర్లు చిందరవందరగా లేకుండా వెంటనే సర్ధేయండి. వెంటనే ఇల్లు చూడటానికి క్లీన్ గా మరియు నీట్ గా కనబడుతుంది. ఎంట్రన్స్ ఏరియా మరియు సిట్టింగ్ రూమ్ అందంగా కనబడేలా అలంకరించండి. టైట్ అండ్ ఫిట్ గా ఉండే కుషన్లను అరేంజ్ చేయండి.

బెడ్ కవర్స్, సోఫా కవర్స్ వంటివి మార్చండి

బెడ్ కవర్స్, సోఫా కవర్స్ వంటివి మార్చండి

అనుకోకుండా వచ్చే అథితులు ఒకటి రెండు రోజులు స్టే చేయాల్సి వస్తే?అందుకే ముందు జాగ్రత్తగా వారు రావడానికి ముందే బెడ్ షీట్లు, బెడ్ అండ్ పిల్లో కవర్స్, సోఫా కవర్స్ కుషన్ కవర్స్ ను క్లీన్ గా శుభ్రం చేసిన వాటిని మార్చాండి.

బాత్ రూమ్స్

బాత్ రూమ్స్

వచ్చే వారు ఎంత సమయం ఉన్నా, ఎన్ని రోజులున్నా కానీ, అథితుల కోసం ఇంటిని అలంకరించేప్పుడు, బాత్రూమ్ ను క్లీన్ చేయడం మర్చిపోకండి . షింక్స్, వాష్ బేషిన్స్, బాత్ టబ్స్ క్లీన్ గా ఉండేలా శ్రద్దతీసుకోండి . అలాగే బాత్రూమ్ లో అవసరానికి బాత్ టవల్స్, సోప్స్, టిష్యూలను అరేంజ్ చేసి ఉంచండి. టాయిలెంట్స్ ను శుభ్రంగా చేసి రూమ్ ఫ్రెష్ నర్స్ ను స్ప్రే చేయండి. అలాగే అద్దాలుకూడా శుభ్రం చేయండి. డర్టీ బాత్రూమ్స్ వల్ల మీ మీద ఇంప్రెషన్ పోతుంది.

సర్వ్ చేయడానికి వస్తువులను రెడీ గా ఉంచుకోండి

సర్వ్ చేయడానికి వస్తువులను రెడీ గా ఉంచుకోండి

సర్వ్ చేయడానికి సరిపడా స్నాక్స్ మరియు బెవరేజేస్ అందుబాటులో ఉంచుకోండి. పాతగా ఉన్న, పగిలిన సర్వింగ్ ప్లేట్స్, బౌల్స్, గ్లాసులు ను పక్కకు వేసి, కొత్తవాటిని తీసి పెట్టుకోండి. వాటిని శుభ్రంగా కడిగి తుడిచి పెట్టుకోవాలి . ఒక వేళ వారు ఎక్కువ సమయం ఉండేట్లు అయితే ఫుడ్ ఆర్డ్ చేయండి లేదా సరదాగా బయటకు వారితో పాటు వెళ్లవచ్చు.

ఫ్లవర్ వాజ్ ను అలంకరించండి

ఫ్లవర్ వాజ్ ను అలంకరించండి

తాజాగా మరియు గుభాళించే పువ్వుల కంటే ఇంటి మరేది ఫ్రెష్ గా కనబడనీయదు. కాబట్టి,అథితులకు మరింత ఆశ్చర్యపరిచే విధంగా ఉండాలంటే ఫ్లవర్ వాజ్ లను మరియు పాట్స్ ను, ఫ్లోటింగ్ బౌల్ ను పువ్వులతో అలంకరించండి. మీ ఇంట్లో గార్డెన్ ఉంటే కనుకు ఈ పని మరింత సులభం అవుతుంది.

English summary

Unexpected Guests? 6 Tips To Prepare Your Home


 What if you have unexpected guests dropping in? How do you prepare home for guests so that your hospitality is showcased to the best advantage? With people leading busy social lives, your guests will definitely call ahead to make sure you are at home, and give you a little time. It’s how you make use of those precious minutes to prepare home for guests that will make the difference.
Story first published: Thursday, September 11, 2014, 16:56 [IST]
Desktop Bottom Promotion